వయసు పెరిగే కొద్ది వృద్దాప్య ఛాయలు వస్తాయని అందరికి తెలుసు. అయితే ఏ ఏజ్‌లో వృధాప్యం వేగవంతం అవుతుందనేది తెలియదు. మనం కూడా గమనించం. చూస్తుండగానే మనకే తెలియని విధంగా వృద్ధాప్యంలోకి వచ్చేస్తాం. మన శరీరంలో ఈ మార్పు ఏ నిర్ధిష్ట ఏజ్ నుంచి మొదలవుతుందనేది తెలియదు. ఆ విషయాన్నే తాజాగా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అంతేగాదు అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అవేంటంటే..
స్టాన్‌ఫోర్డ్ మెడిసిన్ పరిశోధకులు చేసిన అధ్యయనం ఇన్నాళ్లు వృధాప్యం అనేది కాలానుగుణంగా వచ్చేది అనే సంప్రదాయ సిద్ధాంతాన్ని వ్యతిరేకించింది. మానవ శరీర పరమాణు కూర్పు పరంగా వృద్ధాప్యం అనేది రెండు నిర్ధిష్ట వయసులలో వేగవంతమవుతుందని నిర్ధారించారు పరిశోధకులు. ఆ సమయంలోనే శరీరం విపరీతమైన మార్పులకు లోనవుతుందని అధ్యయనంలో పేర్కొన్నారు. సరిగ్గా చెప్పాలంటే భూకంపం మాదిరిగా శరీరం ఒక్కసారిగా సడెన్ మార్పులకు లోనయ్యి వేలాదిగా అణువులు, సూక్ష్మజీవులు పెరగడం, పడిపోవడం జరుగుతుంది. సరిగ్గా అప్పుడే ఆరోగ్యం వేగంగా క్షీణించడం జరుగుతుంది.
అదే వృద్ధాప్యం వేగవంతమవుతుందనడానికి సంకేతమని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. చెప్పాలంటే సరిగ్గా 44, 60 ఏళ్ల వయసులలో శరీరం వేగవంతమైన మార్పులకు లోనవ్వుతుందని వెల్లడించారు. అందుకోసం తాము 25 నుంచి 75 ఏళ్ల వయసు వారిపై పరిశోధనలు చేయగా వారిలో ఉండే విభిన్న అణువులు, సూక్ష్మజీవులు, చర్మంపై ఉండే బ్యాక్టీరియా, వైరస్లు, శిలింధ్రాలను నిశితంగా గమనించారు. వాటి వృద్ధి కాలక్రమేణ మారదని, నిర్ధిష్ట వయసు 40, 60 ఏజ్‌లలో వేగవంతమైన మార్పులకు లేదా ఆకస్మిక మార్పులకు లోనవ్వడాన్ని అధ్యయనంలో గుర్తించారు.
ఈ పెద్ద మార్పులే ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయని చెప్పారు. అంతేగాదు తమ అధ్యయనంలో ఈ రెండు నిర్ధిష్ల వయసుల్లోనే శరీరం గణనీయమైన మార్పులకు లోనవ్వుతుందని నిర్థారించారు. ముఖ్యంగా రోగనిరోధక పనితీరు బలహీనమవ్వడం 60వ దశకం నుంచి ప్రారంభమవుతుందని అన్నారు. ఈ పరిశోధన పుట్టుక, మరణంలానే వృద్ధాప్యం అనేది సర్వసాదారణమే అని చెబుతున్నప్పటికీ..ఏఏ ఏజ్‌లో ఈ వృధ్ధాప్యం ప్రారంభమవుతుందనేది తెలియజేసిందన్నారు. పైగా ఈ పరిశోధన భవిష్యత్తులో వయసు సంబంధిత ఆరోగ్య సమస్యల గురించి సరైన అవగాహన ఇస్తుందని నమ్మకంగా చెప్పారు.
(చదవండి: బాలీవుడ్ నటి అనుష్క శర్మ మోనోట్రోఫిక్ డైట్: నిపుణులు ఏమంటున్నారంటే..!)
Comments
Please login to add a commentAdd a comment