సాయం వచ్చే స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్స్!
భలే ఆప్స్
స్మార్ట్‌ఫోన్ కేవలం వినోదం కోసమే కాదు... సాయంగా కూడా నిలుస్తుంది. ప్రత్యేకించి ముదిమి వయసులో ఉన్న వారికి అవసరార్థం చాలా అప్లికేషన్లే అందుబాటులో ఉన్నాయి. వ్యక్తి అవసరాలను కనుగొంటాయవి. అలా ఉపయుక్తమైన, ఇన్‌స్టాల్ చేసుకోవాల్సిన అప్లికేషన్లు కొన్ని...
పిల్‌బాక్సీ... వృద్ధాప్య జీవనశైలిలో మందులు మింగడం కూడా భాగమై పోయినప్పుడు మెడిసిన్ వాడటానికి సంబంధించి అలర్ట్‌లా ఉంటుంది ఈ అప్లికేషన్. ఒక్కసారి ఈ అప్లికేషన్‌లో మెడిసిన్స్‌కు సంబంధించి సమాచారం ఎంటర్ చేస్తే.. తగు సమయంలో అదే గుర్తుచేస్తూ ఉంటుంది. ఈ పనికోసమే సాయంగా ఉండాల్సిన ఒక మనిషి అవసరాన్ని కొంతవరకూ ఇది నిరోధిస్తుంది.
ఐ రీడర్... అక్షరాల సైజు చిన్నగా ఉండి కనపడకపోయిన సమయంలోనూ... దీర్ఘదృష్టిలో సమస్యతోనూ బాధపడుతున్న సమయాల్లో ఈ అప్లికేషన్ ఉపయుక్తమైనది.అప్లికేషన్ ఆన్ చేసి ఫోన్‌ను కాగితానికి దగ్గరగా తీసుకెలితే అక్షరాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇది కొనుగోలు చేయాల్సిన అప్లికేషన్. దీని ధర రెండు డాలర్లు.
క్లెవర్‌మైండ్... వృద్ధాప్యంలో ఆల్జిమర్స్‌తో బాధపడుతున్న వాళ్లకు ఉపయుక్తమైనది ఈ అప్లికేషన్. అల్జిమర్స్ సంబంధ సమస్యలతో ఉన్న వారికి ఈ అప్లికేషన్ అవసరానికి తగ్గట్టుగా ఉపయోగపడుతుందని రూపకర్తలు పేర్కొన్నారు.
ఇన్ స్టంట్ హార్ట్ రేట్... ఐ ఫోన్ కెమెరాను డిటెక్టర్‌గా ఉపయోగించుకొంటూ హృదయస్పందన వేగాన్ని కొలుస్తుంది ఈ అప్లికేషన్. ఐఓఎస్ వినియోగదారుల కోసం ఉచితంగా అందుబాటులో ఉంటుంది.
ఐ బీపీ... బ్లడ్‌ప్రెజర్ విషయంలో మానిటర్‌లా ఉంటుంది ఈ అప్లికేషన్. బ్లడ్‌ప్రెజర్ స్థాయిని సమీక్షిస్తూ, విశ్లేషిస్తూ తేడాలను తెలియజేస్తుంది.
వెమ్ ఎమ్‌డీ... వృద్ధాప్యంలో పలకరించే వివిధ ఆరోగ్య సమస్యల గురించి, వాటి గురించిన ముందస్తు సూచనలను ఇస్తూ.. తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేసేదే ఈ అప్లికేషన్.
లుమొసిటి... ఖాళీగా ఉన్నప్పుడు అనవసరమైన ఆలోచనలు పలకరిస్తూ ఉంటాయి. వాటి నుంచి దూరం జరగడానికి... మెదడుకు మేతపెట్టడానికి ఉపయోగపడే గేమ్ అప్లికేషన్ ఇది. వృద్ధాప్యంలో ఏకాగ్రతను పెంపొదించుకోవడానికి ఈ అప్లికేషన్ సాయంగా ఉంటుంది.