నీటివసతి ఉంటేనే...
వానాకాలంలో వరిసాగును ముందుకు జరపాలంటే నీటివసతి తప్పనిసరి. బోరు,బావుల కింద సేద్యం చేసేచోట సాగునీటికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ పంటసాగు కాలం ముందుకు జరిపినా ముందుగానే రైతులు బోరు,బావుల ద్వారా నార్లు పోసుకుంటారు. ప్రాజెక్టులు, కాల్వలు, లిఫ్ట్ ఇరిగేషన్, చెరువుల ద్వారా వరిసాగు చేసే చోటే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రైతులు నార్లు పోసుకోవాలన్నా, వాటిని పెంచాలన్నా, ఆయా సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో సాగునీటి విడుదల తేదీలను కూడా ముందుకు జరపాలి.
ఇంకా చేయాల్సినవి...
● పంటకాలం ముందుకు జరిపే క్రమంలో రైతులకు సబ్సిడీపై అందజేసే విత్తనాలు కూడా ముందుగానే రైతులు చేరేలా చూడాలి.
● నార్లు పోసే నాటి నుంచి నాట్లు వేసే వరకు అవసరమైన ఎరువులు కూడా ముందుగా అందుబాటులో ఉంచాలి.
● రైతులకు పెట్టుబడి అవసరాలు ఉంటాయి. బ్యాంకుల నుంచి అందే కొత్త రుణాలు, రుణాల రెన్యూవల్, రైతుబంధు కింద ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయం కూడా రైతులకు ముందస్తుగా అందాలి.
● పంటకాలం ముందుకు జరపాలన్న ప్రతిపాదనలు ● రోహిణి కార్తె నుంచి నార్లు పోసుకోవడం పాత పద్ధతే
సాక్షి, సంగారెడ్డి డెస్క్ :
యాసంగిలో కురుస్తున్న అకాల వర్షాలు, వడగండ్ల వానల కారణంగా వరిపంటకు తీవ్రనష్టం వాటిల్లుతోంది. ముఖ్యంగా మార్చి నుంచి మే నెల వరకు కురిసే వర్షాల కారణంగా ధాన్యం దిగుబడి బాగా తగ్గుతోంది. చేతికొచ్చే కొద్దిపాటి పంటలోనూ నాణ్యత లోపిస్తోంది. యాసంగిలో వరిసాగుచేసే రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వరిసాగుకు సంబంధించి పంటకాలాన్ని ముందుకు జరపాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో అకాల వర్షాల నుంచి రైతులు బయటపడొచ్చు. దీనిపై వ్యవసాయశాఖ, వ్యవసాయ శాస్త్రవేత్తలు కసరత్తు చేస్తున్నారు.
● సాధారణంగా అయితే వానాకాలం వరిసాగుకు సంబంధించి జూలైలో నార్లు పోసి ఆగస్టు వరకూ నాట్లు వేస్తారు.
● యాసంగిలో అయితే డిసెంబర్‌లో నార్లు పోసి జనవరి, ఫిబ్రవరి నెలల్లో నాట్లు వేస్తారు. యాసంగిలో సాగు చేసిన వరిపంట మే నెలలో కోతకు వస్తుంది.
● వానాకాలం సీజన్‌లో అయితే అక్టోబర్‌లో, యాసంగి సీజన్‌లో అయితే మార్చి రెండోవారం నుంచి ఏప్రిల్ నెల వరకు అకాలవర్షాలు కురుస్తాయి. దీంతో రైతులకు నష్టం జరుగుతోంది.
● ప్రకృతి వైపరీత్యాల బారిన రైతులు పడకుండా ఉండేందుకు, వరి పంటను కాపాడుకోవడానికి ఒకటే మార్గం ఉంది. అదే పంటసాగును ఒక నెలరోజులు ముందుకు జరపడమే.
● వానకాలంసాగుకు సంబంధించి జూన్‌లో నార్లు పోసుకొని జూలై నాటికి నాట్లు పూర్తి చేయాలి.
● యాసంగిలో అయితే నవంబర్‌లో నార్లు పోసి డిసెంబర్‌లో నాట్లు పూర్తి చేయాలి.
● వానాకాలంలో 140 రోజులు అంతకన్నా ఎక్కువ సమయం గల దీర్ఘకాలిక రకాల సాగుకు మే 25 నుంచి జూన్ 5లోగా నారు పోసుకోవాలి.
● 130 నుంచి 135 రోజుల వ్యవధిగల మధ్యకాలిక రకాల సాగులో జూన్ 15 వరకు నారు పోయాలి.
● 120 నుంచి 125 రోజుల వ్యవధి గల స్వల్పకాలిక రకాల సాగుకు జూన్ 25 వరకు నారు పోసుకోవాలి.
● సాగు చేసేది ఎలాంటి రకాలైనా సరే జూలై నెల వరకు వానాకాలంలో వరినాట్లు పూర్తికావాలి.
● వానాకాలం వరికోత అక్టోబర్ 3వ వారంనుంచి నవంబర్ మొదటివారం లోపు పూర్తి చేయాలి.
● యాసంగిలో నవంబర్ 20వ తేదీలోపు నారు పోసుకోవాలి.
● పంటకాలం ముందుకు జరిపితే వానాకాలం వరికోతలు నవంబర్ మొదటి వారంలోపు పూర్తవుతాయి. అయితే యాసంగి నారు కోసం ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది.
● రైతులు వానాకాలం సాగు సమయంలోనే ముందు జాగ్రత్తగా యాసంగి నారు కోసం ఒక చిన్న మడిని వదిలేసుకుంటే బాగుంటుంది. దీంతో వానాకాలం పంటలు కాస్త ఆలస్యమైనా వదిలేసిన మడిలో యాసంగి కోసం సరైన సమయంలో నారు పోసుకొనే వీలుంటుంది.
ముందు నారు పోస్తే పంటకు బలం
హుస్నాబాద్ మండలం గాంధీనగర్‌కు చెందిన రైతు రాంగోపాల్‌రావు 15 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నాడు. గత ఏడాది వానాకాలంలో వరి సాగు చేయడంతో పాటు యాసంగి మిర్చి సాగు చేస్తే మంచి లాభాలు వచ్చాయి. ఈ వానాకాలం 15 ఎకరాల్లో వరిసాగు చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సందర్భంగా రాంగోపాల్‌రావు మాట్లాడుతూ వ్యవసాయ పంటలు ప్రారంభానికి రోహిణి, ఆరుద్ర కార్తెలే అనుకూలం.
ఈ రెండు కారెల్లో విత్తనం వేస్తే పంట బలంగా వస్తుంది. ఒకేసారి 15 ఎకరాల far వేయాలంటే కూలీల కొరత ఉంది. అందుకే 15 రోజుల గడువు తీసుకొని మూడు దఫాలుగా నారు పోశాను.
యాసంగిలో కురిసిన అకాల వర్షాలు, వడగండ్ల వానల కారణంగా మెదక్ జిల్లాలో 32,884 ఎకరాల్లో, సిద్దిపేట జిల్లాలో 53 వేల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లిందని అధికారులు చెబుతున్నారు. అయితే పూర్తిస్థాయిలో పంటనష్టం నమోదు ఎక్కడా జరగలేదని రైతులు, రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment