టుడే న్యూస్‌ అప్‌డేట్స్‌ | today updates | Sakshi
Sakshi News home page

టుడే న్యూస్‌ అప్‌డేట్స్‌

Published Sun, Jan 22 2017 8:38 AM | Last Updated on Tue, Sep 5 2017 1:51 AM

today updates

  • యూపీ: నేడు అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్న సమాజ్ వాదీ పార్టీ. ఉదయం 11 గంటల సమయంలో మేనిఫెస్టో విడుదల చేయనున్న సీఎం అఖిలేష్ యాదవ్
  • నేడు డెహ్రాడూన్ లో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోదీ. ఇక్కడి ఇండియన్ ఆర్మీ అకాడమీలో యుద్ధ స్మారకస్థూపాన్ని పరిశీలించనున్న ప్రధాని
  • విజయనగరం: శనివారం రాత్రి పట్టాలు తప్పిన హిరాఖండ్ ఎక్స్ ప్రెస్ రైలు. ఇప్పటివరకూ దాదాపు 35 మంది మృతి, పలువురికి గాయాలు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కొనసాగుతున్న సహాయక చర్యలు.
  • చెన్నై: ఇవాళ జల్లికట్టును ప్రారంభించనున్న తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం. ఉదయం పది గంటలకు అలంగనల్లూర్‌లో జల్లికట్టు వేడుకను ప్రారంభించనున్న పన్నీర్ సెల్వం.
  • హైదరాబాద్ లోని బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్‌లో ప్రారంభమైన 28వ జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలు. పాల్గొన్న రవాణా మంత్రి మహేందర్ రెడ్డి, సీపీ మహేందర్ రెడ్డి. ప్రతి మూడు నెలలకోసారి రోడ్డు సేఫ్టీపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్న అధికారులు.
  • కోల్‌కతా: నేడు భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య మధ్యాహ్నం1.30 గంటలకు ఈడెన్ గార్డెన్ లో ఇక్కడ  చివరి వన్డే జరగనుంది. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకున్న భారత్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement