stomachache
-
పొట్ట బ్యాక్టీరియా ఆయుష్షు పెంచుతుందా?
కడుపు/పేవుల్లో ఒక రకమైన బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటే నిత్య యవ్వనాన్ని ఆనందించవచ్చా? కావచ్చునేమో అంటున్నారు మెలిస్సా హీలే. లాస్ ఏంజిలస్ టైమ్స్‌కు చెందిన ఈ జర్నలిస్ట్ ఇటీవలి కాలంలో జరుగుతున్న అనేకానేక పరిశోధనలను మదింపు చేసి మరీ ఈ అంచనాకు వస్తున్నారు. అక్కెర్మన్సియా ముసినిఫిలియా అనే బ్యాక్టీరియానే ఉదాహరణగా తీసుకుంటే ఇది వయసు పెరిగేకొద్దీ మనకు వచ్చే ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుందని పలు పరిశోధనలు చెబుతున్న విషయాన్ని మెలిస్సా గుర్తు చేస్తున్నారు. వయసుమీరిన ఎలుకలు, కోతుల్లో ఈ బ్యాక్టీరియా జీవక్రియలను ఆరోగ్యకరమైన స్థాయికి పునరుద్ధరించగలిగిందని అంతేకాకుండా ఇన్సులిన్ నిరోధకతను కూడా అడ్డుకుందని తెలిపారు. ఇన్సులిన్ నిరోధకత కేవలం మధుమేహానికి సూచిక మాత్రమే కాదని, ఊబకాయం, వయసుతోపాటు పెరిగే మంట/వాపు, రోగ నిరోధక శక్తిలో తగ్గుదల వంటి సమస్యలకూ కారణమని వివరించారు. ఈ బ్యాక్టీరియా ఎక్కువగా కేన్సర్ రోగులు ఇమ్యూనోథెరపీకి బాగా స్పందిస్తున్నట్లు ఇంకో పరిశోధన చెబుతోందని.. ఈ రకమైన రోగుల నుంచి సేకరించిన బ్యాక్టీరియాను మానవ కేన్సర్లతో కూడిన జంతువుల్లోకి జొప్పించినప్పుడు అవి కూడా మెరుగ్గా స్పందించినట్లు తెలిసిందని మెలిస్సా వివరించారు. -
కడుపులో కాటన్ పెట్టి కుట్టేశారు
-
కడుపులో కాటన్ మరిచిపోయారు..
సాక్షి, కోవూరు: ఆపరేషన్ చేశారు.. పొట్ట లోపల కాటన్ మర్చిపోయారు.. తాపీగా కుట్లు వేశారు.. ఇదీ నెల్లూరు ప్రభుత్వాస్పత్రి వైద్యుల తీరు. వైద్యుల నిర్లక్ష్యంతో ఓ రోగి పడిన అవస్థలు వర్ణనాతీతం. వివరాలు ఇలా ఉన్నాయి. వావిళ్లకు చెందిన ఓ మహిళకు నెల్లూరు ప్రభుత్వాస్పత్రిలో గతంలో గర్భసంచి తొలగించే ఆపరేషన్ చేశారు. ఆ సమయంలో కడుపులోనే ఉండిపోయిన కాటన్‌ను గమనించకుండా వైద్యులు కుట్లు వేశారు. ఆమెకు కొద్దిరోజులుగా కడుపు నొప్పి తీవ్రంగా వస్తుండడంతో కోవూరు ఆస్పత్రిలో చేరింది. అక్కడి వైద్యులు మళ్లీ ఆపరేషన్ చేసి ఆమె కడుపులోంచి కాటన్‌ను తొలగించడంతో ప్రస్తుతం కోలుకుంటోంది. -
పుట్టిన రోజే బాలిక అనుమానాస్పద మృతి
పెనమలూరు పెనమలూరు గ్రామంలో ఓ బాలిక శనివారం పుట్టినరోజునాడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పెనమలూరు జెండా చెట్టు సెంటర్‌కు చెందిన జానీ కుమార్తె మెహరున్నీసాబేగం (16) మొదటి ఏడాది ఇంటర్ విజయవాడలో కార్పొరేట్ కాలేజీలో చదువుతోంది. ఆమె తల్లిదండ్రులు పోలీసులకు తెలిపిన సమాచారం ప్రకారం ఆమె గత కొద్ది రోజులుగా కడుపునొప్పితో బాధపడుతోంది. ఆమె శనివారం కాలేజీకి బయలుదేరి తిరిగి ఇంటికి వచ్చింది. అయితే ఆమె పుట్టిన రోజు కూడా కావటంతో తల్లి, సోదరుడు బ్యాంకులో సొమ్ము డ్రా చేయటానికి బయటికి వెళ్లారు. తండ్రి కూడా తాపీపనికి వెళ్లాడు. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆమె ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయింది. ఈ ఘటన పై పోలీసులకు ఫిర్యాదు అందటంతో కేసు నమోదు చేశారు. -
కడుపు నొప్పి భరించలేక మహిళ ఆత్మహత్య
పాలేరు(ఖమ్మం): కడుపు నొప్పి భరించలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ఖమ్మం జిల్లా పాలేరు మండలం ఆరెంపుల గ్రామంలో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన గుదిమల్ల రామనర్సమ్మ(54) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నది. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా అనారోగ్య కారణాలతో బాధపడుతోంది. దీంతో ఈ రోజు గ్రామ శివారులోని మామిడితోటలో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందిచారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.