- న్యూఢిల్లీ: నేడు రెండోరోజు కొనసాగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం. త్వరలో ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై బీజేపీ చర్చ.
- కర్నూలు జిల్లాలో మూడో రోజుకు చేరుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రైతు భరోసా యాత్ర. కర్నూలు జిల్లా రైతులతో వైఎస్ జగన్ ముఖాముఖి
- నేడు సూర్యాపేట కలెక్టరేట్ వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష. నోట్ల రద్దు సమస్యలపై మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి ఆధ్వర్యంలో దీక్ష చేయనున్న నేతలు. హాజరుకానున్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి
- తిరుపతిలో నేటితో ముగియనున్న ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదరస్సు. ముఖ్య అతిథిగా మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ హాజరవనున్నారని ఎస్వీ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఆవుల దామోదరం తెలిపారు.
- నేడు ఢిల్లీలో వక్ఫ్ బోర్డు జాతీయస్థాయి సమావేశం. హాజరుకానున్న అన్ని రాష్ట్రాల బోర్డుల చైర్ పర్సన్స్, సీఈవోలు, ఇతర ఉన్నతాధికారులు
- నేడు పుణేలో రెండో డిజీ ధన్ మేళా నిర్వహించనున్న కేంద్ర ప్రభుత్వం
- నేడు శ్రీలంకలో పర్యటించనున్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడు
- భారత పర్యటనలో ఉన్న పోర్చుగల్ ప్రధాని ఆంటోనియో కోస్టా. నేడు ఢిల్లీలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని నరేంద్రమోదీలతో ఆంటోనియా కోస్టా భేటీ.
- ఫ్లోరిడా ఎయిర్ పోర్టులో గుర్తుతెలియని దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ దాడిలో ఐదుగురు మృతిచెందగా, 8మందికి గాయాలయ్యాయి. ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాడర్డేల్ ఎయిర్ పోర్టును మూసివేశారు.
- ఢిల్లీ: పొగమంచు కారణంగా పలు రైలు, విమాన సర్వీసులకు అంతరాయం. 70 రైళ్లు ఆలస్యం, 16 రైళ్ల వేళలలో మార్పులు. 7 సర్వీసులకు రద్దు చేసిన రైల్వేశాఖ. ఢిల్లీలో రెండు విదేశీ విమాన సర్వీసులు, నాలుగు డొమెస్టిక్ సర్వీసులు ఆలస్యం.
- పీబీఎల్-2: నేడు బెంగళూరు బ్లాస్టర్స్ వర్సెస్ హైదరాబాద్ హంటర్స్ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం
-
న్యూఢిల్లీ: ప్రొ రెజ్లింగ్‌లో నేడు ముంబై మహారథి వర్సెస్ యూపీ దంగల్ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం
టుడే అప్‌డేట్స్
Published Sat, Jan 7 2017 7:29 AM | Last Updated on Tue, Sep 5 2017 12:41 AM
Advertisement
Advertisement