
పుట్టిన రోజే బాలిక అనుమానాస్పద మృతి
పెనమలూరు పెనమలూరు గ్రామంలో ఓ బాలిక శనివారం పుట్టినరోజునాడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పెనమలూరు జెండా చెట్టు సెంటర్‌కు చెందిన జానీ కుమార్తె మెహరున్నీసాబేగం (16) మొదటి ఏడాది ఇంటర్ విజయవాడలో కార్పొరేట్ కాలేజీలో చదువుతోంది. ఆమె తల్లిదండ్రులు పోలీసులకు తెలిపిన సమాచారం ప్రకారం ఆమె గత కొద్ది రోజులుగా కడుపునొప్పితో బాధపడుతోంది. ఆమె శనివారం కాలేజీకి బయలుదేరి తిరిగి ఇంటికి వచ్చింది. అయితే ఆమె పుట్టిన రోజు కూడా కావటంతో తల్లి, సోదరుడు బ్యాంకులో సొమ్ము డ్రా చేయటానికి బయటికి వెళ్లారు. తండ్రి కూడా తాపీపనికి వెళ్లాడు. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆమె ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయింది. ఈ ఘటన పై పోలీసులకు ఫిర్యాదు అందటంతో కేసు నమోదు చేశారు.