వరంగల్ జిల్లాలో చలి తీవ్రత తట్టుకోలేక బుధవారం ఇద్దరు వృద్ధులు మృతి చెందారు.
వరంగల్: వరంగల్ జిల్లాలో చలి తీవ్రత తట్టుకోలేక బుధవారం ఇద్దరు వృద్ధులు మృతి చెందారు. జిల్లాలోని చెన్నారావుపేట మండలం అమీనాబాద్‌కు చెందిన శీలం కనుకయ్య(65) మరణించాడు.
నెల్లికుదురు మండలం ఆలేరుకు చెందిన జి. భద్రయ్య(65) నాలుగు రోజులుగా వీస్తున్న చలిగాలులకు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో భద్రయ్య చనిపోయాడు.