గర్భవతులు గ్రహణం సవుయంలో బయట తిరగడం వల్ల బిడ్డకు ఎలాంటి వైకల్యమూ రాదు. అది బిడ్డ పిండ దశలో ఉండగానే ఏర్పడే ఓ అవకరం. బిడ్డ పెదవులూ, కొన్నిసార్లు అంగిలి చీరుకుపోయినట్లుగా ఉండేదే ‘గ్రహణం మొర్రి’. దాదాపు ప్రతి 1000 జననాల్లో ఒకరికి ఇలా గ్రహణం మెుర్రి రావడం మామూలే. పిండం ఎదిగే సవుయంలో దాదాపు ఆరు నుంచి పది వారాలప్పుడు (రెండో నెల సవుయంలో) బిడ్డలో తల భాగం రూపొందుతుంది. ఈ సవుయంలో ఒక్కోసారి బిడ్డలోని రెండు పెదవులు, అంగిలి కలవవు. అలాంటప్పుడు బిడ్డలో ఈ గ్రహణం మెుర్రి ఏర్పడుతుంది. అయితే... శస్త్రచికిత్స ప్రక్రియలు బాగా అడ్వాన్స్ అయిన ప్రస్తుత సవుయంలో ఇప్పుడిది సవుస్యే కాదు.
శస్త్రచికిత్స ద్వారా ఈ గ్రహణం మెుర్రి సవుస్యను సమర్థంగా చక్కదిద్దవచ్చు. అయితే ఎంత చిన్నవయసులో ఈ శస్త్రచికిత్స చేస్తే ఫలితాలు కూడా అంత బాగుంటాయి. గర్భం ధరించి ఉన్నప్పుడు గ్రహణం సంభవిస్తే అసలు దాని గురించి ఎలాంటి ఆందోళనా పడాల్సిన అవసరమే లేదు. కాబోయే తల్లిదండ్రులు చేయాల్సిందల్లా ఒకటే... వీలైతే ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌కు ముందునుంచీ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్లు క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉండాలి. ఆకుకూరల్లోనూ ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది గ్రహణం మొర్రినీ, న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్‌నూ చాలావరకు నివారిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment