సంగారెడ్డి మున్సిపాలిటీ: రుతుపవనాలరాక ఆలస్యం కావడం, వరుణుడి జాడ లేకపోవడంతో ఎన్నో ఆశలతో సాగుకు భూములను సిద్ధం చేసిన రైతుల్లో కొంత ఆందోళన నెలకొందని, అయితే ఎలాంటి ఆందోళన చెందొద్దని జిల్లా వ్యవసాయాధికారి నసింహరావు అన్నారు. విత్తుకునే అదను దాటలేదన్నారు. ప్రస్తుతం సన్నాలు, మధ్యకాలిక, స్వల్పకాలిక వంగడాలు ఎంచుకోవాలి. వ్యవసాయాధికారుల సలహాలు, సూచనలు పాటించాలని, వీలైనంత వరకు పంట మార్పిడి చేయాలని అప్పుడే అధిక దిగుబడి సాధించవచ్చన్నారు. విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు పాటించాలని, 70 నుంచి 110 మి.మీ. వర్షం పడితేనే విత్తనాలు విత్తుకునేందుకు అనువుగా ఉంటాయన్నారు.
బుధవారం ఉదయం 11 నుంచి 12 గంటల వరకు సాక్షి ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్‌కు రైతుల నుంచి విశేష స్పందన లభించింది. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ముఖ్యంగా జాన్ 15 వరకే బీపీటీ సోనా రకం వరి సాగుకు నారుపోసుకోవాలన్నారు. ఆ తర్వాత పోసుకుంటే వాటికి తెగుళ్లు ఆశిస్తాయని తెలిపారు. సన్నరకం ధాన్యం ఆర్– ఎన్‌ఆర్ కేఎస్‌ఎం, దొడ్డు రకం 1010ని జూలై 15 వరకు నారు పోసుకోవాలి. అన్ని రకాల నేలలు వరి సాగుకు అనుకూలమని రైతులకు భరోసా ఇచ్చారు. రైతుల సందేహాలను నివృత్తి చేశారు.
రైతు: నరసయ్య, అంత్వార్ (నారాయణఖేడ్) మూడు ఎకరాల పత్తి వేసాము. దానికి ఎలాంటి మందు వేయాలి.
జేడీఏ: ఇప్పుడు డీఏపీ, కాంప్లెక్స్ వేయొచ్చు.
రైతు: నవాజ్ రెడ్డి, చక్రియాల్ (చౌటకూర్) జిలుగు, జనుము రాలేదు సార్. ఆలస్యం అయ్యాయి. పంటకు ఇబ్బంది అవుతుంది.
జేడీఏ: అవును. జిలుగు జనుము ఆలస్యమయ్యాయి. మీ దగ్గరలోగల మండలం నుంచి తెచ్చుకోవచ్చు.
రైతు: శ్రీనివాస్. పుల్కల్ (పుల్కల్) మూడు ఎకరాల పత్తి మొలక వచ్చింది. ఇంకా మూడు ఎకరాలు ఉంది. ఏ పంటకు అనుకూలం సార్ ఇప్పుడు.
జేడీఏ: జులై 10 వరకు పత్తి పంట వేసుకోవాలి. అది దాటితే ఇతర పంటలు వేసుకోవాలి.
రైతు: విఠల్, జూకల్ (నారాయణఖేడ్) 25 గుంటల భూమి మూడు నెలల క్రితం నా పేరుపై పట్టా చేసుకున్నా. ఏఈఓ దగ్గర చూసుకుంటే డబ్బులు పడలేదు సార్.
జేడీఏ: మీరు చేయించుకుని మూడు నెలలు మాత్రమే అయ్యింది. కొంచెం ఆలస్యం అవుతుంది.
రైతు: నరసింహారెడ్డి, సత్వర్ (జహీరాబాద్) జనుము విత్తనాలు ఇంకా అందుబాటులోకి రాలేదు సార్.
జేడీఏ: జహీరాబాద్ డీసీఎంఎస్ ఆఫీసులో వచ్చాయి తీసుకోండి.
రైతు: నరేందర్, వెంకటాపూర్ (సదాశివపేట) సబ్సిడీపై ఎలాంటి ధాన్యాలు ఉన్నాయి సార్.
జేడీఏ: కంది, సోయాబీన్ ఉన్నాయి. మిగతావి సబ్సిడీపై డీలర్లను అడిగి తెలుసుకోవాలి. అంతర పంటలు వేస్తే మంచిది.
రైతు: రాజ్ కుమార్ దేశ్‌పాండే, మానియర్ పల్లి (కోహిర్) జిలుగు, జనుము తొందరగా రాకపోవడం కారణంగా ఆలస్యంగా విత్తనాలు వేశాము. మొక్కలు లేటుగా మొలుస్తున్నాయి.
జేడీఏ: వర్షాలు లేని కారణంగా లేటుగా మొలుస్తున్నాయి. ఆందోళన చేందొద్దు.
Comments
Please login to add a commentAdd a comment