న్యూఢిల్లీ: దేశంలో ఈసారి సాధారణం కంటే 4 శాతం అధికంగానే వర్షపాతం నమోదైందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. ఇక దేశంలోని దక్షిణ ప్రాంతం 10 శాతం, మధ్య ప్రాంతంలో 23 శాతం అధిక వర్షపాతం నమోదైందని పేర్కొంది. తూర్పు, ఉత్తర, వాయవ్య ప్రాంతాల్లో –18 శాతం, –8 శాతం లోటు వర్షపాతం నమోదైందని తెలిపింది. అయితే ఇప్పటికీ నైరుతి రుతుపవనాల నిష్క్రమణలో ఎలాంటి మార్పులు లేవని పేర్కొంది. దీంతో ఈ వారం సైతం ఉత్తర మైదాన ప్రాంతాల్లో గాలిలో తేమ శాతం అధికంగా ఉంటుందని తెలిపింది.
రాజస్తాన్, గుజరాత్, పంజాబ్‌లోని కొన్ని ప్రాంతాల నుంచి సాధారణంగా సెప్టెంబర్ 1 నైరుతి రుతుపవనాలు పూర్తిగా నిష్క్రమిస్తాయని, అయితే పశ్చిమ రాజస్తాన్ ప్రాంతంలో నైరుతి రుతుపవనాలు చురుకుగా ఉన్నాయని తెలిపింది. వాయవ్య మధ్యప్రదేశ్ ప్రాంతంలో కొనసాగుతున్న అల్ప పీడనం వల్ల వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ. అల్పపీడనం కారణంగా ఏర్పడిన అధిక తేమకు అధిక ఉష్ణోగ్రతలు తోడవ్వడంతో ఉత్తర భారత్‌లోని చాలా ప్రాంతాలు మరో వారంపాటు అధిక హ్యుమిడిటీని ఎదుర్కొంటాయని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment