- నేడు హైదరాబాద్‌లో మహిళా దక్షత సమితి, బన్సీలాల్ మాలాని నర్సింగ్ కళాశాలను ప్రారంభించనున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
- నేడు ముంబై, పుణేలో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోదీ. పలు కార్యక్రమాలలో పాల్గొని ప్రసంగించనున్న మోదీ
- నేటి నుంచి మూడు రోజులపాటు వైఎస్ఆర్ జిల్లాలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన. శని, ఆదివారాలలో క్రిస్మస్ పండుగ కార్యక్రమాలలో కుటుంబసభ్యులతో కలిసి పాల్గొననున్నారు.
- కాకినాడ ప్రభుత్వాసుప్రతిలో జూనియర్ డాక్టర్ల ఆందోళన. డాక్టర్ సలీంను పిఠాపురం ఎమ్మెల్యే(టీడీపీ) వర్మ దుర్భాషలాడారంటూ జూడాల నిరసన. వర్మను అరెస్ట్ చేయనిపక్షంలో నేటి నుంచి ఎమర్జెన్సీ విధులు బహిష్కరిస్తామని జాడాల హెచ్చరిక
- నేడు హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో చేపట్టనున్న ర్యాలీలో పాల్గొననున్న ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ
- నేటి ఉదయం విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్ లో వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసిన "స్వస్థ వైద్య వాహిని" కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
- ఢిల్లీ: పొగమంచు కారణంగా ఢిల్లీకి వెళ్లనున్న 52 రైళ్ల ఆలస్యం. మరో 5 రైళ్ల రీషెడ్యూల్. ఓ ట్రైన్ సర్వీస్ రద్దు చేసిన అధికారులు
టుడే అప్‌డేట్స్
Published Sat, Dec 24 2016 8:33 AM | Last Updated on Mon, Sep 4 2017 11:31 PM
Advertisement
Advertisement