ఆరోగ్యశ్రీ బకాయిల చెల్లింపులో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రైవేటు, నర్సింగ్ హోమ్‌లలో సాధారణ ఆరోగ్యశ్రీ సర్వీసులతోపాటు ఎంప్లాయూస్ హెల్త్ స్కీం సర్వీసులనూ నిలిపివేస్తున్నట్లు తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్‌హోమ్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది.
-
హైదరాబాద్: ఆరోగ్యశ్రీ బకాయిల చెల్లింపులో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రైవేటు, నర్సింగ్ హోమ్‌లలో సాధారణ ఆరోగ్యశ్రీ సర్వీసులతోపాటు ఎంప్లాయూస్ హెల్త్ స్కీం సర్వీసులనూ నిలిపివేస్తున్నట్లు తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్‌హోమ్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది.
- నీటి కరువుతో అల్లాడుతున్న ఉత్తర తెలంగాణ జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు ఉద్దేశించిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులకు సోమవారం తొలి అడుగు పడనుంది. ఉదయం మేడిగడ్డ బ్యారేజీ వద్ద ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు భూమి పూజ చేయనున్నారు.
- రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తున్నా సహాయ చర్యలు చేపట్టకుండా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేయనుంది.
- ఆంధ్రప్రదేశ్లోని అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు చేసి ఖాళీ బిందెలతో నిరసన తెలుపనున్న వైఎస్ఆర్సీపీ
- గుంటూరు జిల్లా మాచర్లలో పాల్గోనున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
- ఇటీవల వాయిదా వేసిన ఎంసెట్, ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) తేదీలను విద్యా శాఖ సోమవారం అధికారికంగా ఖరారు చేయనుంది. మధ్యాహ్నం 3:30 గంటలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వద్ద జరిగే సమీక్ష సమావేశంలో ఈ పరీక్షల తేదీలను నిర్ణయించనున్నారు.
-
పాలీసెట్-2016 ఫలితాలను సోమవారం విడుదల చేయాలని నిర్ణయించినట్లు సాంకేతిక విద్య డెరైక్టర్ డాక్టర్ ఎంవీ రెడ్డి తెలిపారు. సచివాలయంలో మధ్యాహ్నం ఫలితాలను విద్యా శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య విడుదల చేయనున్నారు.
-
విజయవాడ: నేడు ఏపీ కేబినెట్ సమావేశం
కరువు తీవ్రత, తాగునీటి ఎద్దడితోపాటూ పలు అంశాలపై చర్చించనున్న కేబినెట్ - నేటి నుంచి ఆచార్య నాగార్జున వర్సిటీలో పీజీ సెట్ ప్రవేశ పరీక్షలు
- ఐపీఎల్ 9: నేడు బెంగళురు వర్సెస్ కోల్కతా మ్యాచ్(రాత్రి 8 గంటలకు)