సాక్షి, హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలు ఆలస్యమవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో జూన్‌లో సాధారణ వర్షపాతంలో 60–70 శాతం మేర తక్కువ నమోద య్యే అవకాశముందని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ వెల్లడించింది. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్), కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధనా సంస్థతో కలిసి రాష్ట్రంలో వర్షపాతం, వ్యవసాయ సంబంధిత అంశాలపై శనివారం సంయుక్త ప్రకటన విడుదల చేసింది. జూలై నుంచి సెప్టెంబర్ వరకు సాధారణం కంటే 60 నుంచి 70 శాతం అధికంగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
ఆగస్టులో దక్షిణ తెలంగాణతో పోలిస్తే ఉత్తర తెలంగాణలో 10 నుంచి 20 శాతం మేర అధిక వర్షపాతం నమోదవుతుందని 2 సంస్థలు అంచనా వేశాయి. నైరుతి రుతుపవనాలు ఆలస్యమవుతుండటంతో కృష్ణా బేసిన్ పరిధిలోని రిజర్వాయర్లకు వరద ఆలస్యమ య్యే అవకాశం ఉంది. రైతులు వర్షాధార పంటలు వెంటనే వేయకుండా.. దుక్కులు సిద్ధం చేసుకోవా లని మెట్ట పరిశోధనా సంస్థ అధికారులు సూచిం చారు. కనీసం 50 నుంచి 60 మి.మీ వర్షపాతం నమోదైన తర్వాతే సోయా, జొన్న, కంది, పెసర, పత్తి తదితర పంటలు వేసుకోవాలని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment