టుడే అప్‌డేట్స్ | today updates | Sakshi
Sakshi News home page

టుడే అప్‌డేట్స్

Published Sun, Nov 20 2016 7:24 AM | Last Updated on Mon, Sep 4 2017 8:38 PM

today updates

  • న్యూఢిల్లీలో నేటి మధ్యాహ్నం కేంద్ర మంత్రి పియుష్ గోయల్‌తో భేటీకానున్న తెలంగాణ సీఎం కేసీఆర్
  • నేడు బ్యాంకులకు సెలవుదినం. దేశవ్యాప్తంగా కొత్తనోట్ల కొరతతో జనాలకు ఇక్కట్లు కొనసాగుతున్నాయి.
  • ప్రపంచంలో మొట్టమొదటగా ఆర్టిఫీసియల్ హార్ట్ ట్రాన్స్ ప్లాంట్ చేసిన ప్రముఖ అమెరికా వైద్యుడు డెంటన్ కూలే(96) మృతి
  • ఉత్తరప్రదేశ్‌లో ఆదివారం వేకువజామున ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. యూపీలోని దేహత్ జిల్లా కాన్పుర్ సమీపంలోని పక్హరయన్‌ వద్ద పట్నా-ఇండోర్ ఎక్స్‌ప్రెస్ రైలు 14 బోగీలు పట్టాలు తప్పడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద ఘటనపై సీఎం అఖిలేష్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. హెల్ప్ లైన్ నంబర్లు: 05101072, 051621072, 05121072
  • రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు గణనీయంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు. పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు
  • నేడు(ఆదివారం) అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం
  • తమిళనాడు రామేశ్వరానికి చెందిన 11 మంది జాలర్లను అదుపులోకి తీసుకున్న శ్రీలంక నేవీ అధికారులు. రెండు బోట్లు కూడా సీజ్ చేశారు.
  • నేడు చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్ ఫైనల్. ఫైనల్లో చైనా ప్లేయర్ సున్ యుతో తలపడనున్న భారత స్టార్ షట్లర్ పీవీ సింధు
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement