- నేడు హైదరాబాద్ లోని ఆర్మీ కాలేజీ స్నాతకోత్సవంలో పాల్గొననున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
- నేడు సీఎం దత్తతగ్రామాలు ఎర్రవల్లి, నర్సన్నపేటలో డబుల్ బెడ్ రూం ఇళ్ల ప్రారంభోత్సవం. ఎర్రవల్లిలో డబుల్ బెడ్ రూం ఇళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొననున్న సీఎం కేసీఆర్
- నేడు మాజీ ప్రధాని పీవీ నరసింహరావు 12వ వర్ధంతి. ఈ సందర్భంగా నెక్లెస్ రోడ్డులోని పీవీ జ్ఞానభూమిలో నేటి ఉదయం సర్వమత ప్రార్థనలు
- నేడు దేశ రాజధాని ఢిల్లీలో రెండో రోజు కొనసాగనున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం
- నేడు తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి ఎస్ఎఫ్ఐ పిలుపు. ప్రైవేట్ వర్సిటీల బిల్లును వ్యతిరేకిస్తూ అసెంబ్లీని ముట్టడించాలని విద్యార్థి యూనియన్ నిర్ణయం
- విజయవాడలో నేడు ఛలో వెలగపూడి కార్యక్రమానికి ఏపీసీసీ పిలుపు. సీఎం చంద్రబాబు ప్రభుత్వ వైఖరికి నిరసనగా కాంగ్రెస్ నేతల ఆందోళన
- హైదరాబాద్: నేడు ఎల్బీ స్డేడియంలో స్వచ్ఛ సర్వేక్షణ్ అవగాహన కార్యక్రమం. హాజరుకానున్న కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ
- నేటి ఉదయం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద దర్నా చేపట్టనున్న యూత్ కాంగ్రెస్. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, లక్ష ఉద్యోగాల హామీ అమలుకు యూత్ కాంగ్రెస్ డిమాండ్
- నేటి నుంచి అంతర్జాతీయ కూచిపుడి నృత్యోత్సవాలు. విజయవాడలోని ఇందిరాగాంధీ స్డేడియంలో మూడు రోజులపాటు కొనసాగనున్న ఉత్సవాలు
- నేడు విడుదలకానున్న 1999 గ్రూప్-2 మెరిట్ అభ్యర్థుల జాబితా
టుడే అప్‌డేట్స్
Published Fri, Dec 23 2016 8:30 AM | Last Updated on Mon, Sep 4 2017 11:26 PM
Advertisement
Advertisement