Ready made
-
రెడీమేడ్ ఇళ్లు, భలే మోడళ్లు .. 90 శాతం పనులు ఫ్యాక్టరీలోనే.. ప్రత్యేకతలివే!
పేద, మధ్య తరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేసే లక్ష్యంతో అత్యాధునిక సాంకేతికతతో కూడిన రెడీమేడ్ ఇళ్ల నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం పరిచయం చేస్తోంది. మన దేశ వాతావరణానికి తగ్గట్టుగా తక్కువ ఖర్చుతో.. నాణ్యమైన ఇళ్ల నిర్మాణాన్ని 6 విభిన్న మోడళ్లలో ప్రయోగాత్మకంగా చేపట్టింది. ఈ టెక్నాలజీపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ‘గ్లోబల్ హౌసింగ్ టెక్నాలజీ’ పేరిట లైట్ హౌస్ ప్రాజెక్టులను ప్రారంభించి.. వాటిని లైవ్ లేబొరేటరీలుగా మార్చింది. సాక్షి, అమరావతి: పట్టణ గృహ నిర్మాణ రంగంలో ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ఇటుక, సిమెంట్‌తో నెలల తరబడి ఇళ్ల నిర్మాణాలు చేయక్కర్లేకుండా ఫ్యాక్టరీలోనే దాదాపు 90 శాతం ఇంటి పనులు పూర్తయిపోతాయి. విడిభాగాలను సైట్‌కు తరలించి బిగిస్తే బహుళ అంతస్తుల భవనం సిద్ధమైపోతుంది. విదేశాల్లో అమలులో ఉన్న ఈ టెక్నాలజీని ఇప్పుడు మనదేశంలో చేపట్టే నిర్మాణాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. తక్కువ ఖర్చుతో వేగంగా బహుళ అంతస్తుల భవనం సిద్ధం కావడం ఇందులో ప్రత్యేకత. కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్మాణ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 54 అత్యుత్తమ ప్రాజెక్టులను పరిశీలించి మనకు అనువైన 6 మోడళ్లను ఎంపిక చేసింది. ప్రజల్లో అవగాహన పెంచేందుకు గ్లోబల్ హౌసింగ్ టెక్నాలజీ ఛాలెంజ్ పేరుతో చెన్నై, రాజ్‌కోట్, ఇండోర్, లక్నో, రాంచీ, త్రిపురలో నిర్మాణాలు చేపట్టింది. నిర్మాణ రంగంలో సరికొత్త విప్లవంగాను, లైట్ హౌస్ ప్రాజెక్టులుగా పేర్కొంటున్న వీటిని ఐఐటీలు, ఎన్ఐటీలు, ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ కాలేజీలతో పాటు, ప్రభుత్వ, ప్రైవేటు నిర్మాణ రంగంలో ఉన్న సంస్థలకు లైవ్ లే»ొరేటరీలుగా ఉపయోగపడనున్నాయి. ఆరు ప్రాజెక్టుల్లో 6,368 ఇళ్ల నిర్మాణం భిన్న భౌగోళిక, వాతావరణ పరిస్థితులున్న 6 రాష్ట్రాల్లో విభిన్న టెక్నాలజీలను ఉపయోగించి నిర్మాణాలను చేపట్టారు. ప్రీకాస్ట్ కాంక్రీట్ నిర్మాణ విధానంలో చెన్నైలో అన్ని వసతులతో 1,152 ఇళ్లను రికార్డు స్థాయిలో పూర్తి చేశారు. రాజ్‌కోట్‌లో మోనోలిథిక్ కాంక్రీట్ టెక్నాలజీతో 1,144 ఇళ్లను నిర్మించారు. ఈ రెండు ప్రాజెక్టులు కోవిడ్‌తో దేశంలో ప్రతికూల పరిస్థితులున్నా తక్కువ కాలంలో విజయవంతంగా పూర్తయ్యాయి. ఇండోర్‌లో ప్రీ ఫ్యాబ్రికేటెడ్ శాండ్విచ్ ప్యానెల్ విధానంలో 1,024 ఇళ్లు, లక్నోలో పీవీసీ ఫ్రేంవర్క్ టెక్నాలజీతో 1,040 ఇళ్లు, రాంచీలో ప్రీకాస్ట్ కాంక్రీట్–3డీ నిర్మాణ విధానంలో 1,008 ఇళ్లు, అగర్తల (త్రిపుర)లో లైట్గేజ్ స్టీల్ స్ట్రక్చరల్ విధానంలో 1,000 ఇళ్లు నిర్మించారు. ఇకపై దేశంలోని అన్ని పట్టణాల్లో ప్రభుత్వం నిర్మించే ఇళ్లకు ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని యోచిస్తున్నట్టు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రీకాస్ట్ కాంక్రీట్ విధానంలో.. ఈ విధానంలో భవనం గోడలు, స్లాబ్, మెట్లు, బీమ్ మొదలైన అన్ని భాగాలు ప్లాంట్ లేదా కాస్టింగ్ యార్డ్‌లో తయారు చేసి, సైట్లో ఒకదానికొకటి బిగిస్తారు. కాంక్రీట్‌ను కూడా ఫ్లైయాష్, గ్రౌండ్ గ్రాన్యులేటెడ్ బ్లాస్ట్ ఫర్నేస్ స్లాగ్, మైక్రో సిలికా వంటి పారిశ్రామిక ఉప ఉత్పత్తులతో చేస్తారు. దీంతో మన్నికగా ఉండడంతో పాటు సహజ వనరులను సంరక్షించినట్టవుతుని నిపుణులు చెబుతున్నారు. ఈ టెక్నాలజీతో చెన్నైలో 1,152 ఇళ్లను నిర్మించారు. మోనోలిథిక్ టన్నెల్ కాంక్రీట్‌తో.. ‘టన్నెల్ఫార్మ్’గా పిలిచే అచ్చుల్లో స్లాబ్‌లు, గోడలు, గదులను ఒకేసారి వేస్తారు. ఇవి చాలా బలంగా ఉంటాయి. ఒక్కరోజులో సెంట్రింగ్ సపోర్టును తొలగించవచ్చు. గోడలకు ప్లాస్టరింగ్ అవసరం ఉండదు. వీటికీ ఫ్లైయాష్ గ్రౌండ్ గ్రాన్యులేటెడ్ బ్లాస్ట్ ఫర్నేస్ స్లాగ్, మైక్రో సిలికా వంటి పారిశ్రామిక ఉప ఉత్పత్తులతో కాంక్రీట్ తయారు చేస్తారు. బాక్స్ టైప్ మోనోలిథిక్ స్ట్రక్చర్ కావడంతో భూకంపం, తుపాను వంటి ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకుంటుంది. గుజరాత్‌లోని రాజ్‌కోట్ ఈ టెక్నాలజీతో 1,144 ఇళ్లను నిర్మించారు. శాండ్విచ్ ప్యానెల్ టెక్నాలజీ ఇలా.. ఎక్కువ అంతస్తుల భవనాలు నిర్మించేటప్పుడు సంప్రదాయ ఇటుక గోడలకు బదులుగా ఫ్యాక్టరీలో తయారైన సిమెంట్ లేదా కాల్షియం సిలికేట్ బోర్డులను వాడతారు. స్టీల్ ఫ్రేమ్డ్ స్ట్రక్చర్‌కు గోడలుగా ఈ బోర్డులను బిగిస్తారు. వీటిని ఫ్యాక్టరీలోనే తయారుచేసి సైట్లో ఒకదానికొకటి అనుసంధానిస్తారు. ఇవి తక్కువ బరువుతో పాటు మెరుగైన థర్మల్ ఇన్సులేషన్గానూ పనిచేస్తాయి. బలమైన పునాది కూడా అవసరం లేదు. ఇండోర్ (మధ్యప్రదేశ్)లో ఈ టెక్నాలజీతో 1,024 ఇళ్ల నిర్మాణం చేపట్టారు. పీవీసీ పాలిమర్ కాంక్రీట్ టెక్నాలజీ ఈ టెక్నాలజీలో ఇంటి ప్లాన్ ప్రకారం పాలీ వీనైల్ క్లోరైడ్ (పీవీసీ) వాల్ ప్యానెళ్లు ఫ్యాక్టరీలో తయారు చేసి సైట్లో బిగిస్తారు. స్ట్రక్చరల్ ఫ్రేమ్స్ బిగించిన తర్వాత గోడ ప్యానెళ్లను డెక్కింగ్ ఫ్లోర్‌తో అనుసంధానం చేస్తారు. గోడ ప్యానెళ్ల మధ్యనున్న ఖాళీల్లో కాంక్రీట్ నింపుతారు. లక్నోలో 1,040 ఇళ్లను ఈ టెక్నాలజీతో చేపట్టారు. ప్రీకాస్ట్ కాంక్రీట్– 3డీ వాల్యూ మెట్రిక్ విధానం 3డీ వాల్యూమెట్రిక్ కాంక్రీట్ నిర్మాణంలో గదులు, టాయిలెట్, కిచెన్, బాత్రూమ్, మెట్లు.. ఇలా వేటికవే మాడ్యూల్స్‌గా యార్డులో నిర్మించి సైట్లో బిగిస్తారు. ఇలా ఒకదానిపై మరొకటిగా ఎన్ని అంతస్తులైనా బిగించవచ్చు. ఇక్కడ ప్రత్యేకంగా గోడలంటూ వేరుగా ఉండవు. అన్ని వాతావరణాలను తట్టుకోవడం దీని ప్రత్యేకత. ఈ విధానంలో రాంచీలో 1,008 ఇళ్లను నిరి్మస్తున్నారు. లైట్గేజ్ స్టీల్ స్ట్రక్చరల్– ప్రీ ఇంజనీర్డ్ స్ట్రక్చరల్ పునాది అవసరం లేని ఈ టెక్నాలజీలో గాల్వనైజ్డ్ లైట్ గేజ్ స్టీల్ భాగాలతో ఇంటి భాగాలను బిగిస్తారు. ఫ్రేమ్‌ల మధ్యలో ఇన్సులేషన్ మెటీరియల్‌ను నింపి, తేలికపాటి కాంక్రీట్ ప్యానెళ్లను గోడలుగా అతికిస్తారు. ఈ విధానంలో నాలుగు అంతస్తుల భవనాన్ని నెల రోజుల్లోనే నిర్మించవచ్చు. భవనాన్ని విడదీసి మరోచోటుకు తరలించవచ్చు. స్టీల్ ఫ్రేమ్ బీమ్‌లు తేలిగ్గా ఉండటంతో భూకంపాలను తట్టుకుంటుంది. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో నిర్మాణాలకు అనువైనది కావడంతో అగర్తల (త్రిపుర)లో 1,000 ఇళ్లను నిర్మించారు. -
కదిలే ఇల్లు! ధర తక్కువ...ఎక్కడికైనా తీసుకుపోవచ్చు
హనుమకొండ: సొంతిల్లు నిర్మించుకుకోవాలంటే నెలల సమయం పడుతుంది. ఒక ప్రాంతంలో ఇంటిని నిర్మిస్తే శాశ్వతంగా ఆ చోటే ఉంటుంది. కానీ.. మారుతున్న కాలానికి అనుగుణంగా కదిలే ఇళ్లు వస్తున్నాయి. వరంగల్ నగరంలోని వడ్డేపల్లిలో ఏర్పాటు చేసిన మొబైల్ హౌజ్ నగరవాసులను ఆకట్టుకుంంటోంది. వడ్డేపల్లికి చెందిన బొల్లేపల్లి సుహాసిని, సతీష్ గౌడ్ దంపతులు సుబేదారి–వడ్డేపల్లి ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న సొంత ప్లాట్‌లో ఇల్లు కట్టాలనుకున్నారు. ఎక్కువ డబ్బులు అవుతుండటంతో రెడీమేడ్ హౌస్ గురించి తెలుసుకుని, వారిని సంప్రదించారు. రూ. 8.50 లక్షలతో కిచెన్, సింగిల్ బెడ్ రూం, అటాచ్డ్ బాత్ రూం, హాల్‌తో పూర్తిగా ఐరన్ ఉపయోగించిన మొబైల్హౌస్ను నిర్మించారు. లారీలో తీసుకువచ్చి బిగించేశారు. ఈ ఇంటిని ఎక్కడికైనా తరలించుకునే అవకాశముంది. 30 ఏళ్లకుపైగా పటిష్టంగా ఉంటుందని గ్యారంటీ ఇచ్చినట్లు సతీష్‌గౌడ్ తెలిపారు. ఇల్లు 4 టన్నుల బరువు ఉంది. (చదవండి: 63 ఏళ్ల వయసులో 6,000 కిలో మీటర్ల సైక్లింగ్) -
దేశవ్యాప్తంగా మూతపడ్డ 50శాతం చిన్న బట్టలషాపులు
-
క్లాసిక్ పోలో ‘ఫాస్ట్ ఫ్యాషన్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రెడీమేడ్స్ రంగంలో ఫ్యాషన్‌ను ఫాలో అయితేనే రిటైలర్లు విజయవంతమవుతారు. ఇందులో భాగంగానే రాయల్ క్లాసిక్ మిల్స్ కొత్త కాన్సెప్ట్‌ను ఆవిష్కరించింది. కొత్త డిజైన్లను ఎప్పటికప్పుడు కస్టమర్లకు చేరవేసేందుకు ఫాస్ట్ ఫ్యాషన్ పేరుతో రిటైలర్ల కోసం ఓ యాప్‌ను రూపొందించింది. టీ–షర్ట్స్, షర్ట్స్, ట్రూజర్స్, డెనిమ్స్.. ఇలా విభాగాల వారీగా కొత్త డిజైన్లు ఈ యాప్‌లో ఉంటాయి. వారంలోగా రిటైలర్లు ఆర్డరివ్వాలి. ఆర్డరిచ్చిన నెల రోజుల్లో సరుకు దుకాణాలకు చేరుతుంది. రెడీమేడ్ రంగంలో తొలిసారిగా ఈ కాన్సెప్ట్‌ను తాము అమలు చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. కస్టమర్లకే ప్రయోజనం.. సాధారణంగా రెడీమేడ్ రంగంలో ఆర్డరిచ్చిన 3–6 నెలలకు సరుకు దుకాణాలకు వస్తుంది. ఫాస్ట్ ఫ్యాషన్ కాన్సెప్ట్‌తో కస్టమర్లు నూతన డిజైన్లను ఎప్పటికప్పుడు ఆస్వాదించే వీలుంటుందని రాయల్ క్లాసిక్ మిల్స్ ఎండీ టి.ఆర్.శివరామ్ చెప్పారు. కంపెనీ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ఆయన ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో మాట్లాడారు. దారం నుంచి దుస్తుల వరకు పూర్తి స్థాయి తయారీలో తాము ఉన్నాం కాబట్టి దీన్ని అమలు చేయటం సాధ్యమవుతోందని తెలియజేశారు. ‘‘సరుకు నిల్వ భయం ఉండదు. ఈ ఏడాది నవంబరు నుంచి ఈ కాన్సెప్ట్‌ను అమల్లోకి వస్తుంది’’ అని చెప్పారాయన. టర్నోవర్ రూ.800 కోట్లు.. తమిళనాడులోని తిరుపూర్ కేంద్రంగా 28 ఏళ్లుగా రాయల్ క్లాసిక్ మిల్స్ సేవలందిస్తోంది. 15 ఫ్యాక్టరీల్లో 8,000 పైచిలుకు ఉద్యోగులున్నారు. కంపెనీకి ఎగుమతుల ద్వారా 2017–18లో రూ.550 కోట్లు సమకూరింది. భారత్‌లో రిటైల్ ద్వారా మరో రూ.200 కోట్లు ఆర్జించింది. 10 శాతం ఆదాయం తెలంగాణ, ఏపీ నుంచి వస్తోంది. ప్రముఖ విదేశీ బ్రాండ్లకూ దుస్తులను తయారు చేసి ఎగుమతి చేస్తోంది. తయారీ కేంద్రాలకు రూ.250 కోట్లు వెచ్చించింది. 2018–19లో టర్నోవర్ రూ.800 కోట్లు ఉంటుందని శివరామ్ తెలియజేశారు. ఈ ఏడాది మరో 70 స్టోర్లు కంపెనీ క్లాసిక్ పోలోతోపాటు యువకుల కోసం ప్రత్యేకంగా సీపీ బ్రో బ్రాండ్‌లో రెడీమేడ్స్ తయారు చేస్తోంది. ఈ బ్రాండ్లు దేశవ్యాప్తంగా 3,000పైగా రిటైల్ దుకాణాల్లో లభిస్తున్నాయి. 130 ఎక్స్‌క్లూజివ్ ఔట్‌లెట్లున్నాయి. మార్చి కల్లా మరో 70 ఎక్స్‌క్లూజివ్ స్టోర్లు రానున్నట్లు శివరామ్ వెల్లడించారు. 2019–20లో కొత్తగా 100 ఔట్లెట్లు ప్రారంభిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. -
దయనీయంగా దర్జీల జీవితం
విడవలూరు/ గూడూరు టౌన్/ కోట, న్యూస్‌లైన్: ‘ఏరా పండక్కి కొత్త బట్టలు కుట్టించుకున్నావా. ఇంకా లేదా. టైలర్ రాము దగ్గరకెళ్లి నీ ఆల్తి బట్టలివ్వు. పండగొచ్చేస్తుంది. వాళ్లు మళ్లీ బిజీ అయిపోతారు’ ఇవి గతంలో విన్పించే మాటలు. పండగైనా, శుభకార్యమైనా ప్రతి ఇంట్లో అందరూ టైలర్(ద ర్జీ) వద్ద కొత్త దుస్తులు కుట్టించుకునే వారు. ఇదంతా పదేళ్ల క్రితం నాటి హడావుడి. ప్రస్తుతం కాలం మారింది. మార్కెట్‌ను ముంచెత్తుతున్న రెడిమేడ్ దుస్తులపై అన్ని వర్గాల ప్రజలు ఆసక్తి చూపుతుండటంతో టైలర్లకు ఆదరణ కరువవుతోంది. ఈ క్రమంలో ఎప్పుడూ బిజీగా ఉండే టైలర్లు పండగలు, శుభకార్యాల సీజన్లోనూ చేతి నిండా పనిలేక దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ప్రజలు ఏరోజుకారోజు అవసరాన్ని బట్టి అప్పటికప్పుడు రెడిమేడ్ దుస్తుల దుకాణాలను ఆశ్రయిస్తుండటంతో టైలర్లకు ఏడాదిలో మూడు నెలలు కూడా పని దొరకని పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ ఎక్కువ మంది నమ్ముకున్న వృత్తిని వదులుకోలేకపోవడంతో ఉన్నవారిలో పోటీ పెరిగింది. ఆధునిక పోకడలకు అనుగుణంగా దుస్తులు కుడుతున్న వారికే ఆదరణ లభిస్తోంది. బూట్‌కట్, పెన్సిల్ కట్ అని యువత కోరినవిధంగా దుస్తులు కుట్టిన వారికే పని దొరుకుతోంది. ఈ క్రమంలో పల్లెల్లోని టైలర్ల పరిస్థితి దారుణంగా మారింది. పల్లెల్లో ఎక్కువ మంది మహిళలు ఈ వృత్తిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వీరిలో ఆధునిక పోకడలకు అనుగుణంగా మహిళా దుస్తులు కుడుతున్న వారికి ఆదరణ లభిస్తోంది. నెల్లూరు, గూడూరు, కావలి, బుచ్చిరెడ్డిపాళెం, కోట, కోవూరు తదితర ప్రాం తాల్లో మహిళల దుస్తులు కుట్టే టైలర్లు కొంతమేర ఆదరణ పొందుతున్నారు. మొత్తం మీద జిల్లాలో సుమారు 13,500 మంది టైలర్లు ఉన్నారు. వీరిలో సగం మందికి కూడా చేతి నిండా పని దొరకని పరిస్థితి. ఏళ్ల తరబడి మిషన్లకే పరిమితం కావడంతో కొందరు దృష్టి లోపం, కీళ్ల నెప్పుల సమస్యలను ఎదుర్కొంటున్నారు. వీరి గోడును పట్టించుకునే పాలకులు కరువయ్యారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టైలర్ల సమస్యలను గుర్తిం చారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునేలోపే ఆయన మృతిచెందడంతో టైలర్ల పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఇప్పటికైనా పాలకులు తమ సంక్షేమంపై దృష్టిపెట్టాలని టైలర్లు కోరుతున్నారు. ప్రభుత్వం స్పందించాలి పూర్తిగా ఆదరణ కోల్పోతున్న మా సంక్షేమంపై ప్రభుత్వం దృష్టిపెట్టాలి. రెడిమేడ్ దుస్తుల కారణంగా మేము జీవనాధారం కోల్పోతున్నాం. ఇప్పటికైనా పాలకులు స్పందించి మాకు పూర్తి న్యాయం జరిగేలా చూడాలి. శ్రీనివాసులు (టైలర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు) పని కరువైంది ఇటీవల కాలంలో మా వద్ద దుస్తులు కుట్టించుకునే వారు తగ్గిపోయారు. గతంలో కళకళలాడిన దుకాణాలు ప్రస్తుతం వెలవెలబోతున్నాయి. పనులు లేకపోవడంతో కొందరినే పనికి రమ్మంటున్నా. మిగిలిన మిషన్లు ఖాళీగా ఉంటున్నాయి. మల్లికార్జున్, టైలర్, గూడూరు మోడల్ టైలరింగ్కే గిరాకి నేను 30 ఏళ్లుగా టైలరింగ్‌తో ఉపాధి పొందుతున్నా. అప్పట్లో చీరలకు అంచు,ఫాల్స్‌తో పాటు జాకెట్లు కుట్టేవాళ్లం. ఇప్పుడు వర్క్శారీస్ అంటూ మహిళలు ప్రత్యేకత కనబరుస్తున్నారు. వారి అభిరుచికి అనుగుణంగా దుస్తులు కుడితేనే ఆదరిస్తున్నారు. గుణ, టైలరింగ్ శిక్షకురాలు, కోట