Nanyang Technological University
-
44లో మీదపడే..60లో ముదిమి
ముసలితనం. మనిషి జీవయాత్రలో అనివార్యమైన చివరి మజిలీ. అయినాసరే, దాని పేరు వింటేనే ఉలిక్కిపడతాం. తప్పదని తెలిసినా వృద్ధాప్యాన్ని తప్పించుకోవడానికి అనాదికాలంగా మనిషి చేయని ప్రయత్నం లేదు. ముదిమిని కనీసం వీలైనంత కాలం వాయిదా వేసేందుకు పడరాని పాట్లు పడేవాళ్లకు కొదవ లేదు! అలాంటి వాళ్లకు ఎంతగానో పనికొచ్చే సంగతొకటి వెలుగు చూసింది. మనిíÙకి వృద్ధాప్యం క్రమక్రమంగా సంక్రమించదట. జీవనకాలంలో రెండు కీలక సందర్భాల్లో ఒక్కసారిగా వచ్చి మీదపడిపోతుందట. 44వ ఏట ఒకసారి, 60వ ఏట రెండోసారి! అమెరికాలోని స్టాన్‌ఫర్డ్ వర్సిటీ, సింగపూర్‌లోని నాన్యాంగ్ టెక్నలాజికల్ వర్సిటీ చేసిన తాజా అధ్యయనంలో ఈ మేరకు తేలి్చంది. ఆ రెండు సందర్భాల్లోనూ వృద్ధాప్య సంబంధిత మార్పులు ఒంట్లోని అణువణువులోనూ ఉన్నట్టుండి భారీగా చేటుచేసుకుంటాయని వెల్లడించింది. ఇలా చేశారు... 25 నుంచి 75 ఏళ్ల వయసున్న 108 మందిని సైంటిస్టులు తమ అధ్యయనం కోసం ఎంచుకుంటున్నారు. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలవారూ నివసించే కాలిఫోరి్నయా నుంచి వీరిని ఎంపిక చేశారు. ప్రతి మూడు నుంచి ఆర్నెల్లకోసారి వారి రక్తం, మలం, చర్మం తదితర నమూనాలు సేకరించి పరిశీలించారు. మహిళల్లో 40ల అనంతరం తలెత్తే ముట్లుడిగే దశ వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుందన్న వాదన ఉంది. కనుక స్త్రీ పురుషులకు వేర్వేరు డేటాబేస్‌ను నిర్వహించారు. ఒంట్లో ఆర్ఎన్ఏ, ప్రొటీన్ల వంటి జీవాణువులు తదితరాల్లో వయసు మీద పడే తీరుతెన్నులను ఏళ్ల తరబడి నిశితంగా పరిశీలించారు. ఫలితాలు వారిని ఆశ్చర్యపరిచాయి. ఈ కీలక జీవాణువులన్నీ ఆడా, మగా తేడా లేకుండా 44వ ఏట భారీ మార్పుచేర్పులకు లోనైనట్టు గమనించారు. 60వ ఏట కూడా మళ్లీ అలాంటి మార్పులే అంతటి తీవ్రతతో చోటుచేసుకున్నాయి. ఫలితంగా స్త్రీ పురుషులిద్దరిలోనూ 55వ ఏట నుంచీ వృద్ధాప్య ఛాయలు కొట్టొచి్చనట్టు బయటికి కని్పంచడం గమనించారు. 40ల నుంచైనా మారాలి అధ్యయన ఫలితాలు తమను నిజంగా అబ్బురపరిచాయని నాన్యాంగ్ వర్సిటీ మైక్రోబయోమ్ విభాగ అసిస్టెంట్ ప్రొఫెసర్ జియావో టావో షెన్ అన్నారు. ‘‘ఉదాహరణకు కెఫిన్‌ను అరిగించుకునే సామర్థ్యం 40 ఏళ్లు దాటాక ఒకసారి, 60 నిండిన మీదట మరోసారి బాగా తగ్గుతుంది. మద్యాన్ని తీసుకున్నా అంతేనని మా పరిశోధనలో తేలింది’’ అని ఆయన చెప్పుకొచ్చారు. అంతేగాక 40 దాటాక ఒంట్లో కొవ్వు పేరుకుపోవడం బాగా పెరుగుతుందని స్టాన్‌ఫర్డ్ వర్సిటీ జెనెటిక్స్ విభాగం చీఫ్ మైకేల్ స్నైడర్ గుర్తు చేశారు. ‘‘ఆ దశలో కండరాలకు తగిలే గాయాలు ఓ పట్టాన మానవు కూడా. ఎందుకంటే ప్రొటీన్లు ఒంట్లోని కణజాలాలను పట్టి ఉంచే తీరు 44వ ఏట, 60వ ఏట చెప్పలేనంతగా మార్పులకు లోనవుతున్నట్టు తేలింది. ఫలితంగా చర్మం, కండరాలు, హృదయనాళాల వంటివాటి పనితీరు భారీ మార్పులకు లోనవుతోంది. వీటికి తోడు 60ల్లో మనుషుల్లో సాధారణంగా కండరాల క్షీణత ఒక్కసారిగా వేగం పుంజుకుంటుంది. దాంతో వారిలో హృద్రోగాలు, కిడ్నీ సమస్యలు, టైప్ 2 మధుమేహం వ్యాధుల రిస్కు ఎన్నో రెట్లు పెరుగుతోంది’’ అని వివరించారు. ఈ సమస్యలను ఎదుర్కోవడానికి తమ అధ్యయనం కొత్త దారులు తెరుస్తుందని ఆశాభావం వెలిబుచ్చారు. ఈ అధ్యయన ఫలితాలను నేచర్ ఏజింగ్ జర్నల్‌లో ప్రచురించారు. మధ్యవయసు దాటాక మెల్లిమెల్లిగా ముసలితనం గుప్పెట్లోకి వెళ్తామన్నది నిజం కాదు. 40 ఏళ్లు దాటాక రెండు కీలక దశల్లో మనం ఆదమరిచి ఉన్నప్పుడు మనకు తెలియకుండానే ముదిమి ఒక్కసారిగా వచ్చి మీదపడుతుంది’’ – జియావో టావో షెన్, అసిస్టెంట్ ప్రొఫెసర్, నాన్యాంగ్ వర్సిటీ జీవనశైలిలో ఆరోగ్యకరమైన మార్పులు చేసుకుంటే వృద్ధాప్యాన్ని వీలైనంతగా వాయిదా వేసుకోవచ్చన్నది మా అధ్యయన ఫలితాల సారాంశం. మధ్య వయసు దాటాకైనా మద్యం మానేయాలి. లేదంటే కనీసం బాగా తగ్గించాలి. నీళ్లు బాగా తాగాలి. ముఖ్యంగా 40ల్లోకి, 60ల్లోకి ప్రవేశిస్తున్న దశలో క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి’’ – మైకేల్ స్నైడర్, జెనెటిక్స్ విభాగం చీఫ్, స్టాన్‌ఫర్డ్ వర్సిటీ – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇది కదా ఆవిష్కరణ అంటే.. కాగితం బ్యాటరీ తయారు చేసిన ఆ దేశ సైంటిస్టులు!
మామూలుగా బ్యాటరీలను లిథియం, నికెల్, కోబాల్ట్‌తో పాటు ఇంకా రకరకాల రసాయనాలు వాడి తయారు చేస్తారు. అలాంటి రసాయనాలతో మున్ముందు మనుషులకు ప్రమాదమే. అలా కాకుండా పర్యావరణానికి హాని చేయని పదార్థాలతో బ్యాటరీ చేస్తే. మనకు బాగా పరిచయమున్న కాగితంతోనే తయారు చేస్తే. వావ్.. సూపర్ అంటారా. అనాల్సిందే. ఎందుకంటే సింగపూర్‌లోని నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ ఇలాంటి బ్యాటరీనే రూపొందించింది మరి. 4 సెంటీమీటర్ల పొడవు, వెడల్పు ఉండే ఈ బ్యాటరీ చిన్న ఫ్యాన్‌ను 45 నిమిషాలపాటు తిప్పగలదు. అరె.. కాగితంతో చేశారుగా.. మడిచేస్తే, కత్తిరిస్తే ఎలా? బ్యాటరీ పనిచేయదుగా అనుకునేరు! మడతేసినా, మెలితిప్పినా, ముక్కలు చేసినా విద్యుత్ ప్రవాహం ఆగదు. ఎలా తయారు చేశారబ్బా! కాగితంలో సెల్యులోజ్ అనే పదార్థం ఉంటుంది. ఈ సెల్యులోజ్లోని సూక్ష్మ స్థాయి గ్యాప్‌ను హైడ్రోజెల్‌తో పూడ్చేసి స్క్రీన్ ప్రింట్ చేసిన ఎలక్ట్రోడ్లు(క్యాథోడ్, ఆనోడ్)లను అతికించి ఈ బ్యాటరీని తయారు చేశారు. యానోడ్ తయారీకి జింక్, కార్బన్లను ఉపయోగిస్తే మాంగనీస్, నికెల్లతో క్యాథోడ్‌ను ముద్రించారు. ప్రింటింగ్ తరువాత రెండింటినీ ఒక ఎలక్ట్రోలైట్ ద్రావణంలో పెట్టి పలుచటి బంగారపు పూత పూస్తారు. ఈ బ్యాటరీ 0.4 మిల్లీమీటర్ల మందమే ఉంటుంది. ఒకసారి వాడాక ఈ బ్యాటరీల్లోని రసాయనాలన్నీ సహజసిద్ధంగా నశిస్తాయి. కాలుష్యం లేకుండా మాంగనీస్, నికెల్లు హైడ్రాక్సైడ్లుగా మారిపోతాయని పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త ప్రొఫెసర్ ఫాన్ హాంగ్జిన్ తెలిపారు. ప్రస్తుతం వాడుతున్న బ్యాటరీలకు ఇవి మంచి ప్రత్యామ్నాయం కాగలవన్నారు. (చదవండి: దూసుకెళ్తున్న బంగారం, వెండి ధరలు!) -
భారత్, చైనాలు కలసి పనిచేస్తే ఆసియాకు మేలు
సింగపూర్: భారత్, చైనాలు పరస్పర విశ్వాసంతో కలసి పనిచేస్తే ఆసియాకు మెరుగైన భవిష్యత్తు ఉంటుందని ప్రధాని మోదీ అన్నారు. సరిహద్దుల్లో ప్రశాంతత నెలకొనేలా సమస్యలు పరిష్కరించుకోవడంలో ఇరు దేశాలు గొప్ప పరిపక్వత, విజ్ఞానాన్ని ప్రదర్శించాయని తెలిపారు. సింగపూర్ పర్యటనలో ఉన్న మోదీ శుక్రవారం ‘షాంగ్రి–లా’ సమావేశంలో కీలకోపన్యాసం చేశారు. 28 ఆసియా–పసిఫిక్ దేశాల అంతర ప్రభుత్వ భద్రతా వేదిక అయిన ఈ కార్యక్రమాన్ని 2002 నుంచి సింగపూర్‌లోని షాంగ్రి–లా అనే హోటల్లో ఏటా నిర్వహిస్తున్నారు. విభేదాలు, స్పర్థలను పక్కనపెట్టి ఈ ప్రాంత దేశాలన్నీ కలసి పనిచేయాల్సిన సమయం వచ్చిందన్నారు. ప్రాంతీయ సముద్ర తీర వివాదాలను ప్రస్తావిస్తూ..ఇండో–పసిఫిక్ ప్రాంతాన్ని భారత్ ఓ వ్యూహంగానో, కొందరి సభ్యుల క్లబ్గానో చూడదని ఉద్ఘాటించారు. ‘చర్చలు, ఉమ్మడి నిబంధనల ఆధారిత విధానాల ఆధారంగానే ఈ ప్రాంత అభివృద్ధి, భద్రత సాధ్యమని విశ్వసిస్తున్నాం. స్థిరమైన, వివక్షలేని అంతర్జాతీయ వాణిజ్య విధానాలకే భారత్ మద్దతిస్తుంది. పోటీ ఎక్కడైనా ఉంటుంది. కానీ పోటీ ఘర్షణగా, విభేదాలు వివాదాలుగా మారకూడదు’ అని వాణిజ్యంలో పెరిగిపోతున్న రక్షణాత్మక ధోరణులను పరోక్షంగా ప్రస్తావించారు. ఇండో–పసిఫిక్ ప్రాంత భవిష్యత్తుకు ఆసియాన్ కేంద్ర బిందువుగా ఉండబోతోందని జోస్యం చెప్పారు. ప్రాంతీయ అనుసంధానత వ్యాపారాభివృద్ధిని మించి వేర్వేరు దేశాలను చేరువ చేస్తోందని అన్నారు. అంతకు ముందు, మోదీ సింగపూర్ అధ్యక్షురాలు హలీమా యాకూబ్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అంతరాలను చెరిపేస్తున్న సాంకేతికత: మోదీ సాంకేతికత ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందికి గొంతుకగా మారి, సామాజిక అడ్డంకులను తొలగిస్తోందని మోదీ అన్నారు. సృజనాత్మకతకు మానవీయ విలువలు జోడించి ఈ శతాబ్దపు సవాళ్లను అధిగమించాలని పిలుపునిచ్చారు. సింగపూర్‌లోని ప్రతిష్టాత్మక నన్యంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ(ఎన్టీయూ)లో నిర్వహించిన ట్రాన్స్ఫార్మింగ్ ఆసియా త్రూ ఇన్నోవేషన్’ అనే సదస్సులో మోదీ ప్రసంగించారు. మార్పును వినాశకారిగా చూడొద్దని, సాంకేతికత ఆధారిత సమాజం వల్లే అంతరాలు నశిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. పాశ్చాత్య దేశాల ఆధిపత్యం 300 ఏళ్ల నుంచే.. ‘21వ శతాబ్దం ఆసియాదే. మరి మనకు ఈ సెంటిమెంట్ ఉందా అన్నదే అతిపెద్ద సవాలని అనుకుంటున్నా. ప్రతి సృజనాత్మకత తొలుత అవాంతరంగా కనిపిస్తుంది. సమాజంలోని అంతరాలను సాంకేతికత సాయంతో పారదోలొచ్చు. సాంకేతికత అందరికీ అందుబాటులో ఉంటూ వినియోగదారుడికి అనుకూలంగా ఉండాలి. డిజిటల్ యుగానికి తగినట్లుగా నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగాల కల్పన, వ్యవసాయ ఉత్పాదకత పెంపు, నీరు, గాలి కాలుష్యం, శరవేగంగా పెరుగుతున్న పట్ణణీకరణ, వాతావరణ మార్పులు, ఎక్కువ కాలం నిలిచే మౌలిక వసతుల నిర్మాణం, సముద్ర వనరుల పరిరక్షణ తదితరాలు నేడు మనకు సవాళ్లు విసురుతున్నాయి. సుమారు 1600 ఏళ్ల పాటు ప్రపంచ జీడీపీలో భారత్, చైనాల వాటానే 50 శాతంగా ఉండేది. గత 300 ఏళ్ల నుంచే పాశ్చాత్య దేశాల ఆధిపత్యం మొదలైంది. సాంకేతికతను ఆయుధాల తయారీకి వినియోగిస్తే ప్రపంచ దేశాల మధ్య ఘర్షణలు తప్పవు’ అని మోదీ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎన్టీయూ, భారత వర్సిటీల మధ్య విద్య, పారిశ్రామిక భాగస్వామ్యానికి సంబంధించి ఆరు ఒప్పందాలు కుదిరాయి. ఇక్కడ నిర్వహించిన ఎగ్జిబిషన్‌కు హాజరైన మోదీ..మనుషులతో సంభాషించే ఓ రోబోతో మాట్లాడారు. లూంగ్‌కు బౌద్ధ జ్ఞాపిక ప్రదానం.. చర్చల సందర్భంగా లూంగ్‌కు మోదీ 6వ శతాబ్దం నాటి బౌద్ధగుప్త జ్ఞాపిక నమూనాను కానుకగా ఇచ్చా రు. బౌద్ధమతం భారత్ నుంచి ఆగ్నేయాసియాకు వ్యాపించిందనడానికి సాక్ష్యంగా భావిస్తున్న ఈ జ్ఞాపికపై సంస్కృత వాక్యాలున్నాయి. అలాగే, సింగపూర్ మాజీ రాయబారి టామీ కోహ్(80)కు ప్రధాని మోదీ పద్మశ్రీ పురస్కారాన్ని అందజేశారు. ఈ ఏడాది పద్మశ్రీ పొందిన ఆసియాన్ దేశాలకు చెందిన 10 మందిలో కోహ్ ఒకరు. కోహ్ గతంలో అమెరికా, ఐక్యరాజ్య సమితిలో రాయబారిగా చేశారు. 8 ఒప్పందాలపై సంతకాలు ఆర్థిక, రక్షణ సంబంధాలను బలోపేతం చేసుకోవాలని భారత్, సింగపూర్ నిర్ణయించాయి. నావికా దళాల మధ్య రవాణా సహకారం సహా ఇరు దేశాల మధ్య 8 ఒప్పందాలు కుదిరాయి. ప్రధాని మోదీ, సింగపూర్ ప్రధాని లూంగ్‌తో చర్చలు జరిపారు. ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ, అంతర్జాతీయ వ్యవహారాలపై చర్చించారు. సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం(సీఈసీఏ)పై రెండో సమీక్ష సమావేశం విజయవంతమైందని మోదీ తెలిపారు. లూంగ్ మాట్లాడుతూ.. ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాలు పటిష్టమయ్యాయని అన్నారు. సింగపూర్ కంపెనీల సహకారంతో నిర్మిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, పుణే విమానాశ్రయ అభివృద్ధిని ప్రస్తావించారు. -
సెల్ఫీలు మన గురించి చెప్పేస్తాయి!
సెల్ఫీలంటే సరదాగా తీసుకునే స్వీయ చిత్రాలు మాత్రమే కాదు. అవి మన వ్యక్తిత్వాన్ని గురించి మనకు చెబుతాయి అంటోంది తాజా అధ్యయనం ఒకటి. మనలోని అంతర్ముఖత్వం, అంకితభావం, స్వార్థం, నిస్వార్థం, ధైర్యం, పిరికితనం...ఇలా ఎన్నో లక్షణాలను సెల్ఫీలు చెబుతాయి. ‘‘ఫోటో మాత్రమే అనుకుంటాంగానీ అది మన వ్యక్తిత్వంలోని ఎన్నో కోణాలను మనకు చెబుతుంది’’ అంటున్నారు సింగపూర్‌లోని నన్యాంగ్ టెక్నాలజికల్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు. సెల్ఫీ కోసం ఎంచుకున్న ప్రదేశం, భంగిమ, కెమెరాకు సంబంధించిన సాంకేతిక అంశాలు... మొదలైనవి మన వ్యక్తిత్వాన్ని పట్టిస్తాయట. ఇతర వ్యక్తులు తీసే ఫోటోల కంటే సెల్ఫీలే వ్యక్తిత్వాన్ని అంచనా వేయడంలో సూచికలుగా పనిచేస్తాయంటున్నారు పరిశోధకులు. పుస్తకాలుగా వచ్చిన ప్రముఖుల సెల్ఫీలను కూడా తమ అధ్యయనానికి పరిశోధకులు ఉపయోగించుకున్నారు. రెండు ఉదాహరణలు సంతోషంగా, నవ్వు ముఖంతో కనిపించడం అనేది సిగ్నేచర్ సెల్ఫీ లుక్! ఇలాంటి సెల్పీలు మనలోని సానుకూల దృక్పథాన్ని చాటడంతో పాటు ఇతరులకు సహాయం చేసే మనస్తత్వాన్ని తెలియజేస్తాయట. ముఖం కింది నుంచి సెల్ఫీ తీసుకోవవడం పట్టు విడుపులు లేని ధోరణిని, సరికొత్త ప్రయోగ దృక్పథాన్ని తెలియజేస్తుందట. ప్రైవేటు ప్లేస్‌లలో సెల్ఫీలు తీసుకోకవపోవడం అనేది మనస్సాక్షి విలువనిచ్చే వైఖరికి అద్దం పడుతుంది. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే.