చెరువులను తలపిస్తున్న హైదరాబాద్‌ రోడ్లు | Heavy Rain In Hyderabad | Sakshi

హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం

Jun 23 2019 3:25 PM | Updated on Jun 23 2019 8:59 PM

Heavy Rain In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నైరుతి రుతుపవనాల తెలంగాణలో వేగంగా విస్తరిస్తున్నాయి. ఈ ప్రభావంతో హైదరాబాద్‌లోని పలుచోట్ల భారీ వర్షం కురుస్తుంది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, పంజాగుట్ట, మాదాపూర్‌, కూకట్‌పల్లి, ఎస్‌ఆర్‌ నగర్‌, సికింద్రాబాద్‌, కోఠి, దిల్‌సుఖ్‌నగర్‌, చైతన్యపురి, కొత్తపేట, సరూర్‌నగర్‌, మలక్‌పేట, ఎల్‌బీ నగర్‌, సంతోష్‌నగర్‌, అల్వాల్‌, బొల్లారం, మెహదీపట్నంలలో భారీ వర్షం పడుతుంది. కుత్బుల్లాపూర్‌లో భారీ వర్షం కురవడంతో పలు రహదారులు చెరువులను తలపిస్తున్నాయి.  దీంతో వాహనదారులతోపాటు ఆయా కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

పలుచోట్ల వర్షపు నీరు రోడ్డపై  నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. కూకట్‌పల్లిలో డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. గంటపాటు వర్షం కురిస్తేనే రోడ్లు చెరవులను తలపించడంపై నగరవాసులు మండిపడుతున్నారు. మరోవైపు నేడు ఆదివారం సెలవు దినం కావడంతో ఉద్యోగస్తులు చల్లటి వాతావరణాన్నిఆస్వాదిస్తున్నారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement