చలి పంజా.. తెలంగాణలో పడిపోయిన ఉష్ణోగ్రతలు | Cold Wave And Temperatures Down In Across India And Telangana, Motorists Are Facing Serious Problems | Sakshi
Sakshi News home page

చలి పంజా.. తెలంగాణలో పడిపోయిన ఉష్ణోగ్రతలు

Published Sun, Jan 5 2025 8:02 AM | Last Updated on Sun, Jan 5 2025 12:24 PM

Cold Wave And Temperatures Down In Across India And Telangana

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. తెలంగాణలో అత్యంత కనిష్టానికి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి పంజా విసురుతోంది. పలు జిల్లాల్లో​ ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి.

తాజాగా తెలంగాణలో సంగారెడ్డిలో ఆరు డిగ్రీలు, కొమురం భీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లాలో 6.1 డిగ్రీ, ఆదిలాబాద్‌లో 6.2 డిగ్రీలు, రంగారెడ్డి 6.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు.. పొగమంచు కూడా ఎక్కువగా ఉంది. దీంతో, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొగ మంచు ప్రభావం రైళ్లు, విమానాలపై కూడా పడింది. ఈ క్రమంలో పలు విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి.

 

ఇదిలా ఉండగా.. ఉత్తరాదిలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. కోల్డ్‌వేవ్‌ కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీలో విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement