- పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌కు వివరించనున్నారు. ఇందుకోసం ఒక ప్రతినిధి బృందంతో నేటి సాయంత్రం 4 గంటలకు రాజభవన్‌లో గవర్నర్‌ను ఆయన కలుసుకోనున్నారు.
- నేటి నుంచి ఏపీలో చంద్రన్న క్రిస్మస్ కానుకల పంపిణీ. విజయవాడ మండలం ఎనికేపాడులో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పంపిణీ
- తెలంగాణలో నేడు కొనసాగనున్న అసెంబ్లీ సమావేశాలు. శాసనసభలో నేడు మిషన్ భగీరథపై, శాసనమండలిలో మిషన్ కాకతీయపై చర్చ జరనుంది.
- హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)లో భారీ కుంభకోణం. రూ.120 కోట్ల కుంబకోణానికి పాల్పడినట్లు డిలైట్ సంస్థ దర్యాప్తులో వెల్లడి. హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్షద్ అయుబ్, సెక్రటరీ జాన్ మనోజ్ పై ఉప్పల్ పీఎస్ లో కేసు నమోదు. విచారణ చేపట్టిన పోలీసులు
- బెర్లిన్ లోని క్రిస్మస్ మార్కెట్లో ట్రక్కు బీభత్సం. జనావాసాలపై దూసుకెళ్లడంతో పలువురు దుర్మరణం. 50 మందికి పైగా గాయపడ్డారని చెబుతున్న అధికారులు
- నేడు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించనున్న అధికారులు
- న్యూఢిల్లీలో నేడు అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య నుంచి అవార్డు స్వీకరించనున్న బాక్సర్ మేరీ కోమ్
- చెన్నై చెపాక్ స్డేడియంలో ఇంగ్లండ్, భారత్ మధ్య చివరిటెస్టు ఐదో రోజు ఆట కొనసాగింపు
టుడే న్యూస్ అప్‌డేట్స్
Published Tue, Dec 20 2016 7:02 AM | Last Updated on Mon, Sep 4 2017 11:12 PM
Advertisement
Advertisement