ఢిల్లీ : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తుపై నేడు ప్రకటన చేయనున్న అఖిలేష్ యాదవ్.
హైదరాబాద్ : నేటితో తెలంగాణ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు ముగియనున్నాయి. శాసనసభ, మండలిలో ఎస్సీ, బీసీ, మైనార్టీ సంక్షేమంపై చర్చ.
హైదరాబాద్ : నేడు ఎన్టీఆర్ 21వ వర్ధంతి. ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పించనున్న ఎన్టీఆర్ కుటుంబసభ్యులు.
తెలంగాణ : తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ్టి నుంచి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. 10 రోజుల పాటు దక్షిణ కోరియా, జపాన్ దేశాలలో పర్యటిస్తారు.
ఆంధ్రపద్రేశ్ : చిత్తూరు జిల్లాలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు నేడు పర్యటించనున్నారు. తిరుపతి స్విమ్స్ లో డయాలసిస్ బ్లాక్‌ను ఆయన ప్రారంభిస్తారు.
ఆంధ్రప్రదేశ్ : నేడు ఏపీ కాంగ్రెస్ కో ఆర్డినేషన్ కమిటీ విజయవాడలో సమావేశం కానుంది. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ఎస్‌బీఐ జోనల్ ఆఫీస్ వద్ద కాంగ్రెస్ మహాధర్నా.
టుడే న్యూస్ అప్ డేట్స్
Published Wed, Jan 18 2017 8:28 AM | Last Updated on Tue, Sep 5 2017 1:32 AM
Advertisement
Advertisement