
న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశంలోని పలు ప్రాంతాల్లో జూన్, జూలై నెలల్లో వర్షాలు కురిశాయి. జూలైలో భారీ వర్షపాతం నమోదయ్యింది. ఆగస్టులో రుతుపవనాలు ముఖం చాటేశాయి. అయితే, అతిత్వరలో రుతుపవనాలు మళ్లీ పుంజుకొనే అవకాశం ఉందని వాతావరణ శాఖ(ఐఎండీ) గురువారం వెల్లడించింది.
మధ్య, దక్షిణ భారతదేశంలో వర్షాలు కురుస్తాయని తెలియజేసింది. సెప్టెంబర్‌లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపింది. 91 నుంచి 109 శాతం వర్షపాతం నమోదవుతుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒకవేళ సెప్టెంబర్‌లో భారీ వర్షాలు కురిసినా.. జూన్–సెప్టెంబర్ సీజన్‌లో సగటు కంటే తక్కువ వర్షపాతం నమోదైనట్లేనని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment