moves
-
కదిలే ఇల్లు! ధర తక్కువ...ఎక్కడికైనా తీసుకుపోవచ్చు
హనుమకొండ: సొంతిల్లు నిర్మించుకుకోవాలంటే నెలల సమయం పడుతుంది. ఒక ప్రాంతంలో ఇంటిని నిర్మిస్తే శాశ్వతంగా ఆ చోటే ఉంటుంది. కానీ.. మారుతున్న కాలానికి అనుగుణంగా కదిలే ఇళ్లు వస్తున్నాయి. వరంగల్ నగరంలోని వడ్డేపల్లిలో ఏర్పాటు చేసిన మొబైల్ హౌజ్ నగరవాసులను ఆకట్టుకుంంటోంది. వడ్డేపల్లికి చెందిన బొల్లేపల్లి సుహాసిని, సతీష్ గౌడ్ దంపతులు సుబేదారి–వడ్డేపల్లి ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న సొంత ప్లాట్‌లో ఇల్లు కట్టాలనుకున్నారు. ఎక్కువ డబ్బులు అవుతుండటంతో రెడీమేడ్ హౌస్ గురించి తెలుసుకుని, వారిని సంప్రదించారు. రూ. 8.50 లక్షలతో కిచెన్, సింగిల్ బెడ్ రూం, అటాచ్డ్ బాత్ రూం, హాల్‌తో పూర్తిగా ఐరన్ ఉపయోగించిన మొబైల్హౌస్ను నిర్మించారు. లారీలో తీసుకువచ్చి బిగించేశారు. ఈ ఇంటిని ఎక్కడికైనా తరలించుకునే అవకాశముంది. 30 ఏళ్లకుపైగా పటిష్టంగా ఉంటుందని గ్యారంటీ ఇచ్చినట్లు సతీష్‌గౌడ్ తెలిపారు. ఇల్లు 4 టన్నుల బరువు ఉంది. (చదవండి: 63 ఏళ్ల వయసులో 6,000 కిలో మీటర్ల సైక్లింగ్) -
ఆ యాప్స్‌ను మూసేస్తున్న ఫేస్బుక్
న్యూఢిల్లీ : సోషల్ నెట్వర్కింగ్ దిగ్గజం ఫేస్బుక్ మూడు యాప్స్‌ను మూసేస్తోంది. హలో, మూవ్స్, టీబీహెచ్ అనే యాప్స్‌ను మూసేస్తున్నట్టు ఫేస్బుక్ ప్రకటించింది. తక్కువ వాడకం కారణంతో ఈ యాప్స్‌ను తీసేస్తున్నామని కంపెనీ తెలిపింది. బ్రెజిల్, అమెరికా, నైజిరియాలోని ఆండ్రాయిడ్ యూజర్ల కోసం 2015లో హలో యాప్‌ను ఫేస్బుక్ లాంచ్చేసింది. ఇది యూజర్ల ఫేస్బుక్ సమాచారాన్ని, ఫోన్లోని కాంటాక్ట్ సమాచారంతో కలుపుతూ ఉంటుంది. మరికొన్ని వారాల్లోనే కంపెనీ హలో యాప్‌ను తీసేయబోతుంది. ఇక రెండో యాప్ మూవ్స్. ఈ ఫిట్నెస్ యాప్‌ను 2014లో ఫేస్బుక్ కొనుగోలు చేసింది. యూజర్ల రోజువారీ కార్యకలాపాలు వాకింగ్, సైక్లింగ్, రన్నింగ్ వంటి వాటిని రికార్డు చేయడం కోసం ఈ యాప్ ఉపయోగపడుతుంది. జూలై 31 నుంచి ఈ యాప్‌ను ఫేస్బుక్ మూసేస్తుంది. ఇక చివరి యాప్ టీబీహెచ్. గతేడాదే దీన్ని ఫేస్బుక్ కొనుగోలు చేసింది. అమెరికాలోని హైస్కూల్ విద్యార్థులకు ఈ సోషల్ మీడియా యాప్ సుపరిచితమే. ప్రస్తుతం తొలగిస్తున్న ఈ యాప్స్‌లోని యూజర్ల డేటాను 90 రోజుల్లో తొలగిస్తామని కంపెనీ చెప్పింది. తరుచూ తమ యాప్స్‌పై సమీక్ష చేపడుతూ ఉంటామని, ఈ సమీక్షలో తక్కువగా వాడే యాప్స్‌ను తొలగించేలా నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. కొంతమంది యూజర్లు ఇంకా ఈ యాప్స్‌ను వాడుతున్నారని, వారికి ఇది నిరాశ కలిగించే అంశమని, మీ సపోర్టు తమకు అందించినందుకు కృతజ్ఞతలని కంపెనీ తెలిపింది. తాజాగా ఫేస్బుక్ మరో కొత్త ఫీచర్ స్నూజ్ను పరిశీస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఫీచర్ ద్వారా కొన్ని పోస్టులను 30 రోజుల పాటు మ్యూట్‌లో పెట్టుకోవచ్చు. ఈ ఫీచర్ టెస్టింగ్‌ను ఫేస్బుక్, టెక్‌క్రంచ్‌కు ధృవీకరించింది. కొంతమంది యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్‌ను ఫేస్బుక్ ఆవిష్కరించనుంది. -
మైఖెల్ జాక్సన్‌లా డాన్స్.. జర జాగ్రత్త..
చండీగఢ్ : డాన్స్ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు పాప్ సంగీత రారాజు ‘మైఖెల్ జాక్సన్’. ఆయన చేసిన మూమెంట్స్‌లో ప్రముఖమైనవి ‘మూన్‌వాక్’, ‘ గ్రావిటీ డిఫైయింగ్’. నేటి తరం ఆయనలా డాన్స్ చేయాలని ముఖ్యంగా ఈ రెండిటిని చేసి అందరి మెప్పుపొందాలని చూస్తుంటారు. అయితే మైఖెల్లా డాన్స్ చేయడం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు న్యూరోసర్జన్లు. ఆయన చేసిన డాన్స్ మూమెంట్లను అనుకరించటం ద్వారా వెన్నెముకకు గాయాలయ్యే అవకాశం ఎక్కువంటున్నారు. చండీగఢ్‌కు చెందిన ‘పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’ న్యూరోసర్జన్ల బృందం ఈ విషయాన్ని ధృవీకరించింది. ‘స్మూత్ క్రిమినల్’ ఆల్బమ్‌లో మైఖెల్ జాక్సన్ చేసిన 45 డిగ్రీ బెండ్ మూమెంట్ వల్ల వెన్నెముక దెబ్బ తినే అవకాశం ఉందంటున్నారు. ఎముకలను వేగవంతంగా కదిలించడం, ఒత్తిడికి గురిచేయటం ద్వారా నష్టం వాటిల్లుతుందంటున్నారు. శరీరాన్ని ఒక స్థాయికి మించి వంచడం వల్ల వెన్నెముకకు గాయాలవుతాయని తెలిపారు. వెన్నెముకకు గాయాలైన వారిలో కొంతమందికి ఫిజియోథెరపితో నయం అయితే మరికొంత మందికి శస్త్ర చికిత్స చేయాల్సి ఉంటుందంటున్నారు. ప్రమాదకరమైన భంగిమలతో కూడిన డాన్స్‌లతో శరీర అవయవాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని హెచ్చరిస్తున్నారు న్యూరోసర్జన్లు. మెప్పు పొందాలని చూస్తే ముప్పు తప్పదంటున్నారు. -
ఇక ఉంటా.. మీ సైన్స్ ఎక్స్‌ప్రెస్
ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న కాలుష్యం కారణంగా గతి తప్పుతున్న వాతావరణం.. ఫలితంగా ఏర్పడుతున్న దుష్ర్పభావాలు.. రాబోయే విపత్తులను ఎలా ఎదుర్కోవాలి? ఎలా అరికట్టాలన్న పరిష్కార మార్గాల విశేషాలతో కర్ణాటకలోని గుల్బర్గా నుంచి గార్లదిన్నె మండలంలోని కల్లూరు రైల్వే స్టేషన్‌కు చేరుకున్న సైన్స్ ఎక్స్‌ప్రెస్ రైలు.. మూడు రోజుల పాటు విద్యార్థులకు విజ్ఞానాన్ని పంచింది. 16 బోగీలు కలిగిన ఈ ఏసీ రైలులో 15 బోగీల్లో విజ్ఞాన సమాచారంతో నింపేశారు. ఈ మూడురోజుల్లో జిల్లాలోని పలు పాఠశాలలకు చెందిన 17,897 మంది విద్యార్థులు ఈ రైలును సందర్శించారు. చివరి రోజు రైల్వే శాఖ అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ రాజేంద్రప్రసాద్ కూడా ఈ రైలును పరిశీలించారు. సోమవారం సాయంత్రం ఐదు గంటలకు ఈ విజ్ఞాన భాండాగారం బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌కు బయలుదేరి వెళ్లిపోయింది. - గార్లదిన్నె (శింగనమల) -
హెచ్-1బీ వీసాదారుల నెత్తిన మరో బాంబు
వాషింగ్టన్: ట్రంప్ ప్రభుత్వం హెచ్-1బీ వీసాదారులకు మరో బాంబు వేయడానికి రడీ అవుతోంది. వీసా సంస్కరణలు, ప్రీమియం వీసాలపై తాత్కాలిక నిషేదం లాంటి సంచలన నిర్ణయాలతో భారత ఐటీ ఉద్యోగుల గుండెల్లో గుబులుపుట్టిస్తున్న అమెరికా ప్రభుత్వం మరో షాకింగ్ చర్యలకు రంగం సిద్ధం చేస్తోంది. హెచ్-1బీ వీసా హోల్డర్ల భాగస్వాములకు(భార్యలేదా భర్త), హెచ్-4 వీసాదారులపై వేటు వేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ట్రంప్ ప్రభుత్వం వలస కార్మికులు విదేశీ ఉద్యోగులను ఏరివేసే క్రమంలో మరింత దూకుడుగా కదులుతోంది. చట్టబద్దంగా అనుమతి వున్న ఉద్యోగులపై వేటు వేసేందుకు యోచిస్తోంది. ఈ క్రమంలో హెచ్-1బీ వీసా దారులు అమెరికాలో పనిచేయడానికి అనుమతి ఉంటుంది. అయితే ఇప్పుడా అనుమతిని రద్దు చేసే యోచనలో ట్రంప్ ప్రభుత్వం ఉంది. ఇప్పటికే దీనిపై వాషింగ్టన్ కోర్టులో డిపార్ట్ మెంట్ ఆఫ్ జస్టిస్ 60 రోజుల గడువు కోరింది. దీంతో వేలాదిమంది భారతీయ ఐటీ ఉద్యోగుల భాగస్వాముల( హెచ్-4 వీసాదారులు) ఉద్యోగులు ప్రమాదంలో పడనున్నాయనే ఆందోళన నెలకొంది. అయితే హెచ్-4 వీసాదారులు (హెచ్-1బీ వీసాదారులపై ఆధారపడేవాళ్లు) ఎన్నో ఏళ్లపాటు పోరాడి ఈ అనుమతిని సంపాదించారు. 2015, ఫిబ్రవరిలో అప్పటి ఒబామా ప్రభుత్వం ఈ అనుమతినిచ్చింది. తద్వారా గ్రీన్‌కార్డు కోసం వేచి చేస్తున్న హెచ్-1బీ వీసాదారుల భాగస్వాములకు ఈ అవకాశం లభించింది. ఒబామా ప్రభుత్వ నిర్ణయంపై సేవ్ జాబ్స్ యూఎస్ఏ అనే గ్రూప్ కోర్టుకు వెళ్లింది. కానీ ఇందులో తాము జోక్యం చేసుకోలేమని అప్పట్లో కోర్టు చెప్పింది. తాజాగా ట్రంప్ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టగానే ఈ గ్రూప్ మరోసారి అప్పీల్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనికి డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ మద్దతు కూడా లభించింది. దీనిపై నిర్ణయం తీసుకోవడానికి 60 రోజుల సమయం కోరింది. ప్రస్తుతం అటార్నీ జనరల్‌గా ఉన్న జెఫ్ సెషన్స్.. అప్పట్లో సెనేటర్‌గా ఒబామా ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. అయితే అమెరికాలో భారీగావున్న ఈ హెచ్-4 వీసాదారుల తరఫున ఇమ్మిగ్రేషన్ వాయిస్ అధ్యక్షుడు అమన్ కపూర్ కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. అసలు ఈ పిటిషన్ దాఖలు చేయడానికి సరైన ఆధారమే లేదని అమన్ కపూర్ వాదిస్తున్నారు. -
నాడులను మారిస్తే.. కదలిక వచ్చింది
పక్షవాతం వచ్చి కాళ్లు చేతులు పడిపోతే తిరిగి మామూలు స్థితికి వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఫిజియోథెరపీతో కొందరిలో మార్పు వచ్చే అవకాశమున్నా కాస్త శ్రమ, సమయం తప్పదు. కెనడాలో ఇటీవల జరిగిన ఓ శస్త్రచికిత్స పుణ్యమా అని ఇకపై ఆ పరిస్థితి మారనుంది. ఈ ఆపరేషన్ ద్వారా తొమ్మిదేళ్లుగా పక్షవాతంతో కాళ్లు చేతులు పడిపోయిన ఓ వ్యక్తి తన చేతులను మళ్లీ కదిలించగలిగాడు. టిమ్ రాగ్లిన్ అనే వ్యక్తి 2007లో ఓ ప్రమాదంలో తలకు బలమైన గాయం కావడంతో కాళ్లు చేతులు చచ్చుబడిపోయాయి. దీంతో టిమ్‌కు ఒట్టావా ఆస్పత్రి డాక్టర్ క్రిస్టీ బాయిడ్ సరికొత్త శస్త్రచికిత్స చేశారు. టిమ్ శరీరంలో సక్రమంగా పనిచేసే కొన్ని నాడీ కణాలను గుర్తించి వాటిని అతడి చేతుల్లోకి చొప్పించారు. దాదాపు ఏడాది పాటు ఎలాంటి ఫలితం కనిపించకపోయినా ఆ తర్వాత అతడి చేతుల్లో చిన్న కదలికలు మొదలయ్యాయి. కొత్తగా అమర్చిన నాడులు అంతకంతకూ పెరుగుతూ ముడుచుకుపోయిన వేళ్లను విడదీయగలిగే స్థాయికి చేరాయి. అయితే ప్రస్తుతం చిన్నచిన్న పనులకే కండరాలు అలసిపోతున్నాయని టిమ్ పేర్కొంటున్నాడు. నాడులు మరింతగా బలపడితే సాధారణ పనులు చేసుకోవచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. -
గోవుల తరలింపును అడ్డగింత
త్రిపురారం : గోవులను తరలించే ఓ లారీని ఆదివారం మండలంలోని ఆర్ఎస్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. కోదాడ సంత నుంచి ఓ లారీలో గోవులను మహబూబ్‌నగర్ కబేళాలకు తరలిస్తుండగా విషయం తెలుసుకున్న ఆర్ఎస్ఎస్ నాయకులు తుంగపాడు సమీపంలో అడ్డగించారు. ఈ మేరకు స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడకు చేరుకుని గోవులను తరలిస్తున్న లారీ డ్రైవర్‌ను విచారించారు. అడ్డుకున్న వారిలో ఆర్ఎస్ఎస్ నాయకులు ఉప్పుల అశోక్‌రెడ్డి, కుంచం రామాంజనేయులు, నామోజు సత్యనారాయణచారి ఉన్నారు. -
కాస్త మెరుగు పడిన జోస్న!
న్యూఢిల్లీః భారత స్వ్రాష్ క్రీడాకారిణి జోస్న చిన్నప్ప ఈ సారి ర్యాంకుల్లో కొంత మెరుగు పడింది. ఇంతకు ముందున్న ర్యాంకు కంటే రెండు స్థానాలకు ఎదిగి ఇప్పుడు 11వ స్థానంలో నిలిచింది. ప్రొషెషనల్ స్క్వాష్ అసోసియేషన్ (పీఎస్ఏ) తాజాగా విడుదల చేసిన క్రీడాకారుల ర్యాంకుల్లో జోస్న కొంతశాతం మెరుగు కనబరిచింది. గతవారం హాంకాంగ్ లో జరిగిన టోర్నీలో తనదైన ప్రతిభను ప్రదర్శించి ర్యాంకుల జాబితాలో స్క్వాష్ క్రీడాకారిణి జోస్న మరో మెట్టు ఎక్కగలిగింది. గతంలో 13వ ర్యాంకులో ఉన్న జోస్నతాజా జిబితాలో 11వ ర్యాంకును సాధించింది. తన ఇండియా టీమ్ మేట్ దీపికా పల్లికల్ కూడ తన స్థానంలో కాస్త మెరుగును కనబరిచి 18 వ ర్యాంకుకు ఎగబాకింది. అలాగే గాయంతో చికిత్స పొందుతున్న సౌరవ్ ఘోషల్ పురుషుల ర్యాంకుల్లో 17వ స్థానంలో ఉన్నాడు. -
'జీవితాన్ని థ్రిల్‌గా గడపడం ఇష్టం'
ఒకరి కోసం ఒకరు వెయిటింగ్. మాటల్లో తేడా వస్తే... ఫైటింగ్. లీవు పెట్టి మరీ హస్కు. లవ్యూ చెప్పకుంటే లైఫే రిస్కు! అలకలొస్తే... క్షణమొక శిల. చేతివేళ్ల చిలకలిస్తే.. ఎదలోపల కోయిల. పెళ్లైన కొత్తలో ఇలాగే ఉంటుంది... 24 బై 7... బోలెడంత థ్రిల్! మూడు పూటలా కవిత్వం!! యంగ్ కపుల్ సాయి, వైష్ణవిలకు మాత్రం ఇవన్నీ సాదాసీదా థ్రిల్స్. హనీమూన్‌కి వీళ్లు ఎక్కడికెళ్లారో తెలుసా? సునామీలొచ్చే ఏరియాకి! పెళ్లికి ముందు సాయికిరణ్... వైష్టవికి పరిచయం చేసిన ఫ్రెండెవరో తెలుసా? హిస్ స్... చప్పుడు చేయకుండా... కదలండి, టువర్డ్స్... ‘మనసే జతగా...’ సినిమా స్టార్‌గా, సీరియల్ స్టార్‌గా ప్రేక్షకులకు చిరపరిచితులు సాయికిరణ్. సాఫ్ట్వేర్ ఇంజినీర్ వైష్ణవిని మూడేళ్ల క్రితం (జూన్ 24, 2010) పెళ్లి చేసుకున్నారు. ‘జీవితాన్ని థ్రిల్‌గా గడపడం ఇష్టం’ అని సాయికిరణ్ అంటే, ‘నాదీ అదే మాట’ అన్నారు వైష్ణవి. ‘ఒకరి పనిలో ఒకరు తలదూర్చకుండా ఒకరికొకరుగా ఉంటున్నాం’ అని చెప్పిన ఈ జంట కబుర్లే ఇవి. అలా మొదలైంది! ‘‘పెళ్లి చేసుకోవడానికి నూటతొమ్మిది మ్యాచ్‌లు చూశాను. ఏదో ఇంట్లో ఫలానా అమ్మాయి గురించి అనుకోవడం, నాకు తెలిసిన వారి గురించి ప్రస్తావనకు రావడం అలా...అలా సంఖ్య పెరిగిపోయింది! ఎవరూ నచ్చలేదు. కాని నాలుగేళ్ల క్రితం వైష్ణవి కలిసినప్పుడు మాత్రం నా మనస్తత్వానికి దగ్గరగా ఉంటుందనిపించి, వెంటనే ఓకే చేశాను. అసలు మాకంటే ముందుగా మా ఇద్దరి కుటుంబాలూ కలుసుకున్నాయి. తర్వాత వైష్ణవి కలిసింది. అప్పటికే తను బెంగళూరులో ఉద్యోగం చేస్తోంది. ఇంటర్ నెట్లో చాట్ చేసుకోవడం, కుటుంబ వేడుకల్లో కలుసుకోవడం... అలా మొదలైంది మా ప్రేమ. పెళ్లికి మాత్రం ఏడాది పట్టింది. ఆ సమయం మా ఇద్దరి మధ్య మంచి అవగాహన ఏర్పడటానికి ఉపయోగపడింది’’ గతానుబంధాలను గుర్తు చేసుకున్నారు సాయికిరణ్. పాములబ్బాయి ‘‘సాయి చాలా కామ్‌గా ఉంటారు కాని, జోక్స్ చెప్పి బాగా నవ్విస్తారు. స్నేక్ షోలో కూడా అంతే!’’ అన్నారు వైష్ణవి. సాయికిరణ్ ‘ఫ్రెండ్స్ స్నేక్స్ సొసైటీ’లో మెంబర్ కూడా! పాములను మనుషుల నుంచి కాపాడి అడవుల్లో వదిలేస్తూ ఉంటారు. ఆ సందర్భం గురించి సాయికిరణ్ చెబుతూ- ‘‘ఇప్పటి వరకు 900 పైగా పాములను కాపాడి ఉంటాను. పెళ్లికి ముందు ఒకసారి వైష్ణవిని స్నేక్పార్క్కు తీసుకెళ్లాను. ఈ అమ్మాయి ధైర్యమేంటో చూద్దాం అని ఆరడుగుల పే...ద్ద పామును తీసుకొచ్చి, ‘పట్టుకో’ అన్నట్టుగా ఇచ్చాను. పెళ్లయ్యాక పామును తెచ్చి ఇంట్లో పెడితే, తట్టుకోవాలిగా..! అందుకని ముందే ఆ ప్రయత్నం చేశాను! తను ఏమాత్రం జంకకుండా దాన్ని ధైర్యంగా చేతుల్లోకి తీసుకుంది. అప్పుడనిపించింది తనదీ నా తరహా మనస్తత్వమే అని.’’ సంబరంగా చెప్పారు సాయికిరణ్!సీ‘రియల్’! ‘‘పెళ్లయిన ఆరునెలల వరకు ఉద్యోగరీత్యా నేను బెంగళూరులోనే ఉన్నాను. వారాంతంలో ఈయనే బెంగళూరు వచ్చేవారు. ఆరునెలల తర్వాత తనకు సీరియల్లో అవకాశం రావడంతో ఇద్దరం చెన్నైలో కాపురం పెట్టాం. అయితే, అక్కడ ఇద్దరికీ ఆర్థికంగా కటకట వచ్చింది. రోజులు ఎలా గడుస్తాయా అని భయపడ్డాం. అలాంటి సమయాల్లో భార్యాభర్తల మధ్య చికాకులు, కోపాలు చోటుచేసుకోవడం సహజం. అందుకు విరుద్ధంగా మేం మరింతగా కలిసిపోయాం. ఆ తర్వాత సాయికి హైదరాబాద్‌లో అవకాశాలు రావడంతో ఇద్దరం ఇక్కడకు షిఫ్ట్ అయ్యాం’’ అంటూ పెళ్లినాటి తొలిరోజులను గుర్తు చేసుకున్నారామె. ‘రిస్క్’ అంటే ఇష్టం తమకు అడ్వంచర్స్ అంటే ఇష్టమని చెబుతూ...‘‘రిస్క్ లేకపోతే లైఫ్‌లో థ్రిల్ ఉండదని నా అభిప్రాయం. పెళ్లయ్యాక హనీమూన్‌కి అందరిలాగే ఊటీ, కొడెకైనాల్ వెళ్లాలనుకోలేదు. సునామీ వచ్చిన ప్లేస్‌కి వెళ్లాలనుకున్నాం. అలా మాల్దీవులకు వెళ్లాం. అక్కడ మాస్క్ వేసుకొని, సముద్రంలోకి వెళ్లిపోయాం. సముద్రంలో రకరకాల చేపలు, జలచరాల మధ్య గడపడం భలే మజాగా అనిపించింది’’ అని సాయికిరణ్ చెబుతుంటే ‘‘మా లైఫ్‌లో అది బెస్ట్ పార్ట్. ఈయనకు ఇలాంటి ఆసక్తి ఉందనే పెళ్లికి ముందు ప్రత్యేకంగా స్విమ్మింగ్ కూడా నేర్చుకున్నాను’’ అంటూ భర్త ఆలోచనలకు తగ్గట్టుగా తనను తాను మార్చుకున్న విధానాన్ని తెలియజేశారు వైష్ణవి. పెళ్లి తర్వాత తనలో వచ్చిన మార్పుల గురించి సాయికిరణ్ ప్రస్తావిస్తూ -‘‘పెళ్లి తర్వాత పాములు పట్టడం అనే ప్రమాదకరమైన హాబీని కొంత తగ్గించాను. ఎందుకంటే నన్ను నమ్ముకొని నాకోసం ఓ వ్యక్తి ఉన్నారు అనిపించేది. అయితే వైష్ణవి మాత్రం ‘ఏంటిది, ఇప్పటినుంచే అంకుల్‌లాగా..! ఇలాగైతే త్వరలో మన ఇంటికి రాబోయే బుజ్జిపాపకు మీరు అడ్వెంచర్స్ ఎలా పరిచయం చేస్తారు?’’ అంటూ ఆటపట్టిస్తోంది’’ మురిపెంగా చెప్పారు. చూపులతోనే భావాలు పెళ్లయ్యాక భార్యాభర్తలకు ఒకరిమీద ఒకరికి అవగాహన కలగాలంటే ఏడాది కాలం పడుతుందని చెబుతూ- ‘‘నాకు నా స్పేస్‌లో ఉండటం అంటే అమితమైన ఇష్టం. ఫ్లూట్ వాయిస్తూనో, పగటికలలు కంటూనో, డ్రాయింగ్ వేస్తూనో, పాటలు పాడుకుంటూ నో గంటలు గంటలు గడిపేసేవాడిని. దాంతో తను మూడీగా మారిపోయేది. అది గ్రహించి, నా హాబీస్‌లో వైష్ణవినీ ఇన్వాల్వ్ చేయడం మొదలుపెట్టాక మా మధ్య ర్యాపో పెరిగింది. అలా వైష్ణవి అభిరుచులేంటో తెలిశాయి. తను సంగీతాన్ని ఇష్టపడుతుంది. యోగా చేస్తుంది. ఇంటర్నెట్లో చూసి రకరకాల వంటలు ట్రై చేస్తుంది. మా మధ్య ఎంత చనువు పెరిగినా, నన్ను తన అధీనంలో ఉంచుకోవాలి అని వైష్ణవి ఎప్పుడూ అనుకోలేదు’’ అని సాయికిరణ్ చెబుతుంటే ‘‘...అలా అనుకోవడం వెర్రితనం. అలా అనుకోకపోవడం వల్లనే తను బయటకు వెళ్లడం బాగా తగ్గించేసి, నాతోనే ఎక్కువగా గడిపేందుకు ఇష్టపడ్డారు. అసలు భార్య భర్తను కంట్రోల్ చేయాలనో, భర్త భార్యను కంట్రోల్ చేయాలనో చాలామంది అనుకుంటారు. అలాంటి తలంపు ఉందంటే... వారి మీద నమ్మకం లేనట్టు. నమ్మకం లేని చోట బంధం బలహీనమే...’’ అంటూ తన అభిప్రాయాన్ని చెప్పారు వైష్ణవి. ఇద్దరికీ సాహసాలు చేయడం, జీవితాన్ని థ్రిల్లింగ్‌గా మార్చుకోవడమంటే ఇష్టం. ఇద్దరికీ ఒకరి ఇష్టాలు ఒకరు తెలుసుకొని మసలుకోవడం ఇంకా ఇష్టం. మాటల కన్నా కళ్లతో మాట్లాడుకోవడం మరీ ఇష్టం. భార్యాభర్తల మధ్య విభేదాలు ఎందుకు వస్తుంటాయో, అవి తమ మధ్య రాకుండా ఉండటానికి ఏం చేయాలో అర్థం చేసుకోవడానికి ముప్ఫై ఏళ్లు అవసరం లేదు, మూడేళ్లు చాలు అని తమ మాటల్లో తెలిపారు జంట. బయట రాజాలా ఉన్నా, ఇంట్లో పట్టించుకునేవారు లేకపోతే జీవితంలో ఏమీ లేనట్టే! ఇంట్లో స్నేహితురాలిలా ఉండే భార్య దొరకడమే ఆ దేవుడు ఇచ్చిన కానుకగా భావిస్తాను. - సాయికిరణ్ చాలామందిలా తన కాబోయే భార్య ఫొటోలు తీసి పెట్టుకోకుండా నా రూపాన్ని చిత్రించి, దానికో అందమైన ప్రేమలేఖ జతచేసి తను ఇష్టపడే పెర్ఫ్యూమ్ అద్ది గిఫ్ట్ ప్యాక్ చేసి ఇచ్చారు. ఇప్పటికీ అది పెద్ద కానుకగా భావిస్తాను. - వైష్ణవి సాయికిరణ్ నటి ంచిన... సినిమాలు: నువ్వేకావాలి, ప్రేమించు, మనసుంటే చాలు, డార్లింగ్ డార్లింగ్, సత్తా, హైటెక్ స్టూడెంట్స్, వెంగమాంబ, రామ్‌దేవ్, బుల్లబ్బాయ్, అజంతా, లెమన్, సువర్ణ, క్షణం, దేవీ అభయం. సీరియళ్లు: శివలీలలు, వెంకటేశ్వరవైభవం, సృష్టి, పురాణగాధలు, శ్రీ నారాయణ తీర్థులు, సుందరకాండ, ఆటోభారతి, సుడిగుండాలు, తంగం(తమిళం) - నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ఢిల్లీ కోర్టును ఆశ్రయించిన అనిల్ అంబానీ