సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాల విస్తరణ కొనసాగుతోందని, రాబోయే 3–4 రోజుల్లో రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేం ద్రం వెల్లడించింది. దక్షిణ కర్ణాటకతో పాటు రాయలసీమలోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడులోని చాలా ప్రాం తాలు, నైరుతి, తూర్పు మధ్య బంగాళాఖాతంలో మొత్తం ప్రాంతాలు, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరికొ న్ని, వాయవ్య బంగాళాఖాతంలో కొన్ని, ఈశాన్య బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాల్లోకి ఇప్పటికే రుతుపవనాలు విస్తరించాయని తెలిపింది.
మధ్య అరేబియా సముద్రం, గోవా, కొంకణ్‌లలోని కొన్ని , కర్ణాటక, రాయలసీమలో మరికొన్ని, తమిళనాడులో మిగిలిన ప్రాంతాలు, కోస్తాలోని కొన్ని, మధ్య, ఉత్తర బంగాళాఖాతంలోని మరికొన్ని, ఈశాన్య భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లోకి వచ్చే రెండు, మూడ్రోజుల్లో రుతుపవనాలు విస్తరించే అవకాశముందని, ఆ తర్వాతి ఒకట్రెండు రోజుల్లో మహా రాష్ట్ర, కర్ణాటక, తెలంగాణలో కొన్ని ప్రాంతాలు, కోస్తాలో మరికొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరిస్తాయని వివరించింది. ఇటు తూర్పు మధ్య బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వచ్చే 48 గంటల్లో తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి, 24 గం టల్లో పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి బలపడే అవకాశముంది. ఈ కారణంగా తెలంగాణలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో సోమవారం పలుచోట్ల, మంగళవారం చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఆదివారం నమోదైన ఉష్ణోగ్రతలు
Comments
Please login to add a commentAdd a comment