ఆరెస్సెస్ ప్రధాన కార్యదర్శిగా మళ్లీ జోషీ
నాగ్‌పూర్: ఆరెస్సెస్ ప్రధాన కార్యదర్శిగా సురేశ్ భయ్యాజీ జోషీ (67) మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వృద్ధాప్యం వల్ల జోషీ ఈసారి బరిలో ఉండరని, ఆయన స్థానంలో ప్రధాని మోదీకి సన్నిహితుడిగా పేరున్న దత్తాత్రేయ హొసబలే(ఆరెస్సెస్ సంయుక్త ప్రధాన కార్యదర్శి)ను ఎన్నుకుంటారన్న ఊహాగానాలకు దీంతో తెరపడింది. వరుసగా మూడోసారి ఎన్నికైన జోషీ 2018 మార్చి వరకు పదవిలో కొనసాగుతారని సంఘ్ నేత నంద్ కుమార్ వెల్లడించారు. సంఘ్‌లో విధాన నిర్ణయాలు తీసుకునే అఖిల భారత ప్రతినిధి సభ సమావేశంలో 1,400 మంది ప్రతినిధులు జోషీని ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నట్లు చెప్పారు.