టుడే అప్‌డేట్స్ | today updates | Sakshi
Sakshi News home page

టుడే అప్‌డేట్స్

Published Tue, Nov 15 2016 6:49 AM | Last Updated on Mon, Sep 4 2017 8:10 PM

టుడే అప్‌డేట్స్

టుడే అప్‌డేట్స్

  • నేడు థానే కోర్టులో పరువు నష్టం దావా కేసు విచారణ. హాజరుకానున్న ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ
  • హైదరాబాద్: నేడు హైకోర్టులో విచారణకు రానున్న ఓటుకు కోట్లు కేసు
  • నేడు ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక ఒప్పందాలపై చర్చించనున్న ఇజ్రాయెల్ అధ్యక్షుడు రువెన్ రివ్లిన్
  • నేడు సుప్రీంకోర్టులో పెద్దనోట్ల రద్దుపై విచారణ జరగనుంది. రూ.500, రూ.1000 నోట్ల రద్దును వ్యతిరేకిస్తూ దాఖలైన 4 పిటిషన్లను విచారించనున్న సుప్రీంకోర్టు.
  • నేడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం కానుంది. ఢిల్లీలోని ఏపీ భవన్ ఆస్తుల పంపిణీపై చర్చలు.
  • వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లా పర్యటన వాయిదా పడింది. ఈ నెల 17న జిల్లాలోని తొండంగి దివీస్ ప్రభావిత గ్రామాల్లో వైఎస్ జగన్ పర్యటించాల్సి ఉంది. అనివార్య కారణాల వల్ల ఆయన పర్యటన వాయిదా పడింది. ఈ 22 న ఆయా గ్రామాల్లో జగన్ పర్యటించి దివీస్ వ్యతిరేక ఉద్యమానికి మద్ధతు ఇవ్వనున్నారు.
  • నేడు ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. పెద్ద నోట్ల రద్దుపై చర్చించనున్న ఢిల్లీ కేబినెట్
  • నేటి నుంచి ఏటీఎంలలో అందుబాటులోకి రానున్న మరిన్ని కొత్త 2 వేల రూపాయల నోట్లు
  • మరో 10 రోజులు పాతనోట్లు చెల్లుబాటు. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసిన కేంద్ర ప్రభుత్వం. పాత నోట్లతో పౌరసేవల బిల్లులు, రైల్వే, విమాన టికెట్ల కొనుగోలుకు వర్తింపు. పెట్రోలు బంకులు, ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ అవకాశం. హైవేలపై టోల్ రద్దు నవంబర్ 18 వరకూ కొనసాగింపు.
  • నేడు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement