నేడు ‘సేవ్ విశాఖ’ మహాధర్నా
విశాఖపట్నం: అధికార పార్టీకి చెందిన కబ్జారాయుళ్ల కబంధహస్తాల్లో చిక్కుకున్న విశాఖ నగరాన్ని రక్షించేందుకు ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ గురువారం నిర్వహించే ‘సేవ్ విశాఖ’ మహాధర్నాకు తరలివచ్చేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. టీడీపీ నేతల భూ కబ్జాల వల్ల రూ. కోట్ల విలువైన భూములను ఎలా కోల్పోయామో చెప్పుకునేందుకు ఇదే సరైన వేదికగా బాధితులంతా భావిస్తున్నారు. జీవీఎంసీ ఎదుట గాంధీ బొమ్మ వద్ద జరిగే ధర్నాలో ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొంటారు. వైఎస్ జగన్ ఉదయం 8 గంటలకు హైదరాబాద్ నుంచి విమానంలో బయల్దేరి 9.30 గంటలకు విశాఖ చేరుకుంటారు.
పీఎస్‌ఎల్వీ సీ38 కౌంట్‌డౌన్ ప్రారంభం
శ్రీహరికోట (సూళ్లూరుపేట): శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని షార్ నుంచి శుక్రవారం నిర్వహించనున్న పీఎస్‌ఎల్వీ సీ38 రాకెట్ ప్రయోగానికి సంబంధించిన కౌంట్ డౌన్‌ను గురువారం ఉదయం ప్రారంభించారు. లాంచ్ రిహార్సల్స్ నిర్వహించి కౌంట్ డౌన్, ప్రయోగ సమయాలను అధికారికంగా ప్రకటించారు.
ఢిల్లీకి సీఎం కేసీఆర్
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. బుధవారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయల్దేరి ఢిల్లీ చేరుకున్నారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ 23న నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. కోవింద్ అభ్యర్థిత్వానికి టీఆర్‌ఎస్ ఇప్పటికే సంపూర్ణ మద్దతు ప్రకటించడం తెలిసిందే. ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతోనూ ముఖ్యమంత్రి భేటీ అవుతారు.
భారత్ x మలేసియా
లండన్: హాకీ వరల్డ్ లీగ్ (హెచ్‌డబ్ల్యూఎల్) సెమీఫైనల్స్ టోర్నమెంట్‌లో గురువారం భారత జట్టు కీలకపోరుకు సిద్ధమైంది. మలేసియా జట్టుతో జరిగే క్వార్టర్ ఫైనల్లో టీమిండియా బరిలోకి దిగనుంది. నెదర్లాండ్స్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో 1–3తో ఓడిన భారత్ ఈ నాకౌట్ మ్యాచ్‌లో విజయమే లక్ష్యంగా పోరాడనుంది.
► ఇవాళ చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
► హైదరాబాద్ : ఇవాళ్టి నుంచి గ్రూప్- 1 ఫిజికల్ పరీక్షలు
టుడే అప్ డేట్స్
Published Thu, Jun 22 2017 7:41 AM | Last Updated on Tue, Sep 5 2017 2:14 PM
Advertisement
Advertisement