ఎక్కువ సంతానం ఉంటే అంత దీర్ఘాయువు ఉంటుందని విశ్వసించేవారు మన పెద్దవాళ్లు. కానీ అది వాస్తవం కాదని శాస్త్రవేత్తలు జరిపిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. త్వరితగతిన పునరుత్పత్తిని ప్రోత్సహించే జన్యువులు మనిషి ఆయుర్దాయాన్ని తగ్గిస్తాయని చెబుతున్నారు. ఈ పరిశోధన మనిషి వృధాప్య రహస్యాన్ని అర్థం చేసుకునే మార్గాన్ని సుగమం చేసిందన్నారు. ఇక్కడ పునరుత్పత్తిని ప్రోత్సహించే జన్యువులు మనిషి జీవితకాలంపై ఎలా బలంగా ప్రభావం చూపిస్తున్నాయో అనేదాని గురించి చాలా ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
పునురుత్పత్తి మనిషి జీవితకాలం తగ్గిపోవడానికి లింకప్ చేయబడి ఉంటుందన్న సరికొత్త విషయాన్ని కనుగొన్నారు శాస్త్రవేత్తలు. త్వరితగతిన పిల్లలను కనడాన్ని ప్రోత్సహించే జన్యువులు తక్కువ జీవిత కాలన్ని సూచిస్తాయని అన్నారు. ఈ మేరకు మిచిగాన్ విశ్వవిద్యాలయం నేతృత్వంలో శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో తొందరగా తల్లిదండ్రులుగా మారిన వారి జీవితకాలం సుమారు 76 ఏళ్ల వరకే ఉంటున్నట్లు వారి సంభావ్యత జన్యువుల సంబంధం ఆధారంగా నిర్థారించారు. ఈ ఆవిష్కరణ వృధాప్య రహస్యన్ని చేధించే పరిశోధనను సులభతరం చేస్తోందన్నారు శాస్త్రవేత్తలు.
అలాగే ఈ సృష్టి మానవుడికి ఇచ్చే జీవిత దశలు చాలా ఆశ్చర్యకరంగానూ, సంక్లిష్టంగానూ ఉంటాయన్నారు. ఈ అధ్యయనంలో దాదాపు 2 లక్షల మంది పైగా వ్యక్తులు పాల్గోన్నారు. వారందరి జన్యువులు, పునరుత్పత్తి, వారి జీవిత కాలాన్ని సేకరించి ఆ డేటా ఆధారంగా ఈ కొత్త విషయాన్ని కనుగొన్నామని అన్నారు. జీవశాస్త్రవేత్త జియాంజీ జాంగ్ మనషి జీవిత కాలన్ని జన్యుపరంగా పునురుత్పత్తి చాలా బలంగా పరస్పర సంబంధం కలిగి ఉందన్నారు. అంటే ఇక్కడ పునరుత్పత్తిని ప్రోత్సహించే జన్యు పరివర్తనలే జీవితకాలాన్ని తగ్గిస్తాయి. ఇది కాస్త హాస్యస్పదంగా అనిపిస్తున్నా కాస్త నిశితంగా గమనిస్తే గర్భ నిరోధకం, గర్భస్రావం, తదితరాల ఆరోగ్య సంరక్షణపై ప్రభావం చూపుతాయన్నది వాస్తవం.
కాబట్టి పునరుత్పత్తి అనేది మనిషి ఆయుర్దాయంపై ప్రభావం చూపుతుందన్నది పరిశోధకులు వాదన. అదే సమయంలో ఇక్కడ జన్యు సంసిద్ధత తోపాటు కొంత పర్యావరణ కారకాలు కూడా మనిషి జీవితకాలం తగ్గిపోయేందుకు కారణమని చెబుతున్నారు. ఇక్కడ పునురుత్పత్తి, జీవితకాలం మద్య జరగుతున్న జన్యు ఉత్ఫరివర్తనాలకు సంబంధించిన సంక్లిష్ట చర్యను అర్థం చేసుకుంటే వృద్ధాప్య రహస్యాన్ని సులభంగా చేధించగలమని అన్నారు. ఈ అధ్యయనాలు వృధాప్యం(వయసు) అనేది సహజ ప్రక్రియ అని, అది పునరుత్పత్తి అనే అంశంపైనే బలంగా ఆధారపడి ఉందని చెబుతున్నాయన్నారు. ఎందుకంటే? మన ఫిట్‌నెస్ అనేది పునురుత్పత్తి ఆధారంగానే సెట్ చేసి ఉంటుంది. అందువల్ల పునరుత్పత్తి ప్రక్రియ పూర్తవ్వడం పైనే లైఫ్ స్పాన్ నిర్ణయించబడిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
(చదవండి: కలవరపెడుతున్న 'జాంబీ డీర్ వ్యాధి'! మనుషులకు కూడా వస్తుందా?)
Comments
Please login to add a commentAdd a comment