- బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోదీ నేడు కర్ణాటకలో పర్యటించనున్నారు. 14వ ప్రవాసీ భారతీయ దివాస్ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించనున్న ప్రధాని మోదీ. ముఖ్య అతిథిగా పాల్గొననున్న పోర్చుగల్ ప్రధాని ఆంటోనియో కోస్టా
- నేడు కర్నూలు జిల్లాలో నాలుగోరోజుకు చేరిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర. వేల్పనూరు నుంచి ప్రారంభంకానున్న నేటి యాత్ర. లింగాపురంలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న వైఎస్ జగన్
- విజయవాడలో నేటి ఉదయం ఇందిగాంధీ మున్సిపల్ స్డేడియం నుంచి అమరావతి మారథాన్ రన్ ఘనంగా ప్రారంభమైంది. జెండా ఊపి మారథాన్ రన్ ప్రారంభించిన మంత్రులు దేవినేని, ప్రతిపాటి పుల్లారావు, ఎంపీ కేశినేని, కలెక్టర్ బాబు, సీపీ గౌతం సవాంగ్
- ఢిల్లీ: పొగమంచు కారణంగా 41 రైళ్ల ఆలస్యం. 14 సర్వీసులు రీ షెడ్యూలు, 5 రైళ్లను రద్దు చేసిన రైల్వేశాఖ. 7 అంతర్జాతీయ విమాన రాకపోకలకు, 2 డొమెస్టిక్ విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడగా, రెండు విమాన సర్వీసులు రద్దుచేసిన అధికారులు
- పాక్ జలసంధి వద్ద పదిమంది భారత జాలర్లను అదుపులోకి తీసుకున్న లంక నేవీ అధికారులు
- సిరియా: అజాజ్‌లో తిరుగుబాటుదారుల దుశ్చర్య. భారీ ట్యాంకర్ పేలుడు ఘటనలో 48 మంది మృతి
- నెల్లూరు జిల్లాలో స్వల్ప భూ ప్రకంపనలు. నేటి ఉదయం వింజమూరు, దుత్తలూరు సహా పలు గ్రామాల్లో ప్రకంపనలు. భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు
- తిరుమల: వైకుంఠ ఏకాదశి సందర్భంగా అర్ధరాత్రి నుంచే తిరుమలకు పొటెత్తిన భక్తులు. నేటి నుంచి రెండు రోజులపాటు స్వామివారి దివ్యదర్శనం, ప్రత్యేక దర్శనాలతో పాటు సిఫారసు లేఖలు, ఆర్జిత సేవలను రద్దుచేసిన టీటీడీ.
- హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. పొగమంచు కారణంగా రోడ్డు స్పష్టంగా కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
టుడే అప్‌డేట్స్
Published Sun, Jan 8 2017 8:23 AM | Last Updated on Tue, Sep 5 2017 12:45 AM
Advertisement
Advertisement