
టుడే అప్‌డేట్స్
- నేటి ఉదయం తిరువనంతపురంలో జరిగే ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సమావేశాలకు హాజరుకానున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. అనంతరం మైసూరులో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జాతీయ సమ్మేళనంలో పాల్గొంటారు. తిరిగి నేటి రాత్రి హైదరాబాద్‌కు చేరుకోనున్న రాష్ట్రపతి
- నేడు (గురువారం) తమిళనాడు రాష్ట్రమంతటా నెలకొన్న ఉత్కంఠ. అందరిచూపులూ అన్నాడీఎంకే వైపు. ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎంపిక జరిగేనా లేదా అనే చర్చ నేపథ్యంలో చెన్నైలో గురువారం జరుగుతున్న పార్టీ సర్వ సభ్య సమావేశమే ఈ ప్రత్యేక పరిస్థితులకు కారణం.
- తమిళనాడు మాజీ సీఎం జయలలిత మృతిపై నేడు మద్రాసు హైకోర్టులో విచారణ జరగనుంది. అనుమానాస్పద రీతిలో తమిళనాడు సీఎం జయలలిత మృతి చెందినందున సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులు ముగ్గురితో కమిటీని ఏర్పాటు చేయాలని చెన్నై అరుంబాక్కంకు చెందిన జోసెఫ్ హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
- హైదరాబాద్ లో నేటి ఉదయం 9 గంటలకు సీఎల్పీ సమావేశం
- హైదరాబాద్: నేడు రాష్ట్ర వ్యాప్తంగా సీపీఎం నిరసనలు. భూ సేకరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సీపీఎం నేతల ఆందోళనలు
- ఢిల్లీ: దట్టమైన పొగమంచు కారణంగా 5 అంతర్జాతీయ, 9 దేశీయ విమాన సర్వీసులు ఆలస్యం. ఒక విమాన సర్వీసు రద్దు చేసిన అధికారులు
- హాలీవుడ్ ప్రముఖ నటి డెబ్బీ రెనాల్డ్స్(84) కన్నుమూత. కూతురు, నటి క్యారీ ఫిషర్ చనిపోయిన మరుసటి రోజే ఈ ఘటన