
హైదరాబాద్: నైరుతి రుతుపవనాల నేపథ్యంతో.. ఉత్తర తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, జగిత్యాల జిల్లాల్లో నేడు అతిభారీ వర్షం కురిసే అవకాశం ఉందని.. వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
ఇప్పటికే ఆయా జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తుండగా.. మంగళవారం సుమారు 20 సెంటీ మీటర్ల వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment