తిరుపతిలోని ఎస్వీ విశ్వవిద్యాలయం 104వ సైన్స్ కాంగ్రెస్ సదస్సుకు వేదిక కానుంది.
- నేటి నుంచి శనివారం వరకూ తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రాంగణంలో జరగనున్న 104వ సైన్స్ కాంగ్రెస్. నేటి ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. తర్వాత నోబెల్ పురస్కార గ్రహీతలతో ముఖాముఖి నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, గవర్నర్ నరసింహన్, కేంద్ర, రాష్ట్రమంత్రులు హాజరవుతున్నారు.
- నేడు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. బాణసంచా యూనిట్ దగ్ధమై మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించడానికి నెల్లూరుకు వెళుతున్న వైఎస్ జగన్. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని కూడా జగన్ పరామర్శిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
- నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్న సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్. ఇఛ్చాపురంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులతో పవన్ ముఖాముఖి
- చిత్తూరు జిల్లా తిరుమలలో శ్రీవారిని దర్శించుకోనున్న ప్రధాని నరేంద్ర మోదీ. స్వల్ప విశ్రాంతి తర్వాత తిరుగు ప్రయాణం. ప్రధాని రాక సందర్భంగా తిరుమల ఆలయంలో మంగళవారం వీఐపీ దర్శనం రద్దు చేశారు.
- నేడు ఢిల్లీలో సీఈసీని కలవనున్న యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ వర్గం. సైకిల్ గుర్తు తమకే ఇవ్వాలని కోరనున్న రాంగోపాల్ యాదవ్
- ఢిల్లీ: దట్టమైన పొగమంచు కారణంగా పలు విమాన, రైలు సర్వీసులు ఆలస్యం. కొన్ని సర్వీసులను రద్దు చేసిన అధికారులు.
- నేడు ఎర్రవల్లి, నరసన్నపేటలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించనున్న కేంద్ర మంత్రి విజయ్ గోయల్
- న్యూఢిల్లీ: ఎన్నికలు జరిగే అయిదు రాష్ట్రాల చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లతో సీఈసీ సమావేశం. 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌పై సీఈసీ కసరత్తు. ఎన్నికల ఏర్పాట్లు బందోబస్తుపై సమీక్షించనున్న సీఈసీ
- హైదరాబాద్: ఉత్తరాదిలో పొగమంచు కారణంగా తెలంగాణ ఎక్స్ ప్రెస్ ఆలస్యం. మధ్యాహ్నం 1:25 గంటలకు బయలుదేరనున్న తెలంగాణ ఎక్స్ ప్రెస్
- తిరుమల: నేడు శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. ఉదయం 6 నుంచి 11 గంటల వరకు ఆలయశుద్ధి కార్యక్రమం. 11 తర్వాతే భక్తులకు స్వామివారి దర్శనం