♦ ఢిల్లీ: అమరావతి ప్రాజెక్టుకు సంబంధించిన పర్యావరణ అనుమతులను సవాల్ చేస్తూ ఎన్జీటీలో దాఖలైన పలు పిటిషన్లను జస్టిస్ స్వతంత్రకుమార్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారించింది. ఎన్జీటీలో వాదనలు నేడూ కొనసాగనున్నాయి.
♦ చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి బుధవారం చంద్రగిరికి రానున్నారు. వైఎస్‌ఎంఆర్ కల్యాణ మండపంలో జరిగే బంధువుల వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులు శుభకర్‌రెడ్డి, నళినీరెడ్డిలను ఆశీర్వదించనున్నారు.
♦ హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్ట్ పై ఇవాళ మంత్రి హరీష్ రావు సమీక్ష
భూ సేకరణ, పనుల పురోగతిపై సమీక్షించనున్న హరీష్ రావు
♦ మల్కన్ గిరి ఎన్కౌంటర్పై నేడు ఢిల్లీలో ప్రజాసంఘాల నిరసన
జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించనున్న ప్రజాసంఘాలు
♦ హైదరాబాద్: నేటి నుంచి రెండ్రోజులపాటు ఇక్రిశాట్లో అంతర్జాతీయ సదస్సు
వాతావరణ మార్పులు, నీరు, వ్యవసాయం, ఆహార భద్రత పై సదస్సు
పాల్గొననున్న ప్రపంచ ప్రఖ్యాత పరిశోధన సంస్థల ప్రతినిధులు
♦ హైదరాబాద్: టీఆర్ఎస్ జిల్లా కమిటీలపై నేడు తుది కసరత్తు
♦ఇవాళ్టి నుంచి మూడ్రోజులపాటు నేపాల్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పర్యటన
♦ గంభీర్ ఉంటాడా?... ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ కు భారత్ క్రికెట్ జట్టు ఎంపిక నేడు