ఇటీవల కాలంలో సుదీర్ఘకాలం జీవించాలనే ధోరణి ఎక్కువయ్యింది. కొందరూ సాధారణ వయసు కంటే తక్కువ వయసు వారిలా యవ్వనంగా ఉండాలని చూస్తున్నారు. కొందరూ యవ్వనంగా ఉండటం తోపాటు ఆరోగ్యంగా ఉండాలని భావిస్తున్నారు. అందుకోసం కఠినమైన జీవనశైలిని పాటిస్తున్నారు. వారి జీవసంబంధ వయసు ఎవ్వరూ ఊహించనంత తక్కువగా ఉండేలా ముమ్మరమైన ప్రయత్నాలు చేస్తున్నారు. అదే బాటలో పయనిస్తోంది యూఎస్‌కి చెందిన ఓ జంట. ఇటీవలే కొత్తగా పెళ్లి చేసుకున్న ఈ జంట ఏకంగా 150 ఏళ్లు పాటు జీవించాలనే సంకల్పంతో ఏం చేస్తున్నారో వింటే నోరెళ్లబెడతారు.
అమెరికాలోని మిడ్‌వెస్ట్‌కు చెందిన 33 ఏళ్ల కైలా బర్న్స్ లెంట్జ్, ఆమె భర్త వారెన్ లెంట్జ్(36) వందేళ్లకు మించి జీవించి చూపాలనుకుంటున్నారు. అందుకోసమని ఈ ఇరువురు బయోహాకింగ్ రొటీన్‌ను స్వీకరించారు. ఇక్కడ బయోహాకింగ్ అంటే..సైబర్‌నెటిక్ పరికరాలు లేదా బయోకెమికల్స్‌ను వంటి సాంకేతిక మార్గాల ద్వారా శరీరం విధులను మెరుగుపరచడం లేదా మార్చడాన్ని బయోహాకింగ్ అని అంటారు.
ఇక్కడ ఈ బయోహ్యికింగ్‌ను అనుసరిస్తున్న జంటలో కైలా క్లీవ్‌ల్యాండ్‌లోని దీర్ఘాయువు క్లినిక్ ఎల్‌వైవీ ది వెల్‌నెస్ స్పేస్ సహ యజమాని కాగా, ఆమె భర్త వారెన్ మార్కెటింగ్ ఏజెన్సీలో చీఫ్ రెవెన్యూ ఆఫీసర్. వీరిద్దరు ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుకునేలా మంచి జీవనశైలిని అనుసరిస్తున్నారు.
ఎలాంటి జీవన విధానం అంటే..
వారి రోజు దినచర్య ఆప్టిమైజింగ్ పద్ధుతులతో నిండి ఉంటుంది. ఆ జంట ప్రతి ఉదయం పల్సెడ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ థెరపీతో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత వర్కౌట్‌లు, ఉదయపు సూర్యకాంతిని ఆస్వాదిస్తూ సాగే వాకింగ్ తదితరాలు ఉంటారు. ఆ తర్వాత క్లినిక్ గ్రేడ్ పరికరాలతో ఆరోగ్య మెరుగదలను పరీక్షించడం తదరితరాలన్నింటిని ఓ పద్ధతిలో అనుసరిస్తారు.
చెప్పాలంటే అత్యంత మెరుగైన ఆర్యోగ్యకరమైన జీవిన విధానాన్ని అవలంభిస్తోంది ఈ జంట. దీంతోపాటు సెల్ రిపేర్‌కు సంబంధించి..రోజంతా హైపర్‌బారిక్ ఆక్సిజన్ ఛాంబర్, నానోవి వంటి ఆరోగ్య సాంకేతికతను ఉపయోగిసస్తారు. అలాగే సాయంత్రం పూర్తి విశ్రాంతికి కేటాయిస్తారు. సేంద్రీయ భోజనమే తీసుకుంటారు. సూర్యాస్తమయ సమయానికల్లా ఆవిరి సెషన్‌లో పాల్గొంటారు. అలాగే అందుకు తగ్గట్లు ఇంటి వాతావరణాన్నికూడా సెట్ చేస్తారు. ఇంట్లో రెడ్‌లైట్‌లు వంటి సహజ సిర్కాడియన్ రిథమ్‌లతో ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మారుస్తారు.
రాత్రి తొమ్మిందింటి కల్లా నిద్రపోవడం వంటి మంచి నియమాలను పాటిస్తున్నారు. అంతేగాదు పిల్లలను కనాలనే ఆశతో కొన్నేళ్లుగా శరీరాన్ని ఆప్టిమైజ్(సాంకేతికతో పరిశీలించడం) చేస్తున్నట్లు తెలిపారు. పేరెంటింగ్ అనుభూతిని ఎంజాయ్ చేయాలనే ఉద్దేశ్యంతో ఇరువురి ఆరోగ్యం మెరుగ్గా ఉండేలా కేర్ తీసుకుంటున్నారు. అంతేగాదు వారి జీవనశైలికి అనుగుణంగా పిల్లలను పెంచేలా ప్లాన్ చేసుకుంటున్నారు కూడా. ఈ జంట స్క్రీన్ సమయాన్ని తగ్గించి ఆరుబయట గడపడం, ప్రకృతితో సేద తీరడం వంటి వాటికి ప్రాధాన్యత ఇస్తున్నారు.
సాధ్యమేనా..?
వృద్ధాప్యాన్ని నెమ్మదించేలా లేదా రివర్స్ చేసేలా మంచి ఆరోగ్యకరమైన బయోహ్యాకింగ్ విధానాన్ని అనుసరిస్తున్నారు. ఇంతకముందు ఇలాంటి వాటికి సంబంధించి..వెంచర్ క్యాపిటలిస్ట్ బ్రయాన్ జాన్సన్ వార్తల్లో నిలవగా ఇప్పుడూ ఈ జంట హాట్‌టాపిక్‌గా మారింది. ప్రకృతి ధర్మంగా వచ్చే మార్పులను అంగీకరించాలే గానీ అందుకు విరుద్ధంగా బతికే ప్రయత్నం చేస్తే కొన్ని రకాల పరిణామాలను ఎదుర్కొనక తప్పదనేది కఠిన సత్యం. మరీ వీరంతా ఆ కఠిన సత్యాన్ని తిరగరాసేలా అనుకున్నది సాధించి చూపగలుగుతారా..? లేదా అనేది తెలియాల్సి ఉంది.
(చదవండి: ఎత్తుకు తగ్గా బరువు ఉంటున్నారా..?
Comments
Please login to add a commentAdd a comment