సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో రాగల రెండు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆదివారం తెలిపింది. మరో వైపు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కుదులుతున్నాయి. ఏపీ, కర్ణాటక, తమిళనాడు వరకు విస్తరించాయి. పశ్చిమ దిశ నుంచి తెలంగాణ వైపు రుతుపవనాలు విస్తరిస్తున్నాయని వాతావరణశాఖ అధికారులు స్పష్టం చేశారు.
ఇక, ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు ఆదిలాబాద్, కొమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం చెప్పింది. మిగతా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది. అదే సమయంలో ఈ జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశాలున్నాయని హెచ్చరించింది.
మరోవైపు.. సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో వానలు పడే సూచనలున్నాయని చెప్పింది. ఇదే సమయంలో వడగాల్పులు కూడా వీచే అవకాశాలున్నాయని హెచ్చరికలు జారీ చేసింది.
Weather update!!
— Telangana state Weatherman (@ts_weather) June 11, 2023
Scattered thuderstorm rains now
Adilabad Nirmal Asifabad Mancherial peddapalli nalgonda
Places will see rains for next 2 hours with gusty winds also ☔⚡
ఇది కూడా చదవండి: AP: ఇక వానలే.. ఏపీలోకి ప్రవేశించిన రుతుపవనాలు
Comments
Please login to add a commentAdd a comment