హనుమకొండ: సొంతిల్లు నిర్మించుకుకోవాలంటే నెలల సమయం పడుతుంది. ఒక ప్రాంతంలో ఇంటిని నిర్మిస్తే శాశ్వతంగా ఆ చోటే ఉంటుంది. కానీ.. మారుతున్న కాలానికి అనుగుణంగా కదిలే ఇళ్లు వస్తున్నాయి. వరంగల్ నగరంలోని వడ్డేపల్లిలో ఏర్పాటు చేసిన మొబైల్ హౌజ్ నగరవాసులను ఆకట్టుకుంంటోంది. వడ్డేపల్లికి చెందిన బొల్లేపల్లి సుహాసిని, సతీష్ గౌడ్ దంపతులు సుబేదారి–వడ్డేపల్లి ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న సొంత ప్లాట్‌లో ఇల్లు కట్టాలనుకున్నారు.
ఎక్కువ డబ్బులు అవుతుండటంతో రెడీమేడ్ హౌస్ గురించి తెలుసుకుని, వారిని సంప్రదించారు. రూ. 8.50 లక్షలతో కిచెన్, సింగిల్ బెడ్ రూం, అటాచ్‌డ్ బాత్ రూం, హాల్‌తో పూర్తిగా ఐరన్ ఉపయోగించిన మొబైల్‌హౌస్‌ను నిర్మించారు. లారీలో తీసుకువచ్చి బిగించేశారు. ఈ ఇంటిని ఎక్కడికైనా తరలించుకునే అవకాశముంది. 30 ఏళ్లకుపైగా పటిష్టంగా ఉంటుందని గ్యారంటీ ఇచ్చినట్లు సతీష్‌గౌడ్ తెలిపారు. ఇల్లు 4 టన్నుల బరువు ఉంది.
Comments
Please login to add a commentAdd a comment