పొట్ట బ్యాక్టీరియా ఆయుష్షు పెంచుతుందా? | Does the stomach bacteria increase lifespan? | Sakshi
Sakshi News home page

పొట్ట బ్యాక్టీరియా ఆయుష్షు పెంచుతుందా?

Published Wed, Nov 21 2018 1:06 AM | Last Updated on Wed, Nov 21 2018 1:06 AM

Does the stomach bacteria increase lifespan? - Sakshi

కడుపు/పేవుల్లో ఒక రకమైన బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటే నిత్య యవ్వనాన్ని ఆనందించవచ్చా? కావచ్చునేమో అంటున్నారు మెలిస్సా హీలే. లాస్‌ ఏంజిలస్‌ టైమ్స్‌కు చెందిన ఈ జర్నలిస్ట్‌ ఇటీవలి కాలంలో జరుగుతున్న అనేకానేక పరిశోధనలను మదింపు చేసి మరీ ఈ అంచనాకు వస్తున్నారు. అక్కెర్‌మన్‌సియా ముసినిఫిలియా అనే బ్యాక్టీరియానే ఉదాహరణగా తీసుకుంటే ఇది వయసు పెరిగేకొద్దీ మనకు వచ్చే ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుందని పలు పరిశోధనలు చెబుతున్న విషయాన్ని మెలిస్సా గుర్తు చేస్తున్నారు.

వయసుమీరిన ఎలుకలు, కోతుల్లో ఈ బ్యాక్టీరియా జీవక్రియలను ఆరోగ్యకరమైన స్థాయికి పునరుద్ధరించగలిగిందని అంతేకాకుండా ఇన్సులిన్‌ నిరోధకతను కూడా అడ్డుకుందని తెలిపారు. ఇన్సులిన్‌ నిరోధకత కేవలం మధుమేహానికి సూచిక మాత్రమే కాదని, ఊబకాయం, వయసుతోపాటు పెరిగే మంట/వాపు, రోగ నిరోధక శక్తిలో తగ్గుదల వంటి సమస్యలకూ కారణమని వివరించారు. ఈ బ్యాక్టీరియా ఎక్కువగా కేన్సర్‌ రోగులు ఇమ్యూనోథెరపీకి బాగా స్పందిస్తున్నట్లు ఇంకో పరిశోధన చెబుతోందని.. ఈ రకమైన రోగుల నుంచి సేకరించిన బ్యాక్టీరియాను మానవ కేన్సర్లతో కూడిన జంతువుల్లోకి జొప్పించినప్పుడు అవి కూడా మెరుగ్గా స్పందించినట్లు తెలిసిందని మెలిస్సా వివరించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement