Lifespan
-
ఈ జంట 150 ఏళ్లు జీవించాలని ఏం చేస్తున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ఇటీవల కాలంలో సుదీర్ఘకాలం జీవించాలనే ధోరణి ఎక్కువయ్యింది. కొందరూ సాధారణ వయసు కంటే తక్కువ వయసు వారిలా యవ్వనంగా ఉండాలని చూస్తున్నారు. కొందరూ యవ్వనంగా ఉండటం తోపాటు ఆరోగ్యంగా ఉండాలని భావిస్తున్నారు. అందుకోసం కఠినమైన జీవనశైలిని పాటిస్తున్నారు. వారి జీవసంబంధ వయసు ఎవ్వరూ ఊహించనంత తక్కువగా ఉండేలా ముమ్మరమైన ప్రయత్నాలు చేస్తున్నారు. అదే బాటలో పయనిస్తోంది యూఎస్‌కి చెందిన ఓ జంట. ఇటీవలే కొత్తగా పెళ్లి చేసుకున్న ఈ జంట ఏకంగా 150 ఏళ్లు పాటు జీవించాలనే సంకల్పంతో ఏం చేస్తున్నారో వింటే నోరెళ్లబెడతారు. అమెరికాలోని మిడ్వెస్ట్కు చెందిన 33 ఏళ్ల కైలా బర్న్స్ లెంట్జ్, ఆమె భర్త వారెన్ లెంట్జ్(36) వందేళ్లకు మించి జీవించి చూపాలనుకుంటున్నారు. అందుకోసమని ఈ ఇరువురు బయోహాకింగ్ రొటీన్‌ను స్వీకరించారు. ఇక్కడ బయోహాకింగ్ అంటే..సైబర్నెటిక్ పరికరాలు లేదా బయోకెమికల్స్‌ను వంటి సాంకేతిక మార్గాల ద్వారా శరీరం విధులను మెరుగుపరచడం లేదా మార్చడాన్ని బయోహాకింగ్ అని అంటారు. ఇక్కడ ఈ బయోహ్యికింగ్ను అనుసరిస్తున్న జంటలో కైలా క్లీవ్‌ల్యాండ్‌లోని దీర్ఘాయువు క్లినిక్ ఎల్వైవీ ది వెల్నెస్ స్పేస్ సహ యజమాని కాగా, ఆమె భర్త వారెన్ మార్కెటింగ్ ఏజెన్సీలో చీఫ్ రెవెన్యూ ఆఫీసర్. వీరిద్దరు ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుకునేలా మంచి జీవనశైలిని అనుసరిస్తున్నారు.ఎలాంటి జీవన విధానం అంటే.. వారి రోజు దినచర్య ఆప్టిమైజింగ్ పద్ధుతులతో నిండి ఉంటుంది. ఆ జంట ప్రతి ఉదయం పల్సెడ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ థెరపీతో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత వర్కౌట్లు, ఉదయపు సూర్యకాంతిని ఆస్వాదిస్తూ సాగే వాకింగ్ తదితరాలు ఉంటారు. ఆ తర్వాత క్లినిక్ గ్రేడ్ పరికరాలతో ఆరోగ్య మెరుగదలను పరీక్షించడం తదరితరాలన్నింటిని ఓ పద్ధతిలో అనుసరిస్తారు. చెప్పాలంటే అత్యంత మెరుగైన ఆర్యోగ్యకరమైన జీవిన విధానాన్ని అవలంభిస్తోంది ఈ జంట. దీంతోపాటు సెల్ రిపేర్‌కు సంబంధించి..రోజంతా హైపర్బారిక్ ఆక్సిజన్ ఛాంబర్, నానోవి వంటి ఆరోగ్య సాంకేతికతను ఉపయోగిసస్తారు. అలాగే సాయంత్రం పూర్తి విశ్రాంతికి కేటాయిస్తారు. సేంద్రీయ భోజనమే తీసుకుంటారు. సూర్యాస్తమయ సమయానికల్లా ఆవిరి సెషన్లో పాల్గొంటారు. అలాగే అందుకు తగ్గట్లు ఇంటి వాతావరణాన్నికూడా సెట్ చేస్తారు. ఇంట్లో రెడ్‌లైట్లు వంటి సహజ సిర్కాడియన్ రిథమ్లతో ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మారుస్తారు. రాత్రి తొమ్మిందింటి కల్లా నిద్రపోవడం వంటి మంచి నియమాలను పాటిస్తున్నారు. అంతేగాదు పిల్లలను కనాలనే ఆశతో కొన్నేళ్లుగా శరీరాన్ని ఆప్టిమైజ్(సాంకేతికతో పరిశీలించడం) చేస్తున్నట్లు తెలిపారు. పేరెంటింగ్ అనుభూతిని ఎంజాయ్ చేయాలనే ఉద్దేశ్యంతో ఇరువురి ఆరోగ్యం మెరుగ్గా ఉండేలా కేర్ తీసుకుంటున్నారు. అంతేగాదు వారి జీవనశైలికి అనుగుణంగా పిల్లలను పెంచేలా ప్లాన్ చేసుకుంటున్నారు కూడా. ఈ జంట స్క్రీన్ సమయాన్ని తగ్గించి ఆరుబయట గడపడం, ప్రకృతితో సేద తీరడం వంటి వాటికి ప్రాధాన్యత ఇస్తున్నారు. సాధ్యమేనా..?వృద్ధాప్యాన్ని నెమ్మదించేలా లేదా రివర్స్ చేసేలా మంచి ఆరోగ్యకరమైన బయోహ్యాకింగ్ విధానాన్ని అనుసరిస్తున్నారు. ఇంతకముందు ఇలాంటి వాటికి సంబంధించి..వెంచర్ క్యాపిటలిస్ట్ బ్రయాన్ జాన్సన్ వార్తల్లో నిలవగా ఇప్పుడూ ఈ జంట హాట్‌టాపిక్‌గా మారింది. ప్రకృతి ధర్మంగా వచ్చే మార్పులను అంగీకరించాలే గానీ అందుకు విరుద్ధంగా బతికే ప్రయత్నం చేస్తే కొన్ని రకాల పరిణామాలను ఎదుర్కొనక తప్పదనేది కఠిన సత్యం. మరీ వీరంతా ఆ కఠిన సత్యాన్ని తిరగరాసేలా అనుకున్నది సాధించి చూపగలుగుతారా..? లేదా అనేది తెలియాల్సి ఉంది.(చదవండి: ఎత్తుకు తగ్గా బరువు ఉంటున్నారా..? -
Global Burden of Disease: సగటు జీవితకాలం పైపైకి..
న్యూఢిల్లీ: మానవాళికి శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా మనుషుల సగటు జీవితకాలం పెరుగుతున్నట్లు అంతర్జాతీయ అధ్యయనం ఒకటి వెల్లడించింది. 2022 నుంచి 2050 మధ్య పురుషుల్లో 4.9 సంవత్సరాలు, మహిళల్లో 4.3 సంవత్సరాలు పెరుగుతుందని తేల్చింది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్కు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్, ఎవాల్యుయేషన్(ఐహెచ్ఎంఈ) నిర్వహించిన గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజెస్(జీబీడీ)–2021 అధ్యయనం వివరాలను లాన్సెట్ జర్నల్‌లో ప్రచురించారు. ‘‘మొత్తమ్మీద ప్రపంచవ్యాప్తంగా సగటు జీవితకాలం ఐదేళ్ల దాకా పెరుగుతుంది. కానీ అదే సమయంలో వ్యాధుల ముప్పు కూడా బాగా పెరుగుతుంది. గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, డయాబెటిస్ వంటివి ఎక్కువ ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా స్థూలకాయం, అధిక రక్తపోటు వంటివి బాగా వేధిస్తాయి’’ అని అధ్యయనం హెచ్చరించింది. ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవడం ద్వారా ఈ ముప్పును వీలైనంతగా తగ్గించుకోవచ్చని అధ్యయనం సూచించింది. అధ్యయనం ఇంకా ఏం తేలి్చందంటే... → సగటు జీవితకాలం పురుషుల్లో ఐదేళ్లు, మహిళల్లో నాలుగేళ్లు పెరుగుతుంది. స్త్రీలలో 71.1 నుంచి 76 ఏళ్లకు, పురుషుల్లో 76.2 నుంచి 80.5 ఏళ్లకు పెరుగుతుంది. → పూర్తి ఆరోగ్యవంతమైన జీవితకాలం ప్రపంచవ్యాప్తంగా సగటున 2.6 ఏళ్లు పెరుగుతుంది. ఇది 2022లో 64.8 ఏళ్లుండగా 2050 నాటికి 67.4 ఏళ్లకు చేరుతుంది. → భారత్‌లో 2050 నాటికి పురుషుల సగటు జీవిత కాలం 75 ఏళ్లకు కాస్త పైకి, మహిళల్లో 80 ఏళ్లకు చేరుకుంటుంది. → మన భారతదేశంలో ఆరోగ్యవంతమైన జీవితకాలం స్త్రీ పురుషులిద్దరిలోనూ సమానంగానే ఉంటుంది. 2050 నాటికి 65 ఏళ్లు దాటేదాకా ఆరోగ్యంగా జీవిస్తారు. → జీబీడీ–2021 అధ్యయనం కోసం ప్రపంచవ్యాప్తంగా 11,000 సంస్థల సహకారం తీసుకున్నారు. 204 దేశాల నుంచి 371 రకాల వ్యాధులకు సంబంధించిన అంచనాలు, 88 రిస్క్ ఫ్యాక్టర్లను పరిగణనలోకి తీసుకున్నారు. → ప్రపంచవ్యాప్తంగా వైద్య సదుపాయాలతోపాటు ఆరోగ్యకరమైన జీవనశైలిపై జనంలో అవాగాహన పెరుగుతుండడం సగటు జీవితకాలం పెరుగుదలకు దోహదపడుతోంది. → జీవితకాలం పెరుగుదల విషయంలో ప్రపంచ దేశాల మధ్య అసమానతలు చాలావరకు తగ్గుతున్నట్లు గుర్తించామని ఐహెచ్ఎంఈ డైరెక్టర్ క్రిస్ ముర్రే చెప్పారు. → సగటు జీవనకాలం ప్రస్తుతం తక్కువగా ఉన్న దేశాల్లో 2050 నాటికి బాగా పెరగనుందన్నారు. హృద్రోగాలు, కరోనాతో పాటు తీవ్రమైన అంటు రోగాలతో పాటు పౌష్టికాహార లోపం తదితరాలను తట్టుకునే సామర్థ్యం పెరుగుతుండటమే అందుకు కారణమని ముర్రే చెప్పారు. → భావి తరాలు స్థూలకాలం, అధిక రక్తపోటుతో బాగా బాధపడే ఆస్కారముందని అభిప్రాయపడ్డారు. -
గంపెడు సంతానం దీర్ఘాయుష్షుకు గ్యారెంటీ కాదు!
ఎక్కువ సంతానం ఉంటే అంత దీర్ఘాయువు ఉంటుందని విశ్వసించేవారు మన పెద్దవాళ్లు. కానీ అది వాస్తవం కాదని శాస్త్రవేత్తలు జరిపిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. త్వరితగతిన పునరుత్పత్తిని ప్రోత్సహించే జన్యువులు మనిషి ఆయుర్దాయాన్ని తగ్గిస్తాయని చెబుతున్నారు. ఈ పరిశోధన మనిషి వృధాప్య రహస్యాన్ని అర్థం చేసుకునే మార్గాన్ని సుగమం చేసిందన్నారు. ఇక్కడ పునరుత్పత్తిని ప్రోత్సహించే జన్యువులు మనిషి జీవితకాలంపై ఎలా బలంగా ప్రభావం చూపిస్తున్నాయో అనేదాని గురించి చాలా ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పునురుత్పత్తి మనిషి జీవితకాలం తగ్గిపోవడానికి లింకప్ చేయబడి ఉంటుందన్న సరికొత్త విషయాన్ని కనుగొన్నారు శాస్త్రవేత్తలు. త్వరితగతిన పిల్లలను కనడాన్ని ప్రోత్సహించే జన్యువులు తక్కువ జీవిత కాలన్ని సూచిస్తాయని అన్నారు. ఈ మేరకు మిచిగాన్ విశ్వవిద్యాలయం నేతృత్వంలో శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో తొందరగా తల్లిదండ్రులుగా మారిన వారి జీవితకాలం సుమారు 76 ఏళ్ల వరకే ఉంటున్నట్లు వారి సంభావ్యత జన్యువుల సంబంధం ఆధారంగా నిర్థారించారు. ఈ ఆవిష్కరణ వృధాప్య రహస్యన్ని చేధించే పరిశోధనను సులభతరం చేస్తోందన్నారు శాస్త్రవేత్తలు. అలాగే ఈ సృష్టి మానవుడికి ఇచ్చే జీవిత దశలు చాలా ఆశ్చర్యకరంగానూ, సంక్లిష్టంగానూ ఉంటాయన్నారు. ఈ అధ్యయనంలో దాదాపు 2 లక్షల మంది పైగా వ్యక్తులు పాల్గోన్నారు. వారందరి జన్యువులు, పునరుత్పత్తి, వారి జీవిత కాలాన్ని సేకరించి ఆ డేటా ఆధారంగా ఈ కొత్త విషయాన్ని కనుగొన్నామని అన్నారు. జీవశాస్త్రవేత్త జియాంజీ జాంగ్ మనషి జీవిత కాలన్ని జన్యుపరంగా పునురుత్పత్తి చాలా బలంగా పరస్పర సంబంధం కలిగి ఉందన్నారు. అంటే ఇక్కడ పునరుత్పత్తిని ప్రోత్సహించే జన్యు పరివర్తనలే జీవితకాలాన్ని తగ్గిస్తాయి. ఇది కాస్త హాస్యస్పదంగా అనిపిస్తున్నా కాస్త నిశితంగా గమనిస్తే గర్భ నిరోధకం, గర్భస్రావం, తదితరాల ఆరోగ్య సంరక్షణపై ప్రభావం చూపుతాయన్నది వాస్తవం. కాబట్టి పునరుత్పత్తి అనేది మనిషి ఆయుర్దాయంపై ప్రభావం చూపుతుందన్నది పరిశోధకులు వాదన. అదే సమయంలో ఇక్కడ జన్యు సంసిద్ధత తోపాటు కొంత పర్యావరణ కారకాలు కూడా మనిషి జీవితకాలం తగ్గిపోయేందుకు కారణమని చెబుతున్నారు. ఇక్కడ పునురుత్పత్తి, జీవితకాలం మద్య జరగుతున్న జన్యు ఉత్ఫరివర్తనాలకు సంబంధించిన సంక్లిష్ట చర్యను అర్థం చేసుకుంటే వృద్ధాప్య రహస్యాన్ని సులభంగా చేధించగలమని అన్నారు. ఈ అధ్యయనాలు వృధాప్యం(వయసు) అనేది సహజ ప్రక్రియ అని, అది పునరుత్పత్తి అనే అంశంపైనే బలంగా ఆధారపడి ఉందని చెబుతున్నాయన్నారు. ఎందుకంటే? మన ఫిట్నెస్ అనేది పునురుత్పత్తి ఆధారంగానే సెట్ చేసి ఉంటుంది. అందువల్ల పునరుత్పత్తి ప్రక్రియ పూర్తవ్వడం పైనే లైఫ్ స్పాన్ నిర్ణయించబడిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. (చదవండి: కలవరపెడుతున్న 'జాంబీ డీర్ వ్యాధి'! మనుషులకు కూడా వస్తుందా?) -
ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ..
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత కలుషిత నగరం ఢిల్లీ అని ఓ అధ్యయనం చెబుతోంది. తీవ్ర కాలుష్యం బారిన పడుతున్న ఢిల్లీ వాసులు తమ ఆయుర్దాయంలో అత్యధికంగా 11.9 ఏళ్లు కోల్పోతున్నారని పేర్కొంది. జాతీయ వాయు నాణ్యత ప్రమాణం ప్రకారం చూసినా దేశ రాజధాని వాసులు సగటు కన్నా 8.5 ఏళ్లు నష్ట పోతున్నారని తెలిపింది. భారత్‌లో ప్రజల ఆరోగ్యానికి కాలుష్యం పెనుముప్పుగా తయారైందని యూనివర్సిటీ ఆఫ్ షికాగో ఎనర్జీ పాలసీ ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన ది ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ (ఏక్యూఎల్‌ఐ) ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) నిర్దేశించిన కాలుష్య స్థాయిల కంటే భారత్‌లో చాలా ఎక్కువ కాలుష్యం ఉందని పేర్కొంది. డబ్ల్యూహెచ్‌వో మార్గదర్శకాల ప్రకారం పర్టిక్యులేట్ మాటర్ (పీఎం) 2.5 ఐదు మైక్రోగ్రాములు/క్యూబిక్ మీటర్‌గా కాలుష్యం ఉండాల్సి ఉంది. కాలుష్య తీవ్రతలు ఇలానే కొనసాగితే భారతీయుల సగటు ఆయుర్దాయం కన్నా 5.3 ఏళ్లు తగ్గుతుందని తెలిపింది. దేశంలోని మొత్తం 130 కోట్ల మందికి పైగా ప్రజలు వార్షిక సగటు కాలుష్య స్థాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల కంటే ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. చదవండి: చివరి దశకు చేరిన చంద్రయాన్–3 మిషన్.. మిగిలింది వారం రోజులే! జాతీయ వాయు నాణ్యత ప్రమాణం 40 మైక్రోగ్రాములు/క్యూబిక్ మీటర్లకు మించి కాలుష్యం ఉండే ప్రాంతాల్లో 67.4 శాతం మంది నివసిస్తున్నారని నివేదిక తెలిపింది. సగటు భారతీయుడి ఆయుర్దాయం కాలుష్యం కారుణంగా 5.3 ఏళ్లు తక్కువగా ఉంటోందని వివరించింది. 2021లో భారత్‌లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పరి్టక్యులేట్ మాటర్ (పీఎం) 2.5 నమోదు చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు సగటు కన్నా 2.6 ఏళ్లు, తెలంగాణ ప్రజలు సగటు కన్నా 3.2 ఏళ్లు కోల్పోతున్నారని తెలిపింది. జాతీయ వాయు నాణ్యత ప్రమాణం 40 మైక్రోగ్రాములు/క్యూబిక్ మీటర్ల ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఆయుష్షు ముప్పు లేదని తెలిపింది. దేశంలో హృదయ సంబంధ వ్యాధులతో 4.5 ఏళ్లు, తల్లీ పిల్లల పోషకాహార లోపంతో 1.8 ఏళ్ల ఆయుర్దాయం కోల్పోతున్నట్లు నివేదిక పేర్కొంది. 2013– 2021 మధ్య ప్రపంచవ్యాప్తంగా పెరిగిన కాలుష్యంలో భారత్ వాటా 59.1 శాతమని తెలిపింది. సగటు కంటే ఎక్కువగా ఆయుర్దాయం కోల్పోతున్న అత్యధిక జనాభా కలిగిన 10 రాష్ట్రాలు వరసగా.. యూపీ, బిహార్, బెంగాల్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు ఉన్నాయని తెలిపింది. -
ఆయుష్మాన్ భవ..పెరుగుతున్న ప్రజల జీవితకాలం
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఆయుష్మాన్ భవ.. శతమానం భవతిః.. దీవెన ఏదైనా ఎక్కువకాలం హాయిగా బతికేయండి అన్న కోరికే. దీవెనలు ఏమోగానీ.. ఉత్తమ వైద్య విధానాలు, ఆరోగ్యంపై జాగ్రత్తలతో మనుషుల సగటు ఆయుర్దాయం మాత్రం పెరుగుతోంది. ‘ఆరోగ్యం అంటే.. శారీరకంగా, మానసికంగా, సామాజికంగా పూర్తి హాయిగా జీవించే స్థితి. ఈ మూడు అంశాలే మనిషి ఆయుష్షును నిర్ధారిస్తాయి’ అన్నది ప్రపంచ ఆరోగ్యసంస్థ సూత్రీకరణ. దీనికితోడు కరోనా మహమ్మారి కారణంగా జనంలో ఆరోగ్యం పట్ల పెరిగిన జాగ్రత్తలూ ప్రభావం చూపుతున్నాయి. ఇంటింటా ఆక్సిజన్, థర్మా మీటర్లు, ఆన్‌లైన్‌లోనూ డాక్టర్ సలహాలు, ఇంటి ముందుకే వచ్చే ఔషధాలు, ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు, వ్యాయామంపై ఆసక్తి.. వంటివి జీవనశైలిని మార్చేశాయి. ఇది ఆయుర్దాయం మరింతగా పెరిగేందుకు దోహదపడుతోంది. సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితం భారతదేశంలో సగటు ఆయుర్దాయం 63.9 ఏళ్లుకాగా... ఇటీవలి జాతీయ కుటుంబ సర్వే–5 లెక్కల మేరకు 69.7 ఏళ్లకు పెరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలైతే సగటు ఆయుః ప్రమాణంలో జాతీయ సగటును మించిపోయాయి. 2003–04లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 64.6 ఏళ్ల సగటు ఆయుర్దాయం ఉండగా.. తాజా లెక్కల్లో ఆంధ్రప్రదేశ్‌లో 70.3 ఏళ్లు, తెలంగాణలో 69.8 ఏళ్లుగా నిర్ధారించారు. అయితే దక్షిణాది రాష్ట్రాలతో (కేరళ మినహా) పోలిస్తే ఉత్తరాది రాష్ట్రాల్లో సగటు ఆయుర్దాయం ఎక్కువగా ఉన్నట్టు తేలింది. అందరిలో ఢిల్లీ.. మహిళల్లో కేరళ.. తీవ్రమైన చలి ఓవైపు.. అధిక ఎండలు ఇంకోవైపు.. 3 నెలల పాటు ఊపిరి ఆడని కాలుష్యం ఇంకోవైపు కమ్మేస్తున్నా 75.9 ఏళ్ల సగటు ఆయుర్దాయంతో దేశంలో ఢిల్లీ టాప్ ప్లేస్‌లో నిలిచింది. కేవలం మహిళల ఆయుర్దాయాన్ని పరిగణనలోకి తీసుకుంటే కేరళ 78 ఏళ్ల ఆయుష్షుతో టాప్ ప్లేస్‌లో ఉంది. ఇక దక్షిణ భారతంతో పోలిస్తే.. ఉత్తరాన చల్లని వాతావరణం, ఆహార అలవాట్లు, శారీరక శ్రమ వంటి వాటితో ఆయుర్దాయం కాస్త ఎక్కువగా ఉంటోందని నిపుణులు చెప్తున్నారు. దీనితోపాటు దక్షిణాది రాష్ట్రాల్లో దేశ సగటును మించి మధుమేహం, అధిక రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యలు ఆయుష్షుపై ప్రభావం చూపుతున్నాయని విశ్లేషిస్తున్నారు. మెరుగైన వైద్య సౌకర్యాలతో.. దేశంలో కేన్సర్, గుండె, నాడీ సంబంధ వ్యాధులతో అకాల మరణాలు సంభవిస్తున్న నేపథ్యంలో ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. ‘హెల్తీ ఫిట్ నేషన్’ దిశగా ప్రజారోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇస్తుండటంతో ప్రజలకు మెరుగైన వైద్యం చేరువుతోంది. వ్యాధి నిర్ధారణ, మెరుగైన చికిత్సలకు మరోవైపు మహిళలు, పసిపిల్లల్లో పోషకాహార లోపం నియంత్రణ, వృద్ధుల కోసం నిర్వహిస్తున్న జెరియాట్రిక్ కేర్లు సత్ఫలితాలు ఇస్తున్నాయి. దీంతో వచ్చే ఆరేళ్లలో ఉత్తరాది రాష్ట్రాలను మించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఆయుర్దాయం పెరుగుతుందన్న అంచనాలు ఉన్నాయి. తెలంగాణలో ప్రస్తుతం 80ఏళ్ల నుంచి 107 ఏళ్ల మధ్య వయసున్న వారు 4,87,950 మంది ఉన్నట్టు 2023 ఓటర్ల జాబితా గణాంకాలు చెప్తున్నాయి. జగమంత కుటుంబం నాది.. నాగర్ కర్నూల్ జిల్లా సిర్సవాడకు చెందిన గంటా వెంకట రమణమ్మ వయసు 107 సంవత్సరాలు. తెలంగాణలో అందరికంటే పెద్ద వయసు వ్యక్తి ఈమెనే. దశాబ్దాలుగా మూడు పూటలా సంకటి, అంబలి తీసుకుంటూ పొలం పనులతో శారీరక శ్రమ చేసిన ఆమె.. ఇప్పటికీ మందులు, ఇంజక్షన్ల అవసరమే రాలేదని చెప్తున్నారు. ఆమెకు ఏడుగురు కొడుకులు, ఒక బిడ్డ. వారి సంతానం కూడా కలిపితే మొత్తం 186 మంది. ఇటీవలే రమణమ్మ జన్మదినం సందర్భంగా అంతా కలిసి వేడుక కూడా చేశారు. 5జీ బామ్మ కామారెడ్డి జిల్లా చిట్యాలకు చెందిన మల్తుం బాలవ్వ వయసు 102 ఏళ్లు. ఆమెకు ముగ్గురు బిడ్డలు, ఇద్దరు కొడుకులు. వారి పిల్లలు, మనవళ్లతో కలిపి మొత్తం 94 మంది. ఇప్పుడు ఆమె ఐదో తరాన్ని (5జీ) చూస్తున్నారు. ఇటీవలే బాలవ్వ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. వెండి గిన్నెలో పాలు పోసి బంగారు పాత్రతో ఐదో తరం మునిమనవళ్లకు పాలు పట్టించింది ఆమె. భూమాతతో బంధం పోనివ్వనంటూ కాళ్లకు చెప్పుల్లేకుండానే పనులన్నీ చక్కబెట్టుకోవటం బాలవ్వ ప్రత్యేకత. ‘‘వాతావరణ పరిస్థితులు, ఆహార అలవాట్లతోపాటు శారీరక శ్రమతో ఎక్కువకాలం జీవించే అవకాశం ఉంటుంది. దక్షిణాది వారితో పోలిస్తే ఉత్తర భారతీయులు శారీరక శ్రమ అధికంగా చేస్తారు. దానికితోడు అక్కడి వాతావరణ పరిస్థితులు, ఆహార అలవాట్ల వల్ల కూడా..ఉత్తర భారతదేశ రాష్ట్రాల్లో సగటు ఆయుష్షుకాస్త ఎక్కువగా ఉంటుంది.’’ – డాక్టర్ సి.మోహన్‌రావు, సీసీఎంబీ మాజీ డైరెక్టర్ -
సూర్యుడికి ఆయుక్షీణం
లండన్: జగతికి వెలుగునిస్తూ భూగోళంపై జీవజాలం మనుగడకు ఆధారభూతమైన సూర్యుడి ఆయువు క్రమంగా తగ్గిపోతోందట. సూర్యగోళం జీవితకాలం మరో 457 కోట్ల సంవత్సరాలేనని, ఆ తర్వాత అదొక కాంతిహీనమైన తెల్లటి మరుగుజ్జు గ్రహంగా మిగిలిపోతుందని యూరోపియన్ అంతరిక్ష సంస్థ(ఈఎస్ఏ) చెబుతోంది. భానుడి జీవితకాలం సగం ముగిసిపోయిందని, మరో సగమే మిగిలి ఉందని పేర్కొంటోంది. ఈ ఏడాది జూన్‌లో విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయాన్ని బహిర్గతం చేసింది. అంతరిక్ష పరిశోధనల కోసం ఈఎస్ఏ ప్రయోగించిన గైయా స్పేస్ అబ్జర్వేటరీ(స్పేస్‌క్రాఫ్ట్) భానుడి జీవితకాలాన్ని లెక్కగట్టింది. మన సౌర వ్యవస్థలో కేంద్ర స్థానంలో ఉన్న సూర్యుడు నిరంతరం మండే ఓ అగ్నిగోళం. అందులో సౌర తుపాన్లు సంభవిస్తుంటాయి. అత్యధిక శక్తి వెలువడుతుంది. సూర్యుడి ఆయువు క్షీణిస్తుండడానికి కారణం ఏమిటంటే.. అందులోని హైడ్రోజన్ నిల్వలే. సూర్యుడి ఉపరితలం ఉన్న హైడ్రోజన్ హీలియం వాయువులో సంలీనం చెందుతూ ఉంటుంది. ఫలితంగా ఉష్ణం ఉద్గారమవుతుంది. భవిష్యత్తుతో హైడ్రోజన్ హీలియంలో సంలీనం చెందకుండా సూర్యుడి కేంద్ర స్థానం వైపు వెళ్తుందట! దాంతో సూర్యుడి ఉపరితలంపై ఉష్ణోగ్రతలు భారీగా తగ్గిపోతాయి. సూర్యగోళం మొత్తం వయసు 10,110 కోట్ల సంవత్సరాలు అనుకుంటే, 800 కోట్ల సంవత్సరాల వయసు నాటికి గరిష్ట ఉష్ణోగ్రతకు చేరుకుంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అనంతరం ఉష్ణోగ్రత క్రమంగా తగ్గుముఖం పడుతుందని, పరిమాణం తగ్గిపోతుందని చెబుతున్నారు. -
రష్యా తో ‘లైఫ్ లైన్స్’కు ముప్పు!
ఆధునిక సాంకేతికత మన జీవితాలను ఆక్రమించేసింది. ఇంటర్నెట్ లేనిది క్షణమైనా గడవని పరిస్థితి. కొద్ది గంటలు ప్రపంచంలోని కొన్ని దేశాల్లో ఇంటర్నెట్ సేవలు లేదా సామాజిక మాధ్యమ యాప్‌లు నిలిచిపోతే అదో పెద్ద వార్త అవుతోంది. అలాంటిది ఇంటర్నెట్కు జీవనాడులుగా పరిగణించే సముద్రగర్భంలోని ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్‌ను ఎవరైనా కత్తిరించేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ప్రపంచం స్తంభించిపోతుంది. అండర్ వాటర్ క్యాప్సుల్ పనితీరును ప్రత్యక్షంగా పరిశీలిస్తున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ (ఫైల్) వివిధ ఖండాలను కలుపుతున్న ఆప్టికల్ ఇంటర్నెట్, రక్షణ వ్యవస్థలు, వైద్య ఆరోగ్య సేవలు, విద్యుత్ పంపిణీ వ్యవస్థలు, ఆర్థిక కార్యకలాపాలు, క్యాబ్ సర్వీసులు, ఫుడ్ డెలివరీలు... ఇలా ఒకటేమిటి ప్రతిదీ నిలిచిపోతుంది. ప్రపంచం అతలాకుతలమవుతంది. ఇప్పుడదే ముప్పు రష్యా నుంచి పొంచి వుందని అమెరికా, బ్రిటన్‌తో సహా ప్రపంచదేశాలు ఆందోళన చెందుతున్నాయి. అణ్వాయుధ పోటీ గతించిన ముచ్చట. శత్రుదేశాలను దెబ్బతీయడానికి, ప్రపంచ దేశాలను భయపెట్టడానికి రష్యా, చైనాలు ఇప్పటికే సైబర్ దాడులను సమర్థమంతమైన ఆయుధంగా వాడుతున్నాయి. ఇతర దేశాల్లోని కీలక వ్యవస్థలపై దాడులు కొనసాగిస్తూ, వాటిని కుప్పకూల్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. హ్యాకింగ్, డేటా చౌర్యం జరుగుతోంది. అందుకే ప్రపంచదేశాలన్నీ ‘సైబర్ సెక్యూరిటీ’ని అతిపెద్ద సవాల్‌గా స్వీకరించాయి. ఈ తరుణంలోనే రష్యా గత ఐదారేళ్లుగా కొత్త యుద్ధ తంత్రానికి తెరలేపింది. సముద్రగర్భంలోని ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్‌ను లక్ష్యంగా చేసుకుంటూ... ఏ క్షణమైనా వాటిని తుంచేసే విధంగా అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. వీటిలో నుంచి ప్రసారమయ్యే సమాచారాన్ని తస్కరించే సాంకేతికతలనూ అభివృద్ధి చేస్తోంది. భారీగా పెట్టుబడులు పెడుతోంది. కొత్తగా నియమితులైన బ్రిటన్ చీఫ్ ఆప్ డిఫెన్స్ స్టాఫ్ అడ్మిరల్ టోనీ రాడకిన్ ఈ జీవనాడులకు రష్యా నుంచే ప్రధాన ముప్పు పొంచి వుందని గతవారం ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సముద్రగర్భంలోని ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్‌ను పరిరక్షించుకోవడానికి.. ప్రత్యేక నిఘా నౌకను 2024 కల్లా జలప్రవేశం చేయిస్తామని బ్రిటన్‌కు చెందిన రాయల్ నేవీ ఇటీవల ప్రకటించింది. ఇది అణ్వాయుధ యుద్ధంతో సమానమైన ముప్పని రక్షణ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా లక్ష మంది సైన్యాన్ని మోహరించడంతో రెండు నెలలుగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఉక్రెయిన్ను ఆక్రమిస్తే తీవ్ర పర్యవసానాలు చవిచూడాల్సి వస్తుందని అమెరికా, నాటో దేశాలు రష్యాను పలుమార్లు హెచ్చరించాయి. దీంతో రష్యా అభివృద్ధి చేస్తున్న సముద్రగర్భ సాంకేతికతలు, సమకూర్చుకుంటున్న సాధానాలపై అంతర్జాతీయంగా చర్చ మొదలైంది. రష్యా ఇలాంటి తీవ్ర చర్యలకు దిగే అవకాశాలు తక్కువే అయినా... అమెరికా, నాటో దేశాలతో ఘర్షణ ముదిరితే... రష్యా దీన్నో ఆయుధంగా వాడే ప్రమాదం ఉందనేది నిపుణుల అభిప్రాయం. రష్యా ఏయే మార్గాల్లో ప్రపంచానికి జీవనాడులైన ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్‌ను దెబ్బతీయగలదో చూద్దాం.. 436: వివిధ సముద్రాల మీదుగా పలు ఖండాలను, ప్రపంచ దేశాలను కలుపుతూ కడలి గర్భంలో మొత్తం 436 ఆప్టికల్ ఫైబర్ కేబుల్ లైన్స్ ఉన్నాయి. వీటి మొత్తం పొడవు.. 12,87,475 కిలోమీటర్లు. ఇవే నేటి మన ప్రపంచపు జీవనాడులు (లైఫ్ లైన్స్). నిరంతరాయ ఇంటర్నెట్ సేవలకు మూలాధారం. వీటిలో అన్నింటికంటే పొడవైనది అమెరికా– ఆసియా ఖండాలను కలిపేది. ఈ కేబుల్‌లైన్ పొడవు 20,004 కిలోమీటర్లు. 97%: అంతర్జాతీయంగా నిత్యం జరిగే కమ్యూనికేషన్స్‌లో 97 శాతం ఈ కేబుల్స్ ద్వారానే జరుగుతుంది. శాటిలైట్స్ మన కమ్యూనికేషన్స్ అవసరాల్లో మూడు శాతం మాత్రమే తీరుస్తున్నాయి. 10 లక్షల కోట్ల డాలర్లు: సముద్రపు అడుగుభాగంలోని 436 కేబుల్ లైన్స్ ద్వారా ప్రతిరోజూ 10 లక్షల కోట్ల డాలర్ల విలువైన ఆర్థిక లావాదేవీలు జరుగుతాయి. ప్రపంచం ఆర్థిక రంగానికి ఇదే లైఫ్‌లైన్. -
పొట్ట బ్యాక్టీరియా ఆయుష్షు పెంచుతుందా?
కడుపు/పేవుల్లో ఒక రకమైన బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటే నిత్య యవ్వనాన్ని ఆనందించవచ్చా? కావచ్చునేమో అంటున్నారు మెలిస్సా హీలే. లాస్ ఏంజిలస్ టైమ్స్‌కు చెందిన ఈ జర్నలిస్ట్ ఇటీవలి కాలంలో జరుగుతున్న అనేకానేక పరిశోధనలను మదింపు చేసి మరీ ఈ అంచనాకు వస్తున్నారు. అక్కెర్మన్సియా ముసినిఫిలియా అనే బ్యాక్టీరియానే ఉదాహరణగా తీసుకుంటే ఇది వయసు పెరిగేకొద్దీ మనకు వచ్చే ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుందని పలు పరిశోధనలు చెబుతున్న విషయాన్ని మెలిస్సా గుర్తు చేస్తున్నారు. వయసుమీరిన ఎలుకలు, కోతుల్లో ఈ బ్యాక్టీరియా జీవక్రియలను ఆరోగ్యకరమైన స్థాయికి పునరుద్ధరించగలిగిందని అంతేకాకుండా ఇన్సులిన్ నిరోధకతను కూడా అడ్డుకుందని తెలిపారు. ఇన్సులిన్ నిరోధకత కేవలం మధుమేహానికి సూచిక మాత్రమే కాదని, ఊబకాయం, వయసుతోపాటు పెరిగే మంట/వాపు, రోగ నిరోధక శక్తిలో తగ్గుదల వంటి సమస్యలకూ కారణమని వివరించారు. ఈ బ్యాక్టీరియా ఎక్కువగా కేన్సర్ రోగులు ఇమ్యూనోథెరపీకి బాగా స్పందిస్తున్నట్లు ఇంకో పరిశోధన చెబుతోందని.. ఈ రకమైన రోగుల నుంచి సేకరించిన బ్యాక్టీరియాను మానవ కేన్సర్లతో కూడిన జంతువుల్లోకి జొప్పించినప్పుడు అవి కూడా మెరుగ్గా స్పందించినట్లు తెలిసిందని మెలిస్సా వివరించారు. -
ఆయువును పెంచేది ప్రేమానురాగాలే.!
‘ఈమె మరో రెండు వారాలు మహా ఆయితే మరో వారం రోజులు మాత్రమే బతుకుతుంది’ అని ఐసీయూ వైద్యులు పేషెంట్ కుమార్తె, కుమారుడికి చెప్పారు. ఆ పేషెంట్ వయస్సు 60 ఏళ్లు. ఊపిరితిత్తుల క్యాన్సర్ బాధితురాలు. చివరిదశలో ఐసీయూలో పెట్టగా వైద్యులు చెప్పిన ఆమె అంత్యదశకు చెందిన సమాచారమిది. ఆమెకు వైద్యం లేదని గంటలు, రోజులు మాత్రమే లెక్కపెట్టుకోవాలని వైద్యులు చెప్పారు. ఇవేవీ ఆమెకు తెలీవు. ‘నన్ను ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై ఉంచొద్దు. ఇక్కడి నుంచి నన్ను తీసుకెళ్లండి. నాకు ఇక వైద్యం వద్దు’ అని ఆమె తన కన్నవారిని కోరుకుంటోంది. ఏం చేయాలో తోచని ఆమె కూతురు, కొడుకులకు ఎవరో ‘స్పర్శ్ హాస్పీస్’ గురించి తెలిపారు. ‘ప్రతి వ్యక్తికి జీవించే హక్కు ఉన్నట్లే గౌరవప్రదమైన మరణం కూడా ఒక హక్కుగా ఉంటుంది’ అని ప్రగాఢంగా నమ్మిన సంస్థ స్పర్శ్ హాస్పీస్. మనిషి పుట్టినప్పుడు ఆ కుటుంబం ఎలా సంబరాలు జరుపుకుంటుందో, అదేవిధంగా చావుని కూడా పేషెంట్ సంతోషంగా ఆహ్వానించే ధైర్యాన్ని కలిగించి ‘బాధరహిత’ అనుభవంగా అంత్య దశను కల్పించడం ఆ కుటుంబం బాధ్యత. స్పర్శ్ సంస్థ ఆ ఉద్దేశంతోటే అంత్యదశలో ఉన్న క్యాన్సర్ బాధితులకు తన వంతు తోడ్పాటు అందిస్తోంది. ఈ నేపథ్యంలో తమ తల్లి రిపోర్టులు తీసుకుని వారు స్పర్శ్ సాయం కోసం వచ్చారు. అలా స్పర్శ్‌కి వచ్చేటప్పటికి ఆమె అపస్మారక దశలో, ముక్కులో ట్యూబ్‌తో, ఆక్సిజన్ సిలిండర్‌తో ఉన్నారు. ఆమె బాధలకు తగిన మందులు ఇవ్వడమైంది. క్రమంగా అపస్మారక స్థితి నుంచి కోలుకుని, ఆక్సిజన్ సిలిండర్ అవసరం లేకుండా స్వయంగా గాలి పీలుస్తూ, ట్యూబ్‌ల అవసరం లేకుండా నోటితో ఆహారం తీసుకునే స్థితికి వచ్చారు. తన దగ్గరి బంధువులతో కబుర్లు చెబుతూ మూడున్నర నెలలు స్పర్శ్‌లో ఉన్నారు. రోజుల్లో చనిపోతుందని వైద్యులు చెప్పిన ఆమె.. కుటుంబ సభ్యుల ప్రేమ, ఇంటి వాతావరణం ఉన్న నవీన వైద్యశాల వలన నెలలపాటు బతికారు. ఆమె మరణం కూడా కుటుంబ సభ్యుల మధ్యే సుఖంగా జరిగింది. నిజానికి అంత్యదశ పేషెంట్ల జీవితకాలం పెంచడానికి స్పర్శ్ ఎలాంటి చికిత్స చేయదు. వారి మిగిలిన జీవిత కాలంలో ప్రేమ అనురాగం, ఆత్మీయతలను నింపుతుంది. అదే వారికి నవీన శక్తినిచ్చి నాణ్యమైన అంత్యదశను అనుభవిస్తారు. అంత్యదశలో సుఖమరణాన్ని అందరికీ అందుబాటులో డబ్బులతో సంబంధం లేకుండా అందించడమే స్పర్శ్ ముఖ్య లక్ష్యం. – శారద, స్పర్శ్ హాస్పీస్ సంస్థ వలంటీర్ ‘ 040–23384039 -
పిల్లలున్న తల్లి ఆయుష్షు 11 ఏళ్లు తగ్గుతుంది!
వాషింగ్టన్: పిల్లలకు జన్మనిస్తే ఆ స్త్రీ జీవితకాలం 11 సంవత్సరాలు తగ్గిపోతుందని తాజా పరిశోధనలో తేలింది. పిల్లలు లేని మహిళలతో పొల్చిచూస్తే పిల్లలున్న మహిళ సాధారణ జీవితాకాలం కంటే 11 ఏళ్లు తక్కువగా ఉంటుందంటూ జార్జ్ మాసన్ యూనివర్సిటీ తాను చేసిన అధ్యయనాన్ని ఆదివారం వెల్లడించింది. మానవ క్రోమోజోముల్లో ఉండే టెలోమేర్స్ సగటు జీవితకాలం.. పిల్లలున్న మహిళల్లో తక్కువగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అయితే, ప్రస్తుత పరిశోధనలు ప్రాధమిక దశలో ఉన్నాయని, మరింత అధ్యయనం తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని యూనివర్సిటీ రిసెర్చర్ జె పోలాక్ తెలిపారు. పిల్లలు పుట్టిన తర్వాత టెలోమేర్స్ పొడవు తగ్గిపోతుందా లేదా అన్న విషయాన్ని కూడా ఇంకా నిర్ధరించుకోవాల్సి ఉందని ఆమె చెప్పారు. క్రోమోజోమ్స్ పనితీరుకుతోడు పని ఒత్తిడి, సామాజిక స్థితిగతులు కూడా మహిళ ఆయుష్షుపై ఏవిధమైన ప్రభావాన్ని చూపుతాయో పరిశోధనలు చేస్తున్నామన్నారు. -
నడుమునొప్పి -ఆయుర్వేద చికిత్స
ప్రస్తుత పరిస్థితుల్లో మానవుని జీవనం ప్రకృతి సహజ విధానాలకు విరుద్ధంగా ఉంటోంది. పెరిగిపోతున్న పని ఒత్తిడి, పోషకాహారం సరిగా తీసుకోకపోవడం వలన, ఈరోజుల్లో 40 ఏళ్లకే నడుము నొప్పి వస్తోంది. ముఖ్యంగా ఆహార లోపాలు, అస్తవ్యస్తమైన దినచర్యలు, స్వప్న విపర్యం అంటే రాత్రివేళ నిద్రపోకపోవటం, పగటిపూట నిద్రించడం వంటి అలవాట్లు శరీర వ్యవస్థను బాగా దెబ్బ తీస్తున్నాయి. అలాగే ఆందోళన, మానసిక ఒత్తిడి వంటి కారణాలు కూడా అనేక అనారోగ్యాలకు కారణమవుతున్నాయి. వీటిలో అతిముఖ్యమైనది నడుము నొప్పి (కటిశూల). ఆయుర్వేద శాస్త్రం నడుము నొప్పికి గుద్రసీవాతంగా నామకరణం చేసింది. నూటికి 90 శాతం మంది తమ జీవితకాలంలో ఎపుడో ఒక్కసారి నడుము నొప్పి బారిన పడతారని కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది. కారణాలు: ఎక్కువ సమయం ఒకే భంగిమలో కూర్చోవటం, స్థూలకాయం, విశ్రాంతి అనేది లేకుండా ఎక్కువ గంటలు విపరీతంగా శ్రమించడం, అతిగా బరువులు మోయటం, ద్విచక్రవాహనం మీద ఎక్కువ దూరం ప్రయాణం చేయడం, రోడ్డు ప్రమాదాలు, దీర్ఘకాలిక రుగ్మతలు, వంశపారంపర్యం వ్యాధులు ఇవి అన్ని నడుమునొప్పికి కారణమవుతుంటాయి. ఈ కారణాల వల్ల ముఖ్యంగా వాత ప్రకోపం జరుగుతుంది. ఫలితంగా ముందు పిరుదులకు పైభాగాన స్థబ్దతను, నొప్పిని కలిగించి, ఆ తరువాత నడుముభాగం, తొడలు, మోకాళ్లు, పిక్కలు, పాదాల్లోకి వ్యాపిస్తుంది. ఈ సమస్య శీతాకాలంలో ఎక్కువ అవుతుంది. నడుము భాగంలో ప్రత్యేకించి ఎల్-4, ఎల్-5 వెన్నుపూసల మధ్య ఉండే సయాటికా నరం మీద ఒత్తిడి పడటం వల్ల ఈ నొప్పి వస్తుంది. నడుము నొప్పికి ఆయుర్వేద చికిత్స నడుము నొప్పి అనే సమస్యకు ఆయుర్వేద శాస్త్రంలో సమగ్రమైన చికిత్సా పద్ధతులున్నాయి. అందులో నిదాన పరివర్జనం, శమన చికిత్స, శోధన చికిత్స అనే మూడు ప్రధానమైనవి. నిదాన పరివర్జనము: నిదాన పరివర్జనము అనగా వ్యాధికి కారణమైన విషయాలను పాటించకపోవడం. ఉదా: విరుద్ధ ఆహార - విహారసేవన. (రాత్రి మేల్కొనుట, పగలు నిద్రించుట మొదలైనవి) శమన చికిత్స: వ్యాధి దోషాలను శమింపచేయటానికి తెచ్చే ఔషధాలు, ఇందులో రోగ తీవ్రతను బట్టి, రోగి బలాన్ని బట్టి చూర్ణాలు, గుటికలు, కషాయాలు, లేహ్యాలు, తైలాలు ఇత్యాది ఔషధాలు రోగికి ఇవ్వబడతాయి. కానీ, ఈ శమనచికిత్స వలన ప్రకోపించిన దోషాలు మళ్లీ తిరగబడవచ్చు. అందుకే వ్యాధి తీత్రవను బట్టి శమన చికిత్సలతోపాటు, కొందరికి పంచకర్మ (శోధన చికిత్స) కూడా అవసరం. తద్వారా ప్రకోపించిన దోషాలను (వాత, పిత్త, కఫ) సమంగా చేసి శరీర శుద్ధిని, అగ్నిబలాన్ని పెంపొందించవచ్చును. ఆయుర్వేదాన్ని స్నేహకర్మ ద్వారా వెన్నుపూసల మధ్య, స్నిగ్ధత్వాన్ని పెంపొందించి కీళ్ల కదలికను సులభతరం చేసే అవకాశం ఏర్పడుతుంది. స్వేదకర్మ ద్వారా బిగుసుకుపోయిన కీళ్ళను వదులుగా, మృదువుగా మారేలా చేయవచ్చు. కటివస్తి: ఈ విధానం ఆయుర్వేదంలోని ఒక విశిష్ట ప్రక్రియ. అరిగిపోయిన మృదులాస్థికి (కార్టిలేజ్) రక్తప్రసరణను పెంచి నొప్పి తీవ్రతను తగ్గించడంలో ఈ ప్రక్రియ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇదే క్రమంలో సర్వాంగధార చికిత్స కూడా వీరికి బాగా ఉపయోగపడుతుంది. వస్తికర్మ: ఆయుర్వేద శాస్త్రంలో వస్తికర్మ అనే చికిత్స అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ వస్తికర్మ ముఖ్యంగా చిన్నప్రేవులు, పెద్దప్రేవులలోని ఎంటరిక్ వర్వస్ సిస్టమ్‌పై ప్రభావం చూపుతుంది. తద్వారా నాడీకణాలలో ఏర్పడిన లోపాలను సరిచేసి బలం చేకూర్చవచ్చు. అలాగే పక్వాశయలో వాతస్థానం కాబట్టి ప్రకోపించిన వాతాన్ని కూడా సహజస్థితికి తీసుకునిరావచ్చును. జాగ్రత్తలు: అవసరమైన పోషకాహారం తీసుకుంటూ, వ్యాధి తిరిగి రాకుండా వైద్యులు సూచించిన విధానాలను అనుసరించడం చాలా అవసరం. ఔషధ చికిత్సల తరువాత క్రమం తప్పకుండా వ్యాయామం కూడా చేస్తే నడుము నొప్పి సమస్య నుంచి శాశ్వతంగా విముక్తి కలుగుతుంది. డిస్క్‌లో వచ్చే మార్పులు వెన్నుపూసల మధ్య ఉండే డిస్కుల్లో కొన్ని మార్పులు జరిగినప్పుడు, డిస్క్‌ల మీద ఒత్తిడి పెరుగుతుంది. దాంతో వాపు రావటం, డిస్క్కి రక్త ప్రసరణ సరిగా లేకపోవటం, డిస్కు అరిగిపోవడం వంటి అనేక సమస్యల వల్ల ఈ నొప్పి వస్తుంది. డిస్కులో వాపు వస్తే అందులోంచి చిక్కని ద్రవం బయటికి వచ్చి మేరుదండం నుంచి వచ్చే నరాలపైన ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల వెన్ను నొప్పి వస్తుంది. లక్షణాలు నడుములో నొప్పి, వాపు, ఏ కాస్త శ్రమించినా నొప్పి తీవ్రం కావటం, సూదులతో గుచ్చినట్లుగా నొప్పి, కాళ్లల్లో తిమ్మిర్లు, మంటలు ఉంటాయి. సకాలంలో చికిత్స అందకపోతే స్పర్శజ్ఞానం కోల్పోతారు. సమస్య తీవ్రమైతే కొందరు మలమూత్రాల మీద నియంత్రణ కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. పెయిన్ కిల్లర్స్ వాడటం మంచిది కాదు. పెయిన్ కిల్లర్స్‌లో మలబద్దకం, జీర్ణాశయ సమస్యలు వస్తాయి. వెన్ను సంబంధిత సమస్యలను వెంటనే గుర్తించి చికిత్స తీసుకుంటే ఈ వ్యాధి రాకుండా పోతుంది.