
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నైరుతి రుతు పవనాల విస్తరణ కొనసాగుతోంది. ఉత్తర అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, గుజరాత్, డయ్యూలలోని మొత్తం ప్రాంతాలు, మధ్యప్రదేశ్‌లో మరికొన్ని ప్రాంతాలు, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, బిహార్‌లలో మిగిలిన ప్రాంతాలు, తూర్పు ఉత్తర ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లోకి సోమవారం నైరుతి రుతుపవనాలు విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
తూర్పు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లలో కొన్ని ప్రాంతాల్లోకి మరో 48 గంటల్లో రుతు పవనాలు విస్తరించే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఈనెల 19న అల్పపీడనం ఏర్పడే అవకాశముందని పేర్కొంది. దీంతో మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలోని కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment