
వారం రోజులు ముందుగానే ఆగమనం
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా.. దేశవ్యాప్తంగానూ నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఈనెల 8వ తేదీ నాటికి దేశమంతటా నైరుతి విస్తరించాల్సి ఉండగా.. వేగంగా కదిలిన నేపథ్యంలో వారం రోజులు ముందుగానే విస్తరించాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఈ కారణంగా రాష్ట్రంలోనూ, దేశంలోనూ క్రమంగా వర్షాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంపై పశ్చిమ గాలుల ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.