నేడు కర్నూలులో రెండో రోజుకు చేరిన వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జలదీక్ష
- నేడు కర్నూలులో రెండో రోజుకు చేరిన వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జలదీక్ష
- తెలంగాణ సర్కారు అక్రమంగా చేపడుతున్న ప్రాజెక్టులకు వ్యతిరేకంగా జలదీక్ష చేపట్టిన ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్
- నేడు జలదీక్షకు మద్దతుగా ఏపీలోని అన్ని మండల కేంద్రాల్లో వైఎస్ఆర్ సీపీ నేతల దీక్షలు
- నేడు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీకానున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
- నేడు భారత్ కు రానున్న యాపిల్ సీఈవో టిమ్ కుక్. వారం రోజుల్లో ప్రధాని మోదీతో భేటి కానున్న టిమ్ కుక్.
- నేడు చైనాలో ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీలో జర్మనీతో తలపడనున్న భారత్
- నేడు మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్న రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి
- నేడు తమిళనాడులో ప్లస్‌టూ ఫలితాలు విడుదల
- నైరుతి బంగాళాఖాతంలో స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడనం. రేపటికల్లా వాయుగుండంగా మారే సూచనలు
-
ఐపీఎల్-9 షెడ్యూల్: నేడు రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ తో తలపడనున్న ఢిల్లీ డేర్ డెవిల్స్. విశాఖలోని వైఎస్ రాజశేఖరరెడ్డి స్టేడియంలో రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం