Shruthi Hasan High Remuneration For Chiranjeevi 154 Movie Deets Here - Sakshi
Sakshi News home page

Shruthi Hasan: హాట్‌ టాపిక్‌గా శ్రుతిహాసన్‌ రెమ్యునరేషన్‌.. చిరు సినిమాకు అన్ని కోట్లా ?

Published Fri, Mar 11 2022 3:11 PM | Last Updated on Fri, Mar 11 2022 6:32 PM

Shruthi Hasan High Remuneration For Chiranjeevi Movie - Sakshi

Shruthi Hasan High Remuneration For Chiranjeevi Movie: డైరెక్టర్‌ కెఎస్‌ రవీంద్ర అలియాస్‌ బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి 154వ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ యెర్నేని, వై. రవి శంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా శ్రుతిహాసన్‌ను ఎంపిక చేసినట్లు మహిళల దినోత్సవం రోజున ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ఒక విషయం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా కోసం శ్రుతిహాసన్‌ తీసుకునే రెమ్యునరేషన్‌ టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. 

చదవండి: చిరంజీవికి జోడిగా ఆ హీరోయిన్‌.. ఉమెన్స్‌ డే సందర్భంగా రివీల్‌



చిరు 154వ చిత్రం కోసం ఈ రేసుగుర్రం బ్యూటీ సుమారు రూ. 2 కోట్ల పారితోషికాన్ని డిమాండ్ చేసిందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అంతేకాకుండా ఆమె అడిగిన రెమ్యునరేషన్‌ను ఇచ్చేందుకు మేకర్స్‌ కూడా అంగీకరించారని సమాచారం. శ్రుతిహాసన్‌ చిరు సరసనే కాకుండా నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రభాస్‌కు జోడిగా కూడా నటిస్తోంది. అయితే శ్రుతిహాసన్‌.. బాలయ్య చిత్రానికి రూ. కోటిన్నర తీసుకోనున్నట్లు సమాచారం. సీనియర్‌ హీరోలకు జంటగా వరుస ఆఫర్లు రావడంతో శ్రుతిహాసన్‌ రెమ్యునరేషన్‌ పెంచేసినట్లు టాక్‌ వినిపిస్తోంది. 

చదవండి: బడ్జెట్‌ రూ.300 కోట్లు, అందులో సగం రెబల్‌ స్టార్‌కే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement