టుడే న్యూస్‌ అప్‌డేట్స్ | News Updates for the day of 23rd january 2017 | Sakshi
Sakshi News home page

టుడే న్యూస్‌ అప్‌డేట్స్

Published Mon, Jan 23 2017 8:29 AM | Last Updated on Tue, Sep 5 2017 1:55 AM

News Updates for the day of 23rd january 2017

విజయనగరం : ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు విజయనగరంలో పర్యటిస్తారు. కూనేరు రైలు ప్రమాద ఘటనా స్థలాన్ని ఆయన పరిశీలిస్తారు. రైలు ప్రమాద ఘటన బాధిత కుటుంబాలను వైఎస్‌ జగన్‌ పరామర్శిస్తారు.

అమరావతి : పోలవరం ప్రాజెక్టుపై ఇవాళ సీఎం చంద్రబాబు సమీక్ష.

ఢిల్లీ : నేడు ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. నగదు రహిత లావాదేవీలపై బాబు నేతృత్వంలోని ముఖ్యమంత్రుల కమిటీ రేపు ప్రధాని మోదీకి నివేదిక ఇవ్వనున్నారు.

తెలంగాణ : నేడు మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డితో నెదర్లాండ్ ప్రతినిధుల బృందం భేటీ. అగ్రి బిజినెస్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌పై ఎంవోయూ.

చెన్నై : తమిళనాడులో జల్లికట్టు కోసం విద్యార్థులు చేస్తున్న పోరాటం ఏడో రోజు కొనసాగుతోంది. అసెంబ్లీలో తీర్మానం చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.  

బిజినెస్‌  : ఇవాళ్టి నుంచి బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ తొలి పబ్లిక్‌ ఆఫర్‌(ఐపీవో)ను ప్రారంభించనుంది. దీని ద్వారా రూ.1243 కోట్ల నిధులు సేకరించనున్న బీఎస్‌ఈ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement