disease details
-
ఒక్క రక్త పరీక్ష : రానున్న పదేళ్లలో మన మరణం గుట్టు! కొత్త పరిశోధన
ఎన్నాళ్లు బతుకుతాం? ఎపుడు చచ్చిపోతాం? ఎలాంటి జబ్బులొస్తాయి? సాధారణంగా ఇలాంటి సందేహాలు ఎపుడో ఒకపుడు అందరికీ వస్తాయి. అందులోనూ ఏ కాస్త అనారోగ్యం బారిన పడినా ఇలాంటి అనుమానాలు పట్టిపీడిస్తాయి. ఇలాంటి ప్రశ్నలు ఇప్పటిదాకా మిలియన్ డాలర్ల ప్రశ్నలు. మరిపుడు ఒక సాధారణ రక్త పరీక్ష ద్వారా, ఒక వ్యక్తికి కేన్సర్ లేదా మతిమరపు వంటి ప్రధాన వ్యాధుల ప్రమాదాన్ని అంచనా వేయవచ్చని, ఏ అవయవాలు ఎలాంటి స్థితిలో ఉన్నాయో, గుర్తించవచ్చని ఒక కొత్త అధ్యయనం కనుగొంది. రానున్న పదేళ్లలో ఎలాంటి జబ్బులు రాబోతున్నాయో కూడా తెలుస్తుందట. ఏంటి నమ్మలేకపోతున్నారా? అయితే మీరీ కథనం సాంతం చదవాల్సిందే.యూనివర్సిటీ కాలేజ్ లండన్ (UCL) పరిశోధకులు, ప్రారంభంలో ఆరోగ్యంగా ఉన్న వ్యక్తుల్లో రానున్న 20 ఏళ్లలో అవయవాలు దెబ్బతినే తీరును, 30 వేర్వేరు వ్యాధుల ప్రమాదాన్ని గుర్తించ గలిగారు కేవలం ఒక రక్తపరీక్ష ద్వారా. ఈ పరీక్ష ద్వారా నిర్దిష్ట అవయవాలకు సంబంధించిన భవిష్యత్తు సమస్యలను మాత్రమే కాకుండా, అవి శరీరంలోని మరొక భాగంలో సమస్యలను ఎలా సృష్టిస్తాయో కూడా తెలుసుకోవచ్చుస్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, హెల్సింకి యూనివర్సిటీ నిపుణులతో,యూసీఎల్ పరిశోధనా బృందం, బ్రిటిష్ వైట్హాల్ II అధ్యయనంలో పాల్గొన్న 45 నుంచి 69 సంవత్సరాల వయస్సు గల 6,235 మంది వ్యక్తుల రక్త ప్లాస్మా నమూనాలను సేకరించి వాటిపై పరిశోధన జరిపారు. తొమ్మిది అవయవాల (గుండె, రక్త నాళాలు, కాలేయం, రోగనిరోధక వ్యవస్థ, క్లోమం, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, పేగులు మెదడు) మొత్తం శరీరానికి సంబంధించిన జీవసంబంధమైన వయస్సును నిర్ణయించడానికి పరిశోధకులు పనిచేశారు.తాజా పరిశోధనల ప్రకారం ఒక్క రక్త పరీక్షతో మనిషిలోని అవయవాలు ఎలా పనిచేస్తున్నాయి; ఎంత వేగంగా వాటి వయసు పెరుగుతోంది అనే విషయాలను అంచనా వేయడం ద్వారా రానున్న పదేళ్ల కాలంలో ఆ వ్యక్తి ఎలాంటి రోగాలకు గురి అవుతాడు, ఏ అవయవం దెబ్బతినడం కారణంగా మరణిస్తాడనే విషయాన్ని తెలుసుకోవచ్చు. చదవండి: ఓవర్ ఆయిల్ వద్దన్నమోదీ : ఎవరెంత వాడాలో తెలుసా?Shivaratri 2025 : శివరాత్రికి, చిలగడ దుంపకి ఉన్న సంబంధం ఏమిటి?ఉదాహరణకు గుండె వయసు వేగంగా పెరిగినవారిలో గుండె జబ్బుల ప్రమాదం, ఊపిరితిత్తుల వృద్ధాప్యం ఉన్న వ్యక్తులు తరువాతి కాలంలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, దీర్ఘకాలిక అబ్స్ట్రక్టివ్ పల్మనరీ వ్యాధి (COPD) , ఊపిరితిత్తుల కేన్సర్‌తో బాధపడే అవకాశం ఉందని అంచనా వేసింది. అంతేకాదు ఒక మనిషికి ఈ ప్రత్యేకమైన బ్లడ్ టెస్ట్ ద్వారా, అతని శరీరంలోని గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, రక్తనాళాలు, మెదడు, మూత్ర పిండాలు లాంటి ముఖ్యమైన భాగాల ఏజింగ్ ప్రాసెస్‌ను అంచనా వేయవచ్చు. మధ్య వయసులో మెదడు వయసు పెరుగుతున్నవారితో పోలిస్తే రోగనిరోధక వ్యవస్థ సాధారణం కంటే వేగంగా వృద్ధాప్యం చెందుతున్న వారిలో చిత్తవైకల్యం (dementia) ప్రమాదం ఎక్కువ అని కనుగొన్నారు. తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు గురయ్యే వ్యక్తుల్లో ఈవ ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు చెప్పారు.అలాగే మూత్రపిండాల ఆరోగ్యం ఇతర అవయవాలతో ముడిపడి ఉందని కూడా గుర్తించారు. మూత్రపిండాల వృద్ధాప్యం వేగవంతం అయిన వ్యక్తులు తరువాతి కాలంలో వాస్కులర్ వ్యాధి, టైప్ 2 డయాబెటిస్ ,కాలేయ వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. దాదాపు అన్ని అవయవాల జీవసంబంధమైన వృద్ధాప్యం మూత్రపిండాల వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుందని అంచనా వేసింది. వ్యక్తికి వయసుకు తగ్గట్టే అవయవాల వయసు ఉండాలి. కానీ జీవనశైలి, తినే ఆహారం, కాలుష్యం, శారీర శ్రమలేని కారణంగా అవయవాల వయస్సు మనిషి వయసుకు మించి శరీరంలోని అవయవాల వయస్సు త్వరగా పెరుగుతోందని తేల్చారు. యూసీఎల్ పరిశోధన ఫలితాలు లాన్సెట్ డిజిటల్ హెల్త్ జర్నల్‌లో ప్రచురించారు. న్యూరోడీజెనరేటివ్ వ్యాధుల అభివృద్ధిలో శోథ ప్రక్రియలు కీలక పాత్ర పోషిస్తాయని ఈ పరిశోధన మరింత సూచిస్తుందని యూసీఎల్ ఫ్యాకల్టీ ఆఫ్ బ్రెయిన్ సైన్సెస్ ప్రొఫెసర్ మికా కివిమాకి చెప్పారు. “మన అవయవాలు ఒక సమగ్ర వ్యవస్థగా పనిచేస్తాయి, కానీ అవి వేర్వేరు రేట్ల వద్ద వృద్ధాప్యం చెందుతాయి.ముఖ్యంగా అవయవాలలో వృద్ధాప్యం అనేక వృద్ధాప్య సంబంధిత వ్యాధులకు దోహదం చేస్తుంది, కాబట్టి అన్ని అంశాలను జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఒక నిర్దిష్ట అవయవం ఊహించిన దానికంటే వేగంగా వృద్ధాప్యం చెందుతుందో లేదో సులభంగా రక్త పరీక్ష ద్వారా గుర్తించవచ్చని మేం కనుగొన్నాం. రాబోయే సంవత్సరాల్లో, “ఆరోగ్య సంరక్షణ యస్సు సంబంధిత వ్యాధుల నివారణ చాలా ముందుగానే ప్రారంభమవుతుందని నేను నమ్ముతున్నాను. ఇలాంటి రక్త పరీక్షలు అనేక వ్యాధులను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.” అని ఆయన అన్నారు. -
టంగ్ కంగు తినడానికి కాదు!
ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు కదా. అలాగే టంగ్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ హెల్త్ అనుకోవచ్చు. అంటే... నాలుక అన్నది ఆరోగ్యానికి మంచి సూచిక అని అర్థం. అందుకే డాక్టర్ల దగ్గరికి వెళ్లగానే నాలుక చూపించమని అడుగుతుంటారు. దాన్నిచూసిన వెంటనే డాక్టర్లకు బాధితుల ఆరోగ్య విషయాలు ఎన్నో తెలుస్తుంటాయి. తల్లో నాలుకల వ్యవహరిస్తూ అనేక నములు తున్నప్పుడు రుచి తెలియజేయడం, పంటి కిందికి ఆహారాన్ని తోయడం వంటి అనేక పనులు చేసే నాలుక గురించి మాత్రం మనందరిలోనూ పెద్దగా తెలుసుకున్న దాఖలాలు ఉండవు. నాలుక చేసే కీలకమైన పనులు, దానికి వచ్చే కొన్ని సమస్యలపై అవగాహన కోసం ఈ కథనం.సాధారణంగా నాలుక పింక్ రంగులో ఉంటే అది ఆరోగ్యానికి ఓ మంచి సూచన. ఒకవేళ అలా లేదంటే అది ఏదైనా అనారోగ్యానికి సూచన కావచ్చు. అందుకే డాక్టర్ల దగ్గరికి వెళ్లినప్పుడు వారు నాలుక చూపించమంటారు. అలా వ్యక్తుల ఆరోగ్యాన్ని గురించి తెలుసుకుంటారు.నాలుక కింది భాగం ఓ కండరంతో నోటిలోని కింది భాగానికి అతుక్కుపోయి... బయటకు అది చాలా చిన్నగా కనిపించినప్పటికీ, దాదాపు పది సెంటీమీటర్ల పొడవుంటుంది. దాదాపు 60 గ్రాముల బరువుంటుంది.జీర్ణ ప్రక్రియలో తొలి అంకం నాలుక దగ్గర్నుంచే... ఆహారాన్ని జీర్ణం చేసే పనిలో నాలుక భూమిక ఎంతో కీలకం. ఆహారాన్ని పళ్ల కిందికి తోసేందుకు మనమంతా మనకు తెలియకుండానే నాలుకను వాడుతుంటాం. అలా మనం తీసుకున్న ఆహారం చిన్న చిన్న ముక్కలుగా (పార్టికిల్స్గా) మారేందుకు ఉపయోగ పడుతుంది. అంటే ఆహారం జీర్ణం కావడంలో తొలి అంకం ఇక్కణ్ణుంచే మొదలవుతుంది. ఆ తర్వాత మింగడం అనే ప్రక్రియ కూడా కేవలం నాలుక వల్లనే సాధ్యమవుతుంది. నాలుక వెనుక భాగం నమిలిన ఆహారాన్ని గొంతు ద్వారా కడుపులోకి నెడుతుంది. నాలుక దిగువన ఉండే చిన్న తీగ వంటి భాగంతోనే అది నోటి అడుగుభాగానికి అతుక్కు΄ోయి ఉంటుంది. ఈ తీగ పొడవు ఉండాల్సిన దాని కంటే బాగా తక్కువగా ఉంటే, మాట్లాడటంలో సమస్యలు వస్తాయి. నత్తి వంటి చాలా ఇబ్బందులు వస్తాయి. ఒకప్పుడు ఈ తరహా ఇబ్బందులకు పరిష్కారం అంతగా ఉండేది కాదు గానీ... ఇప్పుడు ఇలాంటి సమస్యను శస్త్రచికిత్సతో సరిచేసి, సరిగా మాట్లాడేలా చేసే అవకాశముంది.రుచితోనూ ఆరోగ్యం గురించి... అనారోగ్యం కలిగిన కొన్నిసార్లు రుచి తెలియదు. ఉదాహరణకు తీవ్రమైన జ్వరం వచ్చిన సందర్భాల్లోనూ, అలాగే జలుబు చేసినప్పుడు ముక్కుకు వాసనలూ, నాలుకకు రుచులూ తెలియని పరిస్థితి వస్తుంది. తాజాగా కరోనా వైరస్ సోకినప్పుడు కూడా ఇదే ప్రక్రియ వల్ల బాధితులకు రుచి తెలియకుండా΄ోయి, తమకు కరోనా వచ్చిన సంగతి తెలిసింది.నాలుకకు వచ్చే కొన్ని అనారోగ్యాలు... అన్ని అవయవాల లాగే నాలుకకూ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలుంటాయి. నాలుకకు వచ్చే ఇన్ఫెక్షన్ను గ్లాసైటిస్ అంటారు. కొన్ని యాంటీబయాటిక్స్ ఉపయోగించడం ద్వారా ఇన్ఫెక్షన్ను తేలిగ్గా తగ్గించవచ్చు. ఐరన్‌లోపంతో వచ్చే రక్తహీనత (అనీమియా) ఉన్నవారిలో నాలుక ఆరోగ్యకరమైన పింక్ రంగుకు బదులుగా ఎర్రగా ఉండి, ముట్టుకుంటే బాధకలిగించే టెండర్‌గా మారుతుంది పచ్చకామెర్లు (జాండీస్) సోకినవారిలో పసుపురంగులోకి మారి కనిపిస్తుంటుంది.కొన్ని ఫంగస్‌లు సోకినప్పుడు నాలుకపై నల్లని మచ్చలు కనిపిస్తాయి. యాంటీఫంగల్ మందులు వాడటం ద్వారా దీన్ని తేలిగ్గా అధిగమించవచ్చు జింక్ లోపం వల్ల తలెత్తే ‘డిస్గ్యూసియా’ అనే సమస్య వచ్చిన వారిలో చక్కెర చేదుగానూ, చాక్లెట్ ఉప్పగానూ అనిపించవచ్చు. సాధారణంగా ఫ్లూ వంటి వ్యాధులు సోకిన తర్వాత ఇలాంటి పరిస్థితి తలెత్తుతూ ఉంటుంది. జింక్ పుష్కలంగా ఉండే పోషకాహారం తీసుకుంటే, కొద్ది రోజుల్లోనే నాలుక మళ్లీ సాధారణ స్థితికి వచ్చేస్తుంది అరుదుగా వచ్చే ‘హై΄ోగ్యూసియా’ అనే సమస్యలో నాలుక రుచులను గుర్తించే సామర్థ్యాన్ని దాదాపుగా కోల్పోతుంది. వారు ఏది తిన్నా రుచీపచీ ఉండదు విటమిన్ (చాలావరకు విటమిన్ బి కాంప్లెక్స్) లోపాల వల్ల నాలుక పగుళ్లుబారినట్లు అనిపించడం, నాలుక మీద పొక్కులు రావడం మామూలే. సాధారణంగా ‘బి–కాంప్లెక్స్’ మందులతో ఈ సమస్యను తేలిగ్గా అధిగమించవచ్చు పొగతాగేవారిలో నాలుక మీద ఉండే రుచిమొగ్గలు తమ సామర్థ్యాన్ని కోల్పోతాయి. అందుకే పొగతాగేవారికి రుచులు అంత స్పష్టంగా తెలియవు. అంతేకాదు... పొగతాగడం వల్ల హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లతో పాటు నాలుక క్యాన్సర్ కూడా రావచ్చు. ఇది ప్రమాదకరమైన పరిణామం అందుకే పొగతాగడం, ఆల్కహాల్ వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. -
సమంతకు సోకిన మయోసైటిస్ అంటే ఏంటి? లక్షణాలు ఎలా ఉంటాయంటే..
వాటర్ బాటిల్ మొదలు బకెట్ నీటిని ఎత్తడానికి పడే కష్టం. ఒక చెయిర్‌ను అటు ఇటు జరపడానికి పడే ఇబ్బంది.. సాధారణంగా వయసు మీద పడిన సమయంలో ఇలాంటివి తప్పదు. అయితే ఇలాంటి బలహీనతలే మధ్యవయస్కులో.. అదీ ప్రతీరోజూ కనిపించిందంటే.. అది ‘మమోసైటిస్’ లక్షణంగా భావించాల్సి ఉంటుంది. నటి సమంతకు మయోసైటిస్ సోకిందనే వార్త.. ఆమె ఫ్యాన్స్‌తో పాటు తారాలోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. లక్షలో.. నలుగురి నుంచి 20 మంది దాకా.. సోకే ఈ అరుదైన వ్యాధి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్.. ‘మయోసైటిస్’. అరుదైన వ్యాధి మాత్రమే కాదు.. నొప్పులు, అలసటతో పేషెంట్‌కు నరకం చూపిస్తుంటుంది. ఈ వ్యాధిలో మొత్తం ఐదు రకాలు ఉన్నాయి. పాలిమయోసైటిస్: చిన్న చిన్న పనులకే నీరసపడిపోతారు. కండరాలు భరించలేనంత నొప్పిపెడతాయి. కొంతదూరం నడిచినా త్వరగా అలసిపోతారు. ఒక్కోసారి అదుపు తప్పి కిందపడిపోతారు. డెర్మటోమయోసైటిస్: కండరాలపై ప్రభావం పడుతుంది. చర్మంపై దద్దుర్లు వస్తాయి. అతినీలాలోహిత కిరణాల ప్రభావం వల్ల ఈ రకమైన స్థితి నెలకొంటుందనే వాదన కూడా ఒకటి ఉంది. మహిళలు, చిన్నారుల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. నెక్రోటైజింగ్ మయోపతి: శరీర మధ్యస్థ భాగాల్లో కండరాలపై ఎక్కువ ప్రభావం చూపెడుతుంది. మోచేతులు, తొడలు, నడుము, భుజాలు, మెడ, వెనుక భాగంలో బలహీనత కారణంగా నొప్పి ఉంటుంది. ఇన్‌క్లూజన్ బాడీ మయోసైటిస్: నీరసం, తొడ, ముంజేతి, మోకాలి కింద కండరాలు పట్టేసి, నొప్పిగా అనిపిస్తాయి. ఐదు పదుల వయసు దాటిన వారిలో ఇలాంటి లక్షణాలు సాధారణంగా కనిపిస్తాయి. జువెనైల్ ఫామ్స్ ఆఫ్ మయోసైటిస్: పిల్లల్లో, యుక్తవయసు ఉన్నవాళ్లలో ప్రభావం చూపెడుతుంది. చాలా కష్టం! మయోసిటిస్ స్థితిని నిర్ధారించడం.. చికిత్స అందించడం కొంచెం కష్టం. నయం కాని వ్యాధిగా దీనికంటూ ఓ పేరుంది. అలాగే దీనికంటూ ప్రత్యేకమైన చికిత్సా విధానం లేదు కూడా!. కానీ, సరైన మందులు, పద్ధతిగా థెరపీలతో వ్యాధి నుంచి ఉపశమనం పొందొచ్చు. ప్రత్యేకించి మయోసైటిస్ రకాల్లో.. ఇన్‌క్లూజన్ బాడీ మయోసైటిస్కు మాత్రం ఎలాంటి చికిత్స విధానం లేదు!. మయోసైటిస్ లక్షణాలు.. మయోసైటిస్.. ఒక్కొక్కరిలో ఒక్కోలా ప్రబావం చూపెడుతుంది. కండరాల బలహీనత, నొప్పులు, విపరీతమైన అలసట.. కామన్ లక్షణాలుగా కనిపిస్తుంటాయి. అయితే ఒక్కోరకం మయోసైటిస్‌లో బలహీన స్థితి ఒక్కోలా, ఇంకొన్ని అదనపు లక్షణాలు సైతం కనిపించొచ్చు. ఉదాహరణకు.. డెర్మటోమయోసైటిస్లో ముఖం, ఛాతీ భాగం, భుజాలు, మెడ వెనుక భాగంపై మచ్చల దద్దుర్లు వస్తాయి.. అవి నొప్పిని కలిగిస్తాయి కూడా. మయోసైటిస్ వ్యాధి ఎందుకు వస్తుందనే దానికి సరైన కారణాలను ఇంతవరకు పరిశోధకులు గుర్తించలేకపోయారు. అయితే.. కొందరిలో మాత్రం జన్యుసంక్రమణగా ఈ వ్యాధి సొకవచ్చనే అంచనాకి మాత్రం వచ్చారు. మహిళలో 30 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్కులు ఎక్కువగా మయోసైటిస్ బారిన పడుతున్నట్లు పలు యూనివర్సిటీలు నిర్వహిస్తున్న సర్వేలు వెల్లడించాయి. కండరాల బలహీనత, అలసట, దద్దుర్లు ఆధారంగా ఆ స్థితిని మయోసైటిస్ అనుకోవడానికి వీల్లేదు. అత్యంత అరుదైన ఈ స్థితిని గుర్తించేందుకు ప్రత్యేక పరీక్షలు కూడా నిర్వహిస్తుంటారు. రుమటాలజిస్టులు, న్యూరాలజిస్టులు, డెర్మాటోమయోసైటిస్ స్థితిలో డెర్మటాలజిస్టులను సంప్రదించడం ద్వారా ఈ వ్యాధి స్థితిపై ఒక అంచానికి రావొచ్చు. -
గ్రహణ మొర్రి ఎలా వస్తుందో తెలుసా?
గర్భవతులు గ్రహణం సవుయంలో బయట తిరగడం వల్ల బిడ్డకు ఎలాంటి వైకల్యమూ రాదు. అది బిడ్డ పిండ దశలో ఉండగానే ఏర్పడే ఓ అవకరం. బిడ్డ పెదవులూ, కొన్నిసార్లు అంగిలి చీరుకుపోయినట్లుగా ఉండేదే ‘గ్రహణం మొర్రి’. దాదాపు ప్రతి 1000 జననాల్లో ఒకరికి ఇలా గ్రహణం మెుర్రి రావడం మామూలే. పిండం ఎదిగే సవుయంలో దాదాపు ఆరు నుంచి పది వారాలప్పుడు (రెండో నెల సవుయంలో) బిడ్డలో తల భాగం రూపొందుతుంది. ఈ సవుయంలో ఒక్కోసారి బిడ్డలోని రెండు పెదవులు, అంగిలి కలవవు. అలాంటప్పుడు బిడ్డలో ఈ గ్రహణం మెుర్రి ఏర్పడుతుంది. అయితే... శస్త్రచికిత్స ప్రక్రియలు బాగా అడ్వాన్స్ అయిన ప్రస్తుత సవుయంలో ఇప్పుడిది సవుస్యే కాదు. శస్త్రచికిత్స ద్వారా ఈ గ్రహణం మెుర్రి సవుస్యను సమర్థంగా చక్కదిద్దవచ్చు. అయితే ఎంత చిన్నవయసులో ఈ శస్త్రచికిత్స చేస్తే ఫలితాలు కూడా అంత బాగుంటాయి. గర్భం ధరించి ఉన్నప్పుడు గ్రహణం సంభవిస్తే అసలు దాని గురించి ఎలాంటి ఆందోళనా పడాల్సిన అవసరమే లేదు. కాబోయే తల్లిదండ్రులు చేయాల్సిందల్లా ఒకటే... వీలైతే ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌కు ముందునుంచీ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్లు క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉండాలి. ఆకుకూరల్లోనూ ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది గ్రహణం మొర్రినీ, న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్‌నూ చాలావరకు నివారిస్తుంది. చదవండి: అధిక బరువు: మృత్యుమార్గంలో పయనించడమే -
బర్డ్‌ఫ్లూపై అప్రమత్తం
- పశుశాఖ ‘అనంత’ ఏడీ శ్రీనాథాచార్ అనంతపురం అగ్రికల్చర్ : ప్రాణాంతక బర్డ్‌ఫ్లూ వ్యాధి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకుంటే ఈ వ్యాధిని సమూలంగా నివారించుకోవచ్చని పశు సంవర్ధకశాఖ అనంతపురం డివిజన్ ఏడీ డాక్టర్ టి.శ్రీనాథాచార్ తెలిపారు. ప్రస్తుతానికి జిల్లాలో ఎక్కడా ఈ వ్యాధి లక్షణాలు లేవన్నారు. అయినప్పటికీ పక్కనున్న కర్నాటక రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ లక్షణాలు కనిపిస్తున్నందున దీనిపై జిల్లావాసులకు అవగాహన కలిగి ఉండటం మేలన్నారు. బర్డ్‌ఫ్లూ (ఏవియన్ ఇన్ఫ్లూయంజా) అనేది కోళ్లలో సంభవించే వైరల్ వ్యాధి. హెచ్5ఎన్1 స్ట్రెయిన్ వైరస్ వల్ల వ్యాపిస్తుంది. కోళ్ల నుంచి మనుషులకు కూడా వ్యాప్తి చెందుతుంది. అలాగే మనుషులలో ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. ఇందులో హెచ్‌పీ అనేది వ్యాధి తీవ్రతను ఎక్కువ చేస్తుంది. ఎల్పీ అనేది తక్కువగా ఉంటుంది. కోళ్లు అకస్మాత్తుగా ఎక్కువ సంఖ్యలో చనిపోవడం, శ్వాసకోశ లక్షణాలతో మరణించడం ఈ వ్యాధి ముఖ్య లక్షణం. వైరస్ ప్రవేశించిన రెండు నుంచి ఎనిమిది రోజుల్లో మనుషులకు సోకుతుంది. అధిక జ్వరం, పొడిదగ్గు, గొంతువాపు, వాంతులు, విరేచనాలు, తలనొప్పి, కీళ్లనొప్పులు, బద్దకంగా ఉండటం, ముక్కు నుంచి ద్రవాలు స్రవించడం, కండ్లకలక, తలతిరగడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. చిన్న పిల్లల్లో ఈ వ్యాధి క్రమంగా న్యూమోనియాకు దారితీస్తుంది. వ్యాధి సోకిన కోళ్లు, కోడిమాంసం, గుడ్లు తదితర వాటి ద్వారా ఇది వ్యాపిస్తుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు వ్యాధి సోకిన కోళ్లు, ఫారాల నుంచి దూరంగా ఉండాలి. వ్యాధి లక్షణాలున్న మాంసం, గుడ్లు తీసుకోకూడదు. బాగా ఉడికిన మాంసం, ఉడికిన గుడ్లు మాత్రమే తినాలి. పైపైన ఉడికించే చికెన్ ఐటెమ్స్, హాఫ్బాయిల్ గుడ్లు తినకూడదు. అవసరమైన ప్రాంతాల్లో ఈ మాస్కులు ధరించాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధికి దూరంగా ఉండవచ్చు. కోళ్లలో అసాధారణ మరణాలు ఉన్నట్లు గమనిస్తే వెంటనే పశువైద్యాధికారికి సమాచారం ఇవ్వాలి. కోళ్లను ముట్టుకున్నపుడు చేతులు, కాళ్లు శుభ్రం చేసుకోవాలి. కోళ్ల ఫారాల్లో సమగ్ర వ్యాధి నివారణ చర్యలు చేపట్టాలి. ఇతరుల ప్రవేశాన్ని నిరోధించాలి. చనిపోయిన కోళ్లను, వాటి వ్యర్థాలను సమూలంగా నాశనం చేయాలి. అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజలకు నివారణ చర్యలు తెలియజేయాలి. ఈ విధమైన చర్యలు తీసుకుంటే ఈ వ్యాధిని నివారించవచ్చు. యాంటీవైరల్ మందులు ఒసెల్టామివిÆŠ, జానామివిర్ వంటివి ఈ వ్యాధికి సమర్థవంతంగా పని చేస్తాయి. నివారణ చర్యలు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో బర్డ్‌ఫ్లూ వ్యాధి నివారణకు హెచ్ - 5 ఎన్ - 1 రకం టీకాలను ఆమోదించారు. కానీ వీటిని వాడేందుకు కోళ్ల పెంపకందారులకు అనుమతి లేదు. ఏదేని అంటువ్యాధి ప్రబలిన ప్రాంతంలో కేవలం ప్రభుత్వ అనుమతితో మాత్రమే వాడుతున్నారు. వ్యాధి వ్యాపించకుండా పశుసంవర్ధక శాఖ చెక్‌పోస్టుల ద్వారా నివారణ చర్యలు చేపడుతోంది. కోళ్ల ఫారాల్లో సమగ్ర తనిఖీలు నిర్వహించడం, రాపిడ్ యాక్షన్ బృందాలు ఏర్పాటు చేసి నాటుకోళ్లు, వసల పక్షుల నుంచి నమూనాలు సేకరించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయడం, సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం వంటివి తరచూ చేస్తుంటే ఈ వ్యాధిని సమూలంగా అరికట్టవచ్చు.