
సాక్షి, హైదరాబాద్: విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వర కు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టం నుంచి సగటున 0.9 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు, ఒకట్రెండు చోట్ల మోస్తరు వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
రానున్న రెండ్రోజులు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల సెల్సియ స్ నుంచి 44 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. గ్రేటర్ హైదరాబాద్ పరిసర జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 38డిగ్రీల సెల్సియస్ నుంచి 41డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతుందని వాతావరణ శాఖ వివరించింది. సోమవారం గరిష్ట ఉష్ణోగ్రత నిజామాబాద్‌లో 41.7 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 20.5 డిగ్రీల సెల్సియస్ నమోదైంది.
ఇది కూడా చదవండి: కాంగ్రెస్ కసరత్తు.. ఎర్రబెల్లిని ఎదుర్కొనే సత్తా ఉన్న నాయకుడెవరు?