►నేడు కశ్మీర్‌కు కోవింద్
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నిక ప్రచారంలో భాగంగా ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ నేడు జమ్మూ కశ్మీర్లో పర్యటించనున్నారు. ఆయనతో పాటు కేంద్రమం త్రి వెంకయ్య నాయుడు ప్రచారంలో పాల్గొంటారు. జూలై 4న రామ్‌నాథ్ కోవింద్ తెలుగు రాష్ట్రాలలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా 4 వ తేదీ ఉదయం హైదరాబాద్‌కు చేరుకుంటారు.
►రేపు నింగిలోకి జీశాట్–17
జీశాట్–17 ఉపగ్రహ ప్రయోగానికి రంగం సిద్ధమైంది. గురువారం వేకువ జామున 2.29 గంటలకు ఫ్రాన్స్ అంతరిక్ష సంస్థ సహకారంతో ఫ్రెంచి గయానాలోని కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి దీనిని ప్రయోగిస్తారు. ఈ ఉపగ్రహం బరువు 3,425 కిలోలు. దీనిని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టేందుకు బుధవారం కౌంట్‌డౌన్ ప్రారంభించ నున్నట్టు సమాచారం. ఏరి యన్–5 ఈసీఏ, వీఏ238 అనే రాకెట్ ద్వారా దీనిని ప్రయోగించనున్నారు. ఫ్రాన్స్‌తో ఉన్న ఒప్పందం ప్రకారం ఇస్రోకు చెందిన సమాచార ఉపగ్రహాలను కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి రోదసీలోకి పంపిస్తుంటారు.
►నేడు వైఎస్సార్‌సీపీ జిల్లా ప్లీనరీ
శ్రీకాకుళం అర్బన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లాస్థాయి ప్లీనరీ సమావేశానికి రంగం సిద్ధమైంది. శ్రీకాకుళంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఉదయం 10 గంటల కు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి, పార్టీ రాజకీయ వ్యవహారాల కమి టీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు.
►ఢిల్లీ : ఇవాళ సా.5గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం
►ఢిల్లీ : ఇవాళ విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా మీరా కుమార్ నామినేషన్
►ఇవాళ మాజీ ప్రధాని పీవీ నరసింహారావుజయంతి
పీవీ ఘాట్లో అధికారికంగా జయంతి ఉత్సవాలు
►శ్రీనగర్ : నేటి నుంచి అమర్ నాథ్ యాత్ర ప్రారంభం.
దాడులకు అవకాశముందని నిఘా వర్గాల హెచ్చరిక
అమర్ నాథ్ యాత్రకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు
►హైదరాబాద్ : తెలంగాణ హౌసింగ్పై ఇవాళ కేబినెట్ సబ్ కమిటీ భేటీ
టుడే అప్డేట్స్
Published Wed, Jun 28 2017 7:41 AM | Last Updated on Tue, Sep 5 2017 2:42 PM
Advertisement
Advertisement