కాస్త మెరుగు పడిన జోస్న! | Joshna Chinappa moves to career-high 11th in squash rankings | Sakshi
Sakshi News home page

కాస్త మెరుగు పడిన జోస్న!

Published Wed, Jun 1 2016 8:51 PM | Last Updated on Mon, Sep 4 2017 1:25 AM

కాస్త మెరుగు పడిన జోస్న!

కాస్త మెరుగు పడిన జోస్న!

న్యూఢిల్లీః భారత స్వ్రాష్ క్రీడాకారిణి జోస్న చిన్నప్ప ఈ సారి ర్యాంకుల్లో కొంత మెరుగు పడింది. ఇంతకు ముందున్న ర్యాంకు కంటే రెండు స్థానాలకు ఎదిగి ఇప్పుడు 11వ స్థానంలో నిలిచింది. ప్రొషెషనల్ స్క్వాష్ అసోసియేషన్ (పీఎస్ఏ) తాజాగా విడుదల చేసిన క్రీడాకారుల ర్యాంకుల్లో జోస్న కొంతశాతం మెరుగు కనబరిచింది.

గతవారం హాంకాంగ్ లో జరిగిన టోర్నీలో తనదైన ప్రతిభను ప్రదర్శించి ర్యాంకుల జాబితాలో స్క్వాష్ క్రీడాకారిణి జోస్న మరో మెట్టు ఎక్కగలిగింది. గతంలో 13వ ర్యాంకులో ఉన్న జోస్నతాజా జిబితాలో 11వ ర్యాంకును సాధించింది. తన ఇండియా టీమ్ మేట్ దీపికా పల్లికల్ కూడ తన స్థానంలో కాస్త మెరుగును కనబరిచి 18 వ ర్యాంకుకు ఎగబాకింది. అలాగే గాయంతో చికిత్స పొందుతున్న సౌరవ్ ఘోషల్ పురుషుల ర్యాంకుల్లో 17వ స్థానంలో ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement