Chinnappa
-
సుంకరి చిన్నప్పల నాయుడు కు " సాక్షి ఎక్సలెన్స్ అవార్డు "
-
చంద్రబాబు సిద్ధాంతాలు నచ్చట్లేదు
-
బీటెక్ రవి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి
పులివెందుల : ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథరెడ్డి (బీటెక్ రవి) వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే పద్ధతిగా ఉంటుందని పులివెందుల మున్సిపల్ వైస్ చైర్మన్ చిన్నప్ప పేర్కొన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహిస్తున్నారని బీటెక్ రవి పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అసలు ఫ్యాక్షనిస్టులు ఎవరో జిల్లా ప్రజలందరికి తెలుసున్నారు. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి సౌమ్యుడని.. జిల్లాలోని రాజకీయ నాయకులు, ప్రజలను ఎవరిని అడిగినా చెబుతారన్నారు. మంత్రి ఆదినారాయణరెడ్డి ప్రజల మధ్య ఫ్యాక్షనిజాన్ని లేపుతున్నారని సాక్షాత్తూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి పేర్కొనడం జరిగిందన్నారు. కేవలం తమ పార్టీ కార్యకర్తకు శుభాకాంక్షలు తెలిపేందుకే ఎంపీ పెద్ద దండ్లూరు గ్రామానికి వెళ్లారన్నారు. టీడీపీ నాయకుల చర్యలను ప్రజలు గమనిస్తున్నారని వారికి తగిన విధంగా బుద్ధి చెబుతారన్నారు. -
కాస్త మెరుగు పడిన జోస్న!
న్యూఢిల్లీః భారత స్వ్రాష్ క్రీడాకారిణి జోస్న చిన్నప్ప ఈ సారి ర్యాంకుల్లో కొంత మెరుగు పడింది. ఇంతకు ముందున్న ర్యాంకు కంటే రెండు స్థానాలకు ఎదిగి ఇప్పుడు 11వ స్థానంలో నిలిచింది. ప్రొషెషనల్ స్క్వాష్ అసోసియేషన్ (పీఎస్ఏ) తాజాగా విడుదల చేసిన క్రీడాకారుల ర్యాంకుల్లో జోస్న కొంతశాతం మెరుగు కనబరిచింది. గతవారం హాంకాంగ్ లో జరిగిన టోర్నీలో తనదైన ప్రతిభను ప్రదర్శించి ర్యాంకుల జాబితాలో స్క్వాష్ క్రీడాకారిణి జోస్న మరో మెట్టు ఎక్కగలిగింది. గతంలో 13వ ర్యాంకులో ఉన్న జోస్నతాజా జిబితాలో 11వ ర్యాంకును సాధించింది. తన ఇండియా టీమ్ మేట్ దీపికా పల్లికల్ కూడ తన స్థానంలో కాస్త మెరుగును కనబరిచి 18 వ ర్యాంకుకు ఎగబాకింది. అలాగే గాయంతో చికిత్స పొందుతున్న సౌరవ్ ఘోషల్ పురుషుల ర్యాంకుల్లో 17వ స్థానంలో ఉన్నాడు. -
పెరిగిన పింఛను తీసుకోకనే..
తప్పని వృద్ధాప్యం, వెంటాడే ఆయాసం ఆయన పాలిట శాపంగా మారాయి. పెరి గిన పింఛను డబ్బులు తీసుకుని మందులు కొనుక్కోవాలనుకున్నాడు. మంగళవారం గ్రామసభలకు హాజరయ్యాడు. తొందరలో మాత్రలు వెంట తెచ్చుకోలేదు. సభ జరుగుతుండగానే ఆయాసం వచ్చింది. వైద్యులు పరీక్షిస్తుండగానే కన్నుమూశాడు. ఈ విషాద సంఘటన మదనపల్లె మండలం పోతపోలులో చోటు చేసుకుంది. మదనపల్లె రూరల్: మదనపల్లె మండలం పోతపోలులో నిర్వహించిన జన్మభూమి గ్రామసభలో ఓ వృద్ధుడు మృతిచెందాడు. పోతపోలు గ్రామంలో మంగళవారం ఉదయం 9 గంటలకు జన్మభూమి గ్రామసభ సర్పంచ్ పఠాన్ ఖాదర్ ఖాన్ ఆధ్వర్యంలో ప్రారంభమైంది. 27 పల్లెల నుంచి రెండు వేల మందికిపైగా ప్రజలు వచ్చారు. గ్రామ సభకు వస్తే పింఛను ఇస్తామని చెప్పడంతో మందుల ఖర్చుకు ఉంటుందని ఆశపడి పోతపోలు హరిజనవాడకు చెందిన పిచ్చోళ్ల చెన్నప్ప(65) సభకు వచ్చాడు. ఆయాసంతో బాధపడుతున్న ఆయన స్పృహ కోల్పోయాడు. వైద్యులకు సమాచారం అందించారు. అదే సభకు హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ దేశాయితిప్పారెడ్డి చెన్నప్పను పరీక్షిస్తుండగానే కన్నుమూశాడు. భర్త మరణవార్త విన్న చెన్నప్ప భార్య వెంకటమ్మ గుండెలు బాదుకుంది. ‘నన్నూ నీతో పాటే తీసుకెళ్లి పోరాదా..’ అంటూ ఏడ్వడం స్థానికుల హృదయాలను కలచివేసింది. రావద్దంటే వచ్చాడు.. ‘ఆరోగ్యం బాగలేదు. గ్రామ సభకు రావద్దు అంటే వినలేదు. పింఛన్ రద్దు చేస్తారేమోనన్న భయంతో ఇక్కడికి వచ్చాడు. తీరా ఇక్కడికి వచ్చి ప్రాణం పోగొట్టుకున్నాడు’ అంటూ మృతుని కుమారుడు రెడ్డెప్ప తెలిపారు. రెండు రోజులుగా ఆస్పత్రిలో ఉన్నామని, అక్కడే ఉంటే బతికేవాడని అన్నాడు. పరామర్శించిన సబ్ కలెక్టర్ జన్మభూమి గ్రామసభలో మృతిచెందిన పిచ్చోళ్ల చెన్నప్ప కుటుంబాన్ని మదనపల్లె సబ్ కలెక్టర్ ఆర్వీ.కర్ణన్ పరామర్శించారు. ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.తలెత్తినా వీరు గమనించడం లేదు. కొందరైతే ఇళ్ల వద్దకు వెళ్లకుండానే నెలలపాటు యావరేజ్ రీడింగ్‌ను వేస్తూ ఒక్కసారిగా కొంపకొల్లేరు చేస్తున్నారు. ఈ విషయమై పలమనేరు ట్రాన్స్‌కో ఏడీ రాజశేఖర్‌రెడ్డిని వివరణ కోరగా ప్రైవేటు ఏజెన్సీల వల్ల ప్రతినెలా తమకు ఇలాంటి తలనొప్పులు వస్తూనే ఉన్నాయన్నారు. 180 వచ్చే బిల్లు 1,300 వస్తే ఎట్ల కట్టేది మాకు ప్రతినెలా 180 రూపాయల నుంచి ఇన్నూరు దాకా బిల్లొచ్చేది. ఇప్పుడు 1,300 వచ్చింది. ఇదేమని రీడింగ్ తీసే వాళ్లని అడిగితే ఆఫీసులో పోయి మాట్లాడుకోండి అంటూ దురుసుగా చెప్పి వెళ్లారు. అక్కడికెళ్లి బిల్లు చూపిస్తే దాంతో మాకు సంబంధం లేదు మొత్తం డబ్బు కట్టాల్సిందేఅంటారు. మా కోడలోళ్లకు రూ.2,700 వచ్చింది. -తవ్వమణి, డ్రైవర్స్ కాలనీ, గంగవరం మండలం రెండు బల్బులకు నాలుగొందలా.. మాకు ప్రతినెలా రూ.140 బిల్లోస్తా ఉన్నింది. పగటి పూట కూలి పనులకెళతాం. సాయంత్రం వచ్చి అన్నం చేసుకుని తిని లైట్లు ఆఫ్ చేసి పడుకుంటాం. ఇంత పొదుపుగా కరెంటు వాడుకున్నా ఈనెల రూ.451 బిల్లొచ్చింది. నెలనెలా రీడింగ్కొచ్చే వాళ్లు ఒక్కోసారి రానే రారు. వాళ్లిష్టానుసారంగా రీడింగ్ తీసుకొనిపోతే దానికి మేం బాధ్యులమా? -శాంతమ్మ, డ్రైవర్స్ కాలనీ, గంగవరం మండలం -
మేరీమాత ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు
విజయవాడ, న్యూస్‌లైన్ : గుణదల మేరీమాత ఆలయంలో ఫిబ్రవరిలో మేరీమాత ఉత్సవాలు నిర్వహించనున్నట్లు విజయవాడ కథోలిక పీఠం రెక్టర్ ఫాదర్ మెరుగుమాల చిన్నప్ప తెలిపారు. గుణదలమాత ఆలయ ఆవరణలోని కమ్యూనిటీ హాలులో గురువారం సాయంత్రం ఉత్సవాలపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చిన్నప్ప మాట్లాడుతూ ఫిబ్రవరి 9, 10, 11 తేదీల్లో ఉత్సవాలు నిర్వహిస్తామని, రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు, పర్యాటకులు వస్తారని, వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. పటిష్టమైన ప్రణాళికతో తిరునాళ్లను ఘనంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. తాగునీటికి ఇబ్బంది లేకుండా కొండ ఎగువ భాగం నుంచి పలు ప్రదేశాల్లో తాత్కాలిక నీటి ట్యాంకులు సిద్ధం చేస్తామని చెప్పారు. భక్తులు క్రమపద్ధతిలో మేరీమాతను దర్శించుకునేందుకు బారికేడ్లు ఏర్పాటుచేస్తామని పేర్కొన్నారు. ఆయా శాఖల అధికారులతో సంప్రదించి విద్యుత్, వైద్యం, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతులను కల్పిస్తామన్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా భద్రతా చర్యలు చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కథోలిక పీఠం కోశాధికారి ఫాదర్ ఎం.గాబ్రియేల్, ఎస్ఎస్సీ డెరైక్టర్ ఫాదర్ మువ్వల ప్రసాద్, యూత్ సెంటర్ డెరైక్టర్ ఫాదర్ దేవకుమార్, ఫాదర్ కిషోర్ పాల్గొన్నారు.