న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాలు నాలుగు రోజులు ఆలస్యంగా కేరళను తాకనున్నాయని భారత వాతావరణ శాఖ శుక్రవారం అంచనా వేసింది. సాధారణంగా జూన్ 1న రావాల్సిన రుతుపవనాలు ఈసారి 5న వస్తాయని తెలిపింది. ఇందులో నాలుగు రోజులు అటు ఇటు తేడా ఉండవచ్చని చెప్పింది. నైరుతి రుతుపవనాలు ఏడాదిలో నాలుగు నెలల పాటు (జూన్ – సెప్టెంబర్) వర్షాన్ని అందిస్తాయి. బంగాళా ఖాతంలో ఏర్పడిన సైక్లోన్ వల్ల అండమాన్ నికోబార్ దీవులకు మే 16నే ఆరు రోజుల ముందుగా రానున్నట్లు తెలిపింది. గతేడాది కూడా అండమాన్‌ను రెండు రోజుల ముందుగానే రుతుపవనాలు తాకినట్లు చెప్పింది. ఈ ఏడాది వర్షపాతం సాధారణంగానే ఉండవచ్చని అంచనా వేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా సాధారణ రుతు పవనాల తేదీలతో 3–7 రోజుల తేడా ఉంటుందని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment